Sunday, 16 June 2019

ఓం రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

 ప్రేమకు ప్రేమే సాక్షి-21*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 

సీతారాములు ఇద్దరు కలసి అక్కడ దగ్గర ఉన్న ఒక శివాలయమునకు చేరారు . 
తమకోరికలు మహాశివునికి తెలియపరిచారు
అక్కడే చాలామంది నృత్యం చేస్తూ ఏవో పాటలు పాడుతున్నారు. ఆ పాటలలో లీనమై పోయినారు.    

నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 
  
పరంజ్యోతి పరమాత్మా
దివ్యవెలుగందించే దవ్యాత్మా
స్వరాలను అందించే స్వరాత్మా
ధు:ఖాన్ని తొలగించే సకలాత్మా

నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 

మచ్చలేని మహితాత్మా 
రచ్చచేయని రశికాత్మా
సత్యపలుకు సత్యాత్మా
హితాన్ని చేసే వేదాత్మా

నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 

మంగళకర మనో నేత్రాత్మా
శుభకర శోభ మహితాత్మా
దినకర దివ్య ప్రధానాత్మా
శరణాగత రక్ష విభూదాత్మా

నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 

నవ శిధ్ధులందించే కర్మాత్మా 
ఆశీర్వదించే భూతనదాత్మా 
ఆరోగ్యానందించే తృప్తాత్మా 
ఆదర్శాలను తెలిపే ధర్మాత్మా 

నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 

ప్రేతాత్మలను ఏకం చేసే శివాత్మా
దుష్టులను సంహరించే దుష్టాత్మా 
సమస్త లోకాలను రక్షించే లోకాత్మా  
ఆత్మలకే ఆత్మవైన ఓ శివాత్మా


నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 
నమ:శివాయ .... నమ:శివాయ ....నమ:శివాయ .... 
వీరుకుడా తన్మయత్వంతో మునిగి పోయారు, మరొక్కసారి శివ శివ శంభో ... శివశివశంభో ....

-((**))--


ప్రేమకు ప్రేమే సాక్షి-19*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 


సీతారాములు కాలేజీలో చేరారు, అక్కడ నవ్వుల మధ్య చదువు నత్తనడక సాగుతున్నది. 

సీత మాత్రం అందరిలో ఒక మని పూసగా ఉన్నది, హుందాతనంతో వన్నెతెచ్చే  విధంగా మృదు మధుర పలుకులతో గురువుల సైతం ఆకర్షణకు లోనైనది. 
దృఢ సంకల్పంతో చదువుతున్నది అప్పుడే ఎవరో లెటర్ ఇచ్చారు, చదవటం ప్రారంభించింది సీత.

పండు వెన్నెల కాంతివా 
నిండు పున్నమి బ్రాంతివా  
అంబరంలో మెరిసే మెరుపువా 
తల్ కు తల్ కు మెరిసే తారవా
ఉదయపు కిరణానివా 
ఇదే నా సుప్రభాతం 

నులు వెచ్చని సమయంలో 
శీతల పవనంలా కమ్మాలని ఉంది 
పున్నమి జాబిలి వెన్నెలలో
జాము రాత్రి గడపాలని ఉంది
చిగురాటాకుల సవ్వడిలో 
తన్మయత్వం చెందాలని ఉంది
పూల  పరిమళాలతో     
పరవసించి పోవాలని ఉంది      
ఎదను ఎందుకు మీటావు 
హృదయతాపము ఎందుకు పొందుతావు 
అందుకో అధరాలు  
నీవు పిలిచేవరకు వేచి ఉండే 

                          నీ రావణ కాదు రమణ  

చదివి చింపేసింది సీత 


--((**))--




 ప్రేమకు ప్రేమే సాక్షి-20*ప్రాంజలి ప్రభ (ఆనందం - ఆరోగ్యం -ఆధ్యాత్మికం ) 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
సీత రావణ కాని రమణకు ఉత్తరం వ్రాసి పంపింది 

వృధాచేయబోకు సమయం  
నీ నిగ్రహ: శక్తిని మరువకు 
మరచి ప్రవర్తించుట వ్యర్ధము 
నీ తోబుట్టువులను గుర్తించుకో 

మనుష్యజన్మ సదా రాదు నీకు 
జన్మ సార్ధకం మరువకు
చదువుని వ్యర్ధము చేయకు 
యవ్వనము ఎప్పుడు స్థిరము 

ఊరక వాదులాడబోకు
నిన్ను నీవు ముందు గుర్తించుకో 
స్త్రీని గౌరవించటం నేర్చుకో
సిద్ధి పొందే సమయం చాలా ఉంది 
       
గుణాలకు అతీతుడుగా ఉన్నావు 
నీ అనుకరణ మార్చుకో 
నీపై ఆధారపడిన వారిని గమనించు 
స్త్రీని పొందటం నీ లాంటి వాడికి తేలికే 
కాని సుగుణాల రాశి దొరకటం కష్టము 
బుద్ది మార్చుకో తెలివిగా నడుచుకో 
                  మీ శ్రేయోభిలాషి 


మన పెద్దాలు భార్యాభర్త ల సంసారా భధ్యత లు ను జొడెడ్ల బండి తో పోల్చరూ.....ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ....ఒకరి కి ఒకరు కట్టె కాలే వరకు ....వెనుక ముందు అంతే ... పాల నుండీ పెరుగు తరువాత మజ్జిగ, వెన్న నుండి నేయి.... 

మన జీవితం కుడా ఈ చిన్న కధ లోనే ఇమిడి ఉంది,  నిశితముగా పరిశీలిస్తే .. ఎలా అంటే మగవాడు మరిగిన పాలు చల్లారి గొరువెచ్చని .... పాలు లాంటి మగని కి తోడు అంటూ మజ్జిగ అనే మగువను చేరిస్తే చక్కటి చిక్కటి గడ్డ పెరుగు లాంటి మంచి సంసారం మొదలైంది. 



 ఈ చక్కని చిక్కని సంసారం చిలికితేనే మజ్జిగ,వెన్న అనబడే చిట్టి పిల్లలు, సిరి సంపదలు .ఆలుమగలు కరిగి .. మధుర మైన నేతి గా మారి వారి ఆ నేతి తో పిల్లలకూ బంగారూ భవిష్యత్తు తీర్చి దిద్ది ....  కడకు కాటి కి ఆవిరి అయి ఈ లోకం నుండీ ఆవిరి గాల్లో కలిసి పోయి ఎగసి పోతారూ..... చూసారా...తరిచి..తెరచి చూస్తే .... జీవితం ఎంతా చిన్నాదో ....ఏన్ని అరాటాలు ...ఎన్ని ...పోరాటాలో....

దానికి నీవు తగవు 



Saturday, 1 June 2019

ప్రాంజలి ప్రభ -తెలుగు అంతర్జాల వార పత్రిక ( జూన్ - 1 వ వారం)- )


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! చదవండి 

1 . నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.
2 . తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.
3 . అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.
4 .  ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే.. ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది... ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...
5 .  భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం
బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.
6 . సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.
7 . ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ అర్థం చేసుకునే భర్త
ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని... మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.
8 . భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.
9 . ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ... గొప్ప విద్యా వంతురాలి కిందే లెక్క...!
10 . అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.
11 . మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'. 
12 . బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.
13 .  మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.
14 . కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిల బెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.
15   నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.
16 . ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.
17 .  సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.
18   గొడవ పడకుండా ఉండే బంధం కన్నా... ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.
19   పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.
22 . వివాహ వార్షికోత్సవం అంటే ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.
23 . నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!
24 .  సప్తపది ఏడు అడుగులు మొదటి అడుగు - అన్న వృద్ధికి రెండవ అడుగు - బలవృద్ధికి మూడవ అడుగు - ధన వృద్ధికి నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి 
26 . కోరుకున్న ఇంతి... నేడు నీ సతి... నేడు పట్టుకున్న ఆమె చేయి...
విడవకు ఎన్నటికీ.
27 .  వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు. పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.
 కలిమి లేములతో...కలసిన మనసులతో... కలివిడిగా మసలుకో.. కలకాలం సుఖసంతోషాలు పంచుకో...  బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.
పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ... మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.  మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు) ఆడది దారం, అతడికి ఆధారం
(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదు, ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.
 భర్తకి భార్య బలం కావాలి, బలహీనత కాకూడదు, భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదు, భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి, అయోమయం కాకూడదు.  మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు. అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే. పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.
 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.
--((**))--

* తాత - మనుమడు *

       ఆ రోజు ఆదివారం. ఓ యువకుడు ఒక పేరున్న రెష్టారెంట్ ముందు కారు ఆపి క్రిందికి దిగి బేక్ డోర్ తీసాడు. అందులో సుమారు తొంబై దాటిన ముసలాయన ను నెమ్మదిగా చెయూత నిచ్చి నడిపించుకొని రెష్టారెంట్ లోనికి తీసుకు వచ్చాడు. ఓ మూల ఉన్న టూ సిట్టర్ టేబుల్ దగ్గరకు నడిపించుకుని  జాగ్రత్తగా కూర్చో బెట్టాడు. ఆ ముసలాయన మొహం లో ఆనందం కనిపిస్తుంది! భహుశ అతను వాళ్ల తాతయ్య అనుకుంటాను.
చెప్పు గ్రాండ్పా ! ఏంటి తింటావ్ ? అడిగాడు మనవడు.

      నాకు మటన్ చాల ఇష్టం రా అబ్బాయ్ ! కాని పళ్లు లేవుగా! ఎలా తింటాను అన్నాడు.
ఓస్ ! ఇంతే కదా ! అని బేరర్ ను పిలిచి, ఓ ప్లేట్ మటన్ ఖైమా , చాల మెత్తగా బాగుండాలి సుమా ! అని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో! అది అయ్యే లోపు చికెన్ సూప్ ఫ్రెష్ గా పట్టుకు రా ! అని చెప్పాడు.
      
ఐదు నిమిషాల్లో  చికెన్ సూప్ వచ్చింది!
ఆ మనుమడు తన వెంట తెచ్చిన తెల్లటి టవల్ ను తాతయ్య మెడ ముందు అమర్చి....సూప్ నెమ్మదిగా స్పూన్ తో త్రాపిస్తున్నాడు. అయినా అది ఆబోసి నోరు చుట్టూ అంటుకుంది.  కర్చిఫ్ తో మూతి సుభ్రం చేసాడు. ఈ లోగా మటన్ ఖైమా వచ్చింది.
        
           తాతయ్యకు నెమ్మది గా స్పూన్ తో తినిపిస్తున్నాడు.... చాల సమయం పట్టింది...! ఐనా విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెబుతూ....నానమ్మ పై జోకులు వేస్తూ తినిపించాడు.  చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు ఆ తాతయ్య కళ్లలో ఆనందం...ఓ పక్క కంట నీరు.
           
          రెష్టారెంట్ లో అందరూ విచిత్రం గా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏమాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మది గా మరళా నడపించుకొని తీసుకు వెళ్లిపోయాడు.
          
          కొడుకు కోడలు చాల మంచి వాళ్లు ,జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు.మనవడు అలా కాదు. వచ్చిన ప్రతి సారి తాతయ్యను కార్లో వేసుకుని షికారు తిప్పడమే కాకుండా చిన్న పిల్లలకు తినిపించి నట్లు , ఐస్ క్రీమ్స్ , రక రకాల చిరుతిండి తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు! 
ఒక్కరోజుకు ఏం కాదు డాడీ.... నేను చూసుకుంటాను కదా అని....రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ల రసం, టాబ్లెట్ వేసేస్తాడు.
          
        మామూలు సమయంలో చాలఇబ్బంది పడే ముసలాయన.... చిత్రంగా మనవడు వచ్చినపుడు హుషారుగా ఉంటాడు. ఒక్క కంప్లైంట్ కూడ ఉండదు. కొడుకు ముసి ముసిగా నవ్వుకుంటాడు. 
         
           ఓ సారి ఉండ లేక కొడుకుని అడిగాడు..,,ఏరా! వచ్చినపుడల్లా తాతయ్యను కుషీ చేస్తావ్ ! తాతయ్య అంటే అంత ఇష్షమా? 
దానికి కొడుకు చెప్పిన సమాధానం....డాడీ! నా చిన్న తనంలో అమ్మ మీరు క్షణం తీరిక లేకుండా ఉధ్యోగం లో బిజీగా ఉండేవారు. ఇంట్లో నాన్నమ్మ తాతయ్య నా విషయం లో చాల శ్రద్ధ చూపేవాళ్లు. తాతయ్య... నన్ను స్కూల్ నుండి తీసుకొని వస్తూ....నేను ఏది అడిగితె అది కొని ముద్ధు చేసేవాడు. ఒక్కోసారి నా బట్టలు పాడుచెసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తుకువస్తాయి. నేను ఏమిచ్చి వాళ్లను ఆనంద పెట్టగలను. నానమ్మ చనిపోయింది. అందుకే వచ్చిన ప్రతిసారీ తాతయ్య తో ఒక్కరోజైనా గడపి నా జ్ఞాపకాలు సజీవం గా ఉంచుకుంటాను అనిచెప్పాడు.

          సమాధానం విన్న తండ్రి కళ్లలో నీళ్లు....నీ జ్ఞాపకాల మాటేమో గాని... నీవు వచ్చిన వెంటనే తాతయ్య కళ్లలో ఉత్సాహం.. చూస్తుంటే నేను ఆయనకు ఎంత రుణపడి ఉన్నానో అర్ధం అవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ల ముందు కనిపిస్తూంది...!

--((**))--

పట్టుదల ఉంటె సాధించలేనిది లేదు - కధ కాని నిజం చదవండి  

ఐదేళ్లు... ఇంటిముఖం చూడలేదు!
పరీక్షలు తప్పితే... ప్రేమలో విఫలమైతే... 
కాపురంలో మనస్పర్ధలొస్తే...
ఆత్మహత్యే పరిష్కారమనుకుంటారు చాలామంది. 
ఒక్క కారణం చూపి ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు కానీ, ధైర్యంగా బతికి చూపడానికి వందల దారులుంటాయని మర్చిపోతారు. 
కోమల్ గనత్ర మాత్రం అలా చేయలేదు. పెళ్లైన పదిహేను రోజులకే భర్త వదిలేసి వెళ్లిపోతే తన తలరాతను తానే మార్చుకోవాలని కసిగా చదివింది. కష్టాలు దాటుకుని సివిల్స్ ర్యాంకు సాధించింది. గృహహింస బాధితురాలనే ముద్ర చెరిపేసుకుని ఐఏఎస్ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన కోమల్ ఎందరికో ఆదర్శం.
నాకు రోజుకి కనీసం ఓ ఇరవై ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటిలో ‘మా కాలేజీకి లేదా స్కూల్ కి మోటివేషనల్ స్పీకరుగా వచ్చి మీ జీవితపాఠం చెబుతారా’ అని అడిగే కాల్స్ పదైనా ఉంటాయి. సమయం కుదిరితే తప్పకుండా వెళ్లి నా గురించి చెప్పొస్తుంటా. ఇలా రోజూ నాకు ఫోన్లు రావడానికి కారణం నేను ఆరేడు నెలల క్రితం ‘జోష్ టాక్స్ ’ అనే యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే. అది చూసి వివిధ పత్రికలు నా గురించి రాశాయి. ఫలితమే- పలు విద్యాసంస్థలూ సివిల్స్ కోచింగ్ సెంటర్లూ మోటివేషనల్ స్పీకరుగా నన్ను ఆహ్వానించడం. ఈ మధ్యనే గాంధీనగర్ , బొంబే ఐఐటీల నుంచీ పిలుపొచ్చింది. త్వరలోనే ఆ విద్యార్థులకీ నా గురించి చెప్పబోతున్నా. అంతకంటే ముందు నా జీవితానుభవాల్ని మీతో పంచుకుంటా...
మాది గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న సమర్ కుండ్ల. నాన్న టీచర్ . ఆ ప్రాంతంలో అమ్మాయిల పట్ల వివక్ష ఉన్నా మా నాన్న మాత్రం బాగా చదువుకోవాలని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన టీచర్ కావడంతో ఇంట్లోనూ ఎప్పుడూ చదువు గురించే మాట్లాడేవారు. అందుకేనేమో
నేనెప్పుడూ చదువులో ముందుండే దాన్ని. పదో తరగతి, ఇంటర్ గుజరాతీ మాధ్యమంలో పూర్తి చేశాక రాజ్ కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివా. ఆ తరవాత మూడు వేర్వేరు యూనివర్సిటీల నుంచీ సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో బీఏ లిటరేచర్ పూర్తిచేశా. ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా పొందా. అప్పటికే నాకు ఇరవై ఐదేళ్లు నిండాయి. మా బంధువులూ, ఇరుగుపొరుగు వారూ ‘ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తారు... మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారా అసలు’ అని వెటకారంగా మాట్లాడేవారు. నేను పట్టించుకోకుండా సివిల్స్ పైన దృష్టి పెట్టా. ఇంతలో మ్యారేజ్ బ్యూరో ద్వారా రాజ్ కోట్ నుంచి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి న్యూజిలాండ్ లో ఉద్యోగం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆస్తులూ ఉన్నాయి. ‘నా కూతురు విదేశాల్లో స్థిరపడుతుంది’ అనుకున్నారు నాన్న. వెంటనే సంబంధం ఖాయం చేశారు. నేనూ న్యూజిలాండ్ జీవితాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయా. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. అక్కడకు వెళ్ళి ఒక్కరోజైనా గడవకముందే- తమకిచ్చిన కట్నం చాలదనీ అదనంగా మరికొంత కట్నం డబ్బూ, బైకూ, కారూ తీసుకురావాలనీ డిమాండ్ చేశారు. ‘నాన్నది చాలీచాలని జీతం. అవన్నీ ఇచ్చే స్తోమత ఆయనకు లేద’ంటే కొట్టేవారు. అన్నం పెట్టకుండా పస్తులుంచేవారు. అమ్మానాన్నలకు ఈ విషయాలు తెలిస్తే బాధ పడతారని చెప్పేదాన్ని కాదు. ఎంత తిట్టినా కొట్టినా పుట్టింటికి వెళ్లకుండా వాళ్లడిగినవి తేకుండా ఉండటంతో నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఒక రోజు రాత్రి... నన్ను ఇంటి బయట పడుకోమని, నేను నిద్రపోయాక కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా ఇంటికి తాళం వేసుకుని నా భర్త తన తల్లిదండ్రులతో సహా న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.
అతడిని శిక్షించాలని...
కాళ్ల పారాణి ఆరకముందే... పెళ్లైన పదిహేను రోజులకే కట్టుబట్టలతో పుట్టింటికి చేరాల్సి వచ్చింది. నేను ఒంటరిగా వెళ్లడం చూసి బెంగతో వచ్చాననుకున్నారు అమ్మానాన్నలు. నేను చెప్పిన విషయం విన్నాక గుండెలు బాదుకున్నారు. అమ్మ దిగులుతో మంచం పట్టింది. నా భర్త మనసు మార్చుకుని తిరిగి వచ్చాడేమోనని మధ్య మధ్యలో మా అత్తారింటికి వెళ్లి చూసి మూసిన తలుపుల ముందే కాసేపు కూర్చుని వచ్చేదాన్ని. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యూజిలాండ్ లో అతడి వివరాలు తెలియలేదు. అతడు నన్ను అంత అవమానకరంగా వదిలేసి వెళ్లిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. కట్నం కోసం, కారు కోసం నన్ను వదిలేశాడనే బాధకంటే మోసం చేశాడనే కసే నాలో పెరిగింది. ఎలాగైనా అతడిని వెతికి పట్టుకోవాలని మ్యారేజీ బ్యూరోని సంప్రదించా. ‘పెళ్లి కుదర్చడం వరకే మా పని’ అంటూ వారు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని అమ్మ గోల చేసింది. చివరికి న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మెయిల్ కూడా పెట్టా. నెలలు గడిచినా ఎవరూ స్పందించకపోయేసరికి గవర్నర్ జనరల్ కు లేఖ రాశా. ‘అతనెవరో తెలుసుకుంటాం’ అని తిరుగు సమాధానం పంపారు తప్ప ఏ చర్యా తీసుకోలేదు. నా నిస్సహాయ స్థితికి బాధేసింది. దాదాపు ఆరునెలలపాటు తిండీ, నిద్రా మరచి జీవచ్ఛవంలా బతికా. ఏడ్చీ ఏడ్చీ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. రోజులు గడిచే కొద్దీ నాకు నేను సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టా. అటకెక్కిన పుస్తకాలు బయటకు తీశా. చదువు గురించి తప్ప మరో ఆలోచన చేయదల్చుకోలేదు. కానీ నేను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. భర్త మోసం చేయడంతో పుట్టింటికి తిరిగొచ్చిన కూతుర్ని ఆదరించడం తమ బాధ్యతని అమ్మానాన్నలు అనుకున్నా మా వదిన మాత్రం అలా అనుకోలేకపోయింది. నా వల్ల వాళ్ళ డబ్బు ఖర్చయిపోతోందని సాధించేది. ఇరుగుపొరుగు వాళ్లూ రకరకాలుగా మాట్లాడేవారు. ఎంత పట్టించుకోవద్దనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఆ మాటలు మనసును నలిపేసేవి. ఆత్మాభిమానం చంపుకుని అలా పుట్టింట్లో ఉండటం సరికాదనిపించింది.
అందరికీ దూరంగా...
నా కాళ్ళమీద నేను నిలబడాలని టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మా సొంతూరుకు యాభై కిలోమీటర్ల దూరంలోని భావ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా ఉద్యోగమొచ్చింది. ఒంటరిదాన్ని కావడంతో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఓ స్టూడెంట్ తల్లిదండ్రులకు నా గురించి అంతా చెప్పి ఎలాగైనా ఇల్లు అద్దెకి ఇప్పించమని అడిగా. వాళ్లింట్లోనే ఓ గది అద్దెకిచ్చారు. పగలంతా టీచర్ గా పని చేస్తూ సివిల్స్ సాధన మొదలుపెట్టా. కానీ ఆ పల్లెటూళ్ళో ఇంటర్నెట్ , స్మార్ట్ ఫోన్లూ, ఇంగ్లిష్ పత్రికలూ, ల్యాప్ టాపులూ... ఏవీ అందుబాటులో ఉండేవి కాదు. నాకు టీచర్ గా వచ్చేది ఐదు వేల రూపాయల జీతం. అది నెల గడవడానికి తప్ప పుస్తకాలు కొనుక్కోడానికి సరిపోయేది కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసినవాళ్లు అహ్మదాబాద్ లో ప్రభుత్వం సివిల్స్ సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న సర్దార్ పటేల్ అకాడమీ గురించి చెప్పారు. అక్కడకు వెళితే వారాంతంలోనూ శిక్షణ ఇస్తామన్నారు. దాంతో ప్రతి శనీ, ఆదివారాలు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని చేరిపోయా. కానీ భావ్ నగర్ నుంచి నాలుగు బస్సులు మారి నూట డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నేను ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యేది. ఊళ్ళో చాలామంది ‘ఈ అమ్మాయి చదువుకే వెళుతుందో ఇంక దేనికన్నా వెళుతుందో’ అంటూ సూటిపోటి మాటలనేవారు. ఉబికివచ్చే కన్నీళ్ళను గుండెల్లోనే అదిమిపట్టి చదువు మీదే దృష్టి పెట్టేదాన్ని. ఒక్కోసారి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. నా జీవితమే ఇలా ఎందుకైందని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. మానసికంగా శారీరకంగా ఒత్తిడి తట్టుకోలేక నాల్రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. కానీ ఒక్కపూట స్కూలు మానేసినా జీతం రాదు. అందుకే ఆరోగ్యం పాడైనా స్కూలుకెళ్లడం కానీ, కోచింగుకు వెళ్ళడం కానీ మానలేదు.
నాలుగు ప్రయత్నాలు చేసి...
2009లో మొదటిసారి యూపీఎస్ సీ ప్రవేశ పరీక్ష రాశా. ఉద్యోగం, ట్రైనింగ్ కోసం ప్రయాణాల వల్ల అంత మెరుగ్గా ప్రిపేర్ కాలేదనిపించింది. ఎంపికవుతానన్న నమ్మకం లేకపోయింది. అనుకున్నట్టుగానే అయింది కానీ నేను నిరుత్సాహపడలేదు. అదొక అనుభవం అనుకున్నా. రెండోసారి మాత్రం పట్టుదలతో రాశా. ర్యాంకు వస్తుందని ఆశపడ్డా. కానీ మళ్ళీ నిరాశ తప్పలేదు. చాలా బాధనిపించింది. పైగా నా గురించి తెలిసిన వాళ్లు ఫలితాలొచ్చిన ప్రతిసారీ ‘ఐఏఎస్ అంటే అంత ఈజీనా... నీకు ఎప్పుడు రావాలీ...’ అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలకి బదులు చెప్పి తీరాలని 2011లో మూడోసారి మరింత కష్టపడి పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. ఫలితాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయా. అమ్మ ఒళ్లో తల పెట్టుకుని ఏడవాలనిపించింది. కానీ, ఓడిపోయి కన్నీళ్లతో ఆ గుమ్మం తొక్కి నలుగురిలో పలచన కాకూడదని నన్ను నేనే సముదాయించుకున్నా. చివరి ప్రయత్నంగా మరొక్కసారి పరీక్ష రాసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. మూడు ప్రయత్నాల్లో చేసిన తప్పులేంటో విశ్లేషించుకున్నా. ప్రిపరేషన్ పరంగా బలాలూ, బలహీనతల్ని జాబితాగా రాసుకున్నా. బలాలు మరింత పెంచుకుంటూ బలహీనతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేశా. కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లు ఆ కాస్త నిద్ర కూడా పట్టేది కాదు. పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఒక యుద్ధమే చేశా. 2012లో పరీక్ష రాశా. ఈసారి అంచనా తప్పలేదు. 591వ ర్యాంకు వచ్చింది. ఐదేళ్ళపాటు నేను పడిన కష్టం గుర్తొచ్చి కన్నీళ్ళు ఓ పట్టాన ఆగలేదు.
ర్యాంకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది...
అమ్మానాన్నా ఇంటికి రమ్మన్నారుగానీ నేను అట్నుంచి అటే ముస్సోరీ శిక్షణ కేంద్రానికి వెళ్లా. ఆ శిక్షణ పూర్తిచేసుకున్నాకే- ఐదేళ్ల తర్వాత- అమ్మావాళ్లింటికి వెళ్లా. నా గురించి తెలిసి మా ఊళ్లో వాళ్లంతా వచ్చారు. ఒకప్పుడు విమర్శించిన వారే మా పిల్లలకి నువ్వే ఆదర్శమంటూ తెగ మెచ్చుకున్నారు. అప్పటి వరకూ భర్త వదిలేసిన మహిళగా బయటకు రావాలంటే ఏదోలా అనిపించేది. సివిల్స్ సాధించాక అలాంటి ఆలోచనలన్నీ పోయాయి. అందరూ గౌరవంగా చూస్తున్నారు. శిక్షణ అయ్యాక దిల్లీలో డీఆర్ డీవో(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ )లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం డీఆర్ డీవో డైరెక్టర్ హోదాలో ఉన్నా. ఈ ఆరేళ్లలో అమ్మానాన్నల అప్పులన్నీ తీర్చా. అన్నయ్య మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూశా. కుటుంబమంతటినీ విమానంలో దేశవిదేశాలన్నీ తిప్పా. అంతేకాదు సివిల్స్ సాధించాక మా అత్తింటి వాళ్లు రాజ్ కోట్ వచ్చారని తెలిసి అక్కడికి వెళ్లా. ‘జరిగిందేదో జరిగిపోయింది మమ్మల్ని క్షమించు’ అంటూ మా అత్తగారు నా కాళ్లు పట్టుకున్నంత పనిచేసింది. నాకు మాత్రం వాళ్లని వదిలిపెట్టాలనిపించలేదు. కానీ మా నాన్న ‘గౌరవమైన హోదాలో ఉన్నావు. కేసులూ, గొడవలని మనసు పాడుచేసుకోకు. విడాకులిచ్చెయ్ ’ అని చెప్పారు. అలానే చేశా. నాలుగేళ్ల క్రితం ఓ ఉన్నతస్థాయి వ్యక్తి నన్ను ఏరి కోరి పెళ్లాడాడు. మా పాపకిప్పుడు రెండున్నరేళ్లు. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించే వారికి నేను చెప్పేది ఒక్కటే- నన్నూ నేను పడిన కష్టాల్నీ సాధించిన విజయాల్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనీ, ధైర్యంగా అడుగు ముందుకు వేయమనీ...
--((**))--


ప్రాంజలి ప్రభ- చైతన్య గీతం
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

పెళ్ళి పుస్తకం ఒక జీవితం

జీవిత సమరంలో ఒక హృదయం

తాళి అనే బంధానికి చిక్కి

నా యిల్లు అనే వైనానికి చిక్కి
ప్రేమ ద్వేషాలకు తనువే చిక్కి
నయనాల కన్నీరు ఖరీదుకు దక్కె

భాద్యతలతో  త్యాగానికి చిక్కి

రేయి పగలు రెప్పలకు చిక్కి
తనువంతా బాధల్కి చిక్కి
వెన్నంటి ఉండే నమ్మకం దక్కె

హృదయం నవనీతానికి చిక్కి

వేడికి మరిగి కామానికి చిక్కి
శిలను చెక్కినట్లు ఉలికి చిక్కి
నిత్య కళ దోచే ఆకర్షణ కు దక్కె 

చదువులేని దున్నపోతుకు చిక్కి

చదువన్నా గుర్తించని వానికి చిక్కి
జీవితమంతా బంధాలకు చిక్కి
కొవ్వొత్తిలా వెల్గునిచ్చి ప్రృధ్వికి దక్కె

పెళ్ళి పుస్తకం ఒక జీవితం

జీవిత సమరంలో ఒక హృదయం

--((**))--