Sunday, 21 January 2018



వానిప్రభావము
17-02-2018
శబ్దాదిభిః పంచభిరేపంచ
పంచత్వమాపుః స్వగుణేనబద్ధాః ,కురంగ మాతంగ పతంగ మీన భృంగా నరః పంచభిరంచితఃకిమ్!!

1:-కురంగము అనగాలేడి వేణుగాన మునకు భ్రమపడి పరుగిడిపోయి కిరాతునివలలోఁజిక్కునుఅనగానిది శబ్దతన్మాత్రమైనశ్రవణేంద్రియమువలన మోసపోవుచున్నది.

2:-మాతంగగము అనగా ఏనుగు
అనగామగయేనుగనియర్థముకరి
ణిఅనగాఆడయేనుగుమగయేనుగు ఆడయేనుగు కరస్పర్శకుబ్రమసి దానితో పోయి గర్తములో పడుచు న్నది .అనగా ఏను స్పర్శేంద్రియము
వలన మోసపోవుచున్నది.
అడవిలో ఏనుగునపట్టుటకు పెద్ద గొయ్యత్రవ్వి దానిమీద పుల్లుపరిచి ఆకులలములచేతకప్పియుంచి
ఆడయేనుగును వదులుదురు.ఈ ఆడయేనుగునజూచి మగయేనుగు దానితొండమును పట్టకొనగా ఆడ యేనుగు గొయ్యివైపునకు పరుగిడు ను మగయేనుదానినివెంబడిఃచి గొయ్యలో పడును.

3:-పతంగమనగా మిడుత అగ్నిజ్వా
లకుభ్రమచెందిమంటలోపడిప్రాణము విడుచును.ఇది నయనేద్రియ
మువలన మోసపోవుచున్నది.

4:-మీనము అనగా చేప ఎఱలకు ఆశపడి గాలమునకుచిక్కి ప్రాణము విడుచుచున్నది.అనగానిచట ఇది రసనేంద్రియము వలనమోసపోవు చున్నది.

5:-భృంగము అనగా తుమ్మెద చంపకపుష్ప పరిమళమునకాసచెం ది ప్రాణమువిడుచుచున్నది అనగానిది ఘ్రాణేంద్రియమువలన.మోసపోవుచున్నది.

ఇలా ఐదు ప్రాణులు ఐదింద్రయము లవలనమోసపోయి విగతజీవులగు చున్నవి.ఇక శబ్ద ,స్పర్శ,రూప,రస,
గంధ పంవిషయములచే ప్రేరేపింప బడు మనుష్యుని గతి ఏమని చెప్పవలయును.


విదురనీతి
పంచమోధ్యాయః
08-02-2018
విదుర ఉవాచ=విదురుడుపలికెను
సప్తదశేమాన్ రాజేంద్రమనుః స్వాయంభవోఽబ్రవీత్
వైచిత్రవీర్య పురుషానాకాశం
ముష్టిభిర్ఘ్నతః!!1
దానవేంద్రస్యచ ధనురనామ్యం
నమతోఽబ్రవీత్
అథో మరీచినః పాదానగ్రాహ్యాన్
గృహ్ణాతస్తథా!!2
ఓరాజేద్ర!విచిత్రవీర్యనందనా!ఈ
క్రిందచెప్పబోవు17రకములపురుషులను స్వాయంభువమనువు---
ఆకాశమును పిడికిళ్ళతో గ్రద్దుచున్న వారిగను ,వంచశక్యముగాని ఇంద్ర ధనస్సును వంచ ప్రయత్నించు వారి నిగను,సూర్యకిరణములను చేతితో
పట్టుకొన యత్నించు వఆరినిగను
చెప్పెను.
యశ్చాశిష్యంశాస్తివై యశ్చతుష్యేద్
యశ్చాతివేలం భజతే ద్విషన్తమ్
స్త్రియశ్చ యో రక్షతి భద్రమశ్నుతే
యశ్చాయాయాచ్యం యాచతే కత్థ
తేచ!!3
1:-అయోగ్యడైనవాడికి ఉపదేశించు వాడు
2:-ఎవడుఅతిగామర్యాదనుల్లం ఘించి సంతుష్టుడుగాయుండునో
3:-ఎవడు శత్రువులనుసేవించునో
4:-ఎవడు స్త్రీలనురక్షించు ద్వారా
శుభమును లేదాక్షేమమునుపొందు నో
5:-ఎవడు యాచింపదగనివానిని
యాచించునో
6:-ఎవడు ఆత్మస్తుతి చేసుకొనుచుం
డునో
యశ్చాభిజాతః ప్రకరోత్యకార్యం
యశ్చాబలో బలినా నిత్యవైరీ
అశ్రద్దధానాయ చ యో బ్రవీతి
యశ్చాకామ్యం కామయతే నరేంద్ర
4
7:-ఎవడు మంచికులమందుపుట్టి కూడా చేయరాని పనిని చేయునో
8:-ఎవడుబలములేనివాడయ్యు
బలవంతునితో నిత్యము వైరము పెట్టుకొనునో
9:-ఎవడు నమ్మకములేనివానికి
ఉపదేశించునో
10:-ఎవడు కోరదగనిదానిని కామించునో
వధ్వావహాసం శ్వశురోమన్యతేయో
వధ్వా వసన్నభయో మానకామః
పరక్షేత్రే నిర్వపతి స్వబీజం
స్త్రియంచయః పరివదతేఽతివేలమ్
5
11:-ఎవడు మామ అయియుండి
కోడలితో పరిహిసమును కోరునో
12:-కోడలిసహాయముతో నిర్భయ ముగా జీవించుచుతనకుగౌరవము
చూపవలనని కోరునో
13:-ఎవడం ఇతరుభూమియందు
తనబీజమునునాటునో
14:-ఎవడు మర్యాదనుల్లంఘించి అతిగా స్త్రీని దూషించునో
యశ్చాతిలబ్ధ్వా నస్మరామీతి వాదీ
దత్త్వా చయః కత్థతియాచ్యమానః
యశ్చాసతః సత్త్వముపాయీత
ఏతాన నయన్తి నిరయం సాశహస్తాః
6
15:-ఎవడు సహాయముపొందియు
గుర్తులేదు అని పలుకుచు మరపు నటించునో
16:-ఎవడు అర్థింపబడగా దానము చేసి తన గొప్పలు చెప్పుకొనునో
17:-ఎవడు అసత్పురుషులను
సత్పురుషత్వమును పొందించునో
అనగా చెడ్డవారిని మంచివారుగా చిత్రించునో వీరిని యమదూతలు
పాశములతో బంధించి నరకమున
కు కొనిపోవును.


నేటి కవిత
ప్రాంజలిప్రభ అందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భముగా శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నది

మరవను మరచిపోలేని ఐకమత్యం
మాకు పెద్దలు అందించిన సాహిత్యం
మమతానురాగాలందించిన మమైకత్వం
అదే భారత దేశంలో ఉన్న నిశ్చలతత్వం

ఇక్కడ ఉండనే ఉండదు బానిసత్వం
అందరిలో ఉంటుంది సమధీరోతత్వం
అది అనురాగం అందించే స్నేహతత్వం
అమాయకం అన్నవారిలో సింహస్వప్నం

మాకు ప్రక్రృతి ననుసరించే సహజతత్వం
భేదనీతిలేని న్యాయాన్ని పొందే న్యాయతత్వం
ఆనందాన్ని అందించే మాలో ఆకర్షణా తత్వం
రాజ్యాంగాన్ని అనుకరించి నడిపే రాజకీయతత్వం


No comments:

Post a Comment