ఉద్యోగమా - పెళ్లా (కధ)
ప్రాంజలి ప్రభ (1-)
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ
ఏమిటే ఆలా మెలికలు తిరి పోతున్నావు, నన్ను ఒకడు ప్రేమిస్తున్నాడని అన్నడే అన్నది శిరీష , స్నేహితులు అన్నారు, ఒక అమ్మాయిని పొందా లంటే ఆబ్రహ్మ దేవునికి సాధ్యం కాదు, ఆ అశోక్ గాడిని పిలువు, బారుకి తీసుకెళ్లి బాగా వదిలిద్దాం, అప్పుడు ప్రేమ వద్దు అని చెప్పవచ్చు అని స్నేహితులు చెప్పారు.
ఒక నవ్వు నవ్వి అశోక్ ను శిరీష పిలిచింది, క్లబ్ కు పోదామంది, పీకల దాకా దాగింది, అశోక్ ను నోటికి వచ్చి నట్లు తిట్టింది, అక్కడే క్రింద పడింది, అప్పుడు పోలీసులు రైడ్ చేశారు, స్నేహితులు పరిగెత్తారు శిరీషను వదిలి, కొంత పైకము తీసుకోని పోలీసులు వెళ్లి పోయారు. అప్పుడే ఆమె బ్యాగులో సెల్ మ్రోగింది, వెంటనే చెప్పాడు మీ అడ్రస్ చెప్పండి, మీ అమ్మాయి త్రాగి క్లబ్బులో పడింది, తీసుకొస్తున్నాము అని కబురు పంపి తీసుకొచ్చి దించి వెళ్లి పోయాడు అశోక్ .
పొద్దున్నే లేచి అమ్మా నన్ను ఎవరు తెచ్చారు, ఎవరో అశోక్ టా, నీకు ఎన్ని సార్లు చెప్పిన నీ అలవాట్లు మానుకోవు, డబ్బు మనిషిని పాడు చేస్తుంది, డబ్బు చేతికి అందక పొతే పిచ్చి వాణ్ని చేస్తుంది, అసలే నీవు యవ్వనం లో ఉన్నావు, బీటెక్ పూర్తిచేసావు, ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్నావు.
ఇదే చివరి మాట ఇక చెప్పేది లేదు, ఇక పెళ్లి చేయటమే మా తక్షణ కర్తవ్యమ్ , నీవు ఉద్యోగం చేసి మాకు సంపాయించి నక్కరలేదు అని గట్టిగా చెప్పారు తల్లి తండ్రులు.
క్షమించండి అని చెప్పి లోపలకు వీళ్లింది.
అప్పుడే ఆతల్లి కూతురు ప్రవర్తనకు భాదపడుతూ ఆ భగవానుకి మోర పెట్టుకున్నది.
మానసమ్మందు నో మాధవా నీవె నా ప్రాణమీ ధారుణిన్
బాలు పోయంగ రా వానలో నెండలో వంతలో విందులో
ధ్యాన మా నామమే దానవారీ హరీ చిత్తమం దెప్డు నా చింత
నీవేగదా పొత్తమం దెప్డు నీ మూర్తి నే జూతురా ముత్తెముల్
నీవెగా మోహనానంద నా విత్తముల్ నీదెగా ప్రేమ
చింతామణీ నల్లనౌ దేహమే నాకు నెల్లప్పుడున్ దెల్లఁగాఁ
దోఁచురా తేలి నే పోదురా యుల్ల మూయాలగా యూఁగురా
తూఁగుచున్ మెల్లగా నవ్వుచున్ మేలమాడంగ రా పూవులోఁ
జూతు నిన్ బ్రొద్దులో జూతు నిన్ గ్రోవిలో విందు నిన్
ద్రోవలో విందు నిన్ నీవు నేనందురా నిన్ను నాకందురా
జీవమున్ గావఁరా జీవితేశా నమస్తే నమస్తే నమస్తే నమః
తండ్రి కూరివద్దకు వచ్చి ఈ విధముగా తెలియ పరిచాడు
స్త్రీలు అనాదిగా మోసపోతూ ఉన్నారు, అది ఎవరి
వలనని ఆలోచించటం అనవసరం, ఎందుకంటే తిరగక పొతే చెడిపోతాడు మొగవాడు, తిరిగితే చెడి పోతుంది ఆడది, అర్ధం కాలేదను కుంటా ఆడవారు కళ్ళ బొల్లి మాటలకు లొంగి పోతారు తిరిగితే, కాలు జారీనా జారవచ్చు, బయట పడేది ఆడదాని శీలం విలువ, అదే మొగ వాడు తిరుగక ఇంట్లో ఉంటే ఆడంగి వేషాలు వేసుకొని బ్రతికేవాడుగా, ఆడదానికన్నా ఘోరముగా మారుతాడు.
నీవు చేసింది మంచో చెడో నాకు అర్ధం చేసుకొనే చదువు లేదు, ఎదో తోటను నమ్ముకొని బ్రతుకుతున్నాను దానిమీద వచ్చిన పైకముతో పైకి వచ్చాను, అదే నీకు నాకు కూడు పెడుతున్నది.
అనాది నుండి నేటివరకు నింగి నేల కలిసినట్లు కనబడుతున్నది కానీ కలుస్తుందో లేదో తెలియదు కానీ భార్య భర్తల సంగమమే అనురాగ భందమై జీవిత సానిత్యానికి పిల్లలు పుడతారు. వారి ఆనందానికి తోడ్పడే వాళ్లు తల్లితండ్రులు మాత్రేమే, ఎప్పుడూ పిల్లలకు ప్రేమను పంచుతారు, విషం మాత్రం పంచరు.
స్త్రీ జీవితము అనగా ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, బిడ్డగా రూపాంతరము చెంది అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్నది, సూర్యుడికన్నా ముందే లేచి పాచిపని , ఇంటిపని , వంట పని చేస్తూ
పిల్లలకు స్కూలుకు క్యారేజీ రడీచేసి, భర్తకు క్యారేజ్ రడీ చేసి, భర్తను ముద్దు చేసి ఆఫీసుకు పంపి అలసి పోయి, తాను ఉద్యోగమూ చేస్తూ నిరంతరము ఓర్పు తో బస్సుల్లో తిరిగి ఇంటికి చేరే పరిస్థితి ఉన్నది, అవసరమయితే స్త్రీలు దుర్మార్గులపై బ్ధద్రకాళి రూపము దాల్చి చండాడే విధముగా మారాలి నేటి సమాజములో. నీవు వళ్ళు మరచి త్రాగి తల్లి తండ్రులకు తలవంపులు తెస్తావనుకోలేదు.
మా పెంపకంలో ఎక్కడో ఎదో లోపం జరిగింది, అయినా దేవుడు మన యందు దయచూపాడు, నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చాడు. నేనొక కధ చెపుతాను వినమ్మా.
ఇంటికి ఆలస్యంగా త్రాగి వచ్చిన కూతురిని పై చదువుల కోసం ధ్యాస పెట్టమని , ఇలాంటివి మానుకొమ్మని తల్లిదండ్రులు మందలించారు.
"చిన్నప్పటి నుండి చూస్తున్నాను, నాకు మీరు అస్సలు స్వేచ్చ ఇవ్వడం లేదు. ఎంత సేపు చదువు చదువు అని నా ప్రాణం తోడేస్తున్నారు . నేను మిత్రులతో గడపకూడదా ? సినిమాలకి షికార్ల కి వెళ్లకూడదా ? అందరు వెళ్ళడం లేదా ? మొబైల్ లో ఒక గంట సేపు మాట్లాడితే తప్పా ? ఫేస్బుక్ లో చాటింగ్ తప్పా ? " అని నిల దీసింది కూతురు .
"సరే నీకు కావలసినంత స్వేఛ్చ ఇస్తాను. ఒక్క సారి నా మాట వింటావా ? ఈ రోజే మనం ఒకసారి మన సొంత ఊరికి వెళ్లి వద్దాము . అక్కడ రెండు రోజులు ఉందాము . తిరిగి వొచ్చిన తర్వాత నీ ఇష్టం " అని తండ్రి బదులిచ్చాడు. కూతురు సరే అన్నాది . అనుకున్నట్టు గానే సొంత ఊరికి బయలు దేరారు.
తండ్రి కూతురితో కలిసి వారి మామిడి తోటకి తీసుకెళ్ళి "నేను ఇక్కడే కుర్చుంటాను . ఈ తోటలో నువ్వు ఒక గంట సేపు తిరిగిరా అని బదులిచ్చాడు" కూతురు ఒక గంట తర్వాత తిరి గొ చ్చింది . తోటలో నువ్వు ఏమి చూసావు అని ప్రశ్నించాడు తండ్రి. "అన్ని చెట్లు పెద్దగా బాగానే ఉన్నాయి. కానీ ఒక చెట్టు మాత్రం పొట్టిగా, పురుగులు పట్టి, కాయలు లేకుండా ఉంది . ఆరోగ్యం గా లేదు . మిగిలిన అన్ని చెట్లు బాగున్నాయి. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది . దానికి తండ్రి "మామిడి చెట్టు పెంచేటప్పుడు కొంత ఎత్తు పెరిగిన తర్వాత అవసరం లేని కొమ్మలను, కిందకు వేలాడే కొమ్మలను కత్తిరిస్తారు . లేదంటే ఈ వేలాడే కొమ్మలకు సూర్య రశ్మి తగలక, పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా పురుగులు చేరే అవకాశం కూడా ఎక్కువ . అన్నీ చెట్లకి కొమ్మలు కత్తిరించాము. అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ ఆ చెట్టుని కత్తిరించలేదు. మొదట నాటిన చెట్టు కదా స్వేఛ్చ గా పెరగనిద్దాము అని వదిలేసాము" అని బదులిచ్చాడు.కూతురికి విషయం అర్ధమయ్యింది.
"అనవసరంగా పెరిగే కొమ్మలు ఎలాగైతే వృక్షాన్ని నాశనం చేస్తాయో .. అదే విధంగా చదువుకునే వయసులో చేసే అనవసరమైన పనులు విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తాయి. మీ నాన్న కేవలం కొమ్మలు కత్తిరించే ప్రయత్నం చేస్తున్నాడు, చెట్టంత కూతురు చల్లగా ఉండాలని. అంతే కానీ స్వేఛ్చని అడ్డుకోవాలని కాదు " అని భుజం మీద చెయ్యి వేసి ఇంటికి తీసుకొచ్చాడు .
బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే ప్రతి తల్లి దండ్రుల మనోభావాలను ఈ యువతరం అర్ధంచేసుకోవాలని ఐ కధనీకు చెప్పాను.
తల్లి తండ్రులను ఒకచోట కూర్చోపెట్టింది, శిరీష పాదాలకు నమస్కరించి నాతప్పు తెలుసుకున్నా, నేను చదువు కోమంటారా, ఉద్యోగము చేయమంటారా లేదా పెళ్లి చేస్తాము అంటారా మిరే చెప్పండి అని అడిగింది.
నీ వయసుని బట్టి ధైర్యముగా ఉద్యోగము సంపాదించి పెళ్లి చేసుకుంటే మంచిది అని చెప్పారు.
అదికాదు ఎదో ఒకటే చెప్పండి ఉద్యోగమా, పెళ్లా నిర్ణయం చేసుకొని మేరె చెప్పండి అన్నది.
తల్లి తండ్రులు ఆలోచించి పెళ్లే మా నిర్ణయం, మరి నీ నిర్ణయము మాకు చెప్పు, నీవు ఎవరి నైనా ప్రేమించావా, లేదా మేము చూసిన సంభంధం చేసుకుంటావా చెప్పు అని అడిగారు.
అశోక్ పై మీ అభిప్రాయము ఏంటో తెలుపుతారా
నీవు అతన్ని ప్రేమించావా
ప్రేమించలేదు, ఇప్పుడు ప్రేమిద్దామని అనుకున్నా, మంచిది
వారి తల్లి తండ్రులను సంప్రదించి అన్ని వివరాలు రేపు నీకు చెపుతాము తల్లి
మనసులో అనుకున్నారు తల్లి తండ్రులు ఒకనాడు పెద్దలు మాట పిల్లలు వినేవారు, నేడు పిల్ల మాటలకు తల్లి తండ్రులు నోరు పిదప లేని స్థితి తెస్తున్నారు ఇదేమి లోకం.
-((*))--
తాత మానవుడి చిన్న కధ
ప్రాంజలి ప్రభ (2 )
రచయత: మల్లప్రగడ రామకృష్ణ
తాత గొప్ప వారు ఎవరు తాత అని మనవుడు అడిగాడు ?
ప్రతి ఒక్కరు గొప్పవారే సమయానాన్ని వ్యర్ధ చేయకుండా, ఎవ్వరికి భారం కాకుండా, ఎవ్వరిని మోసం చేయకుండా, నమ్మిన కళలో విజయ సాధించాలని తీవ్రకృషి చేసిన వారు గొప్పవారు, ధనం ఉన్న వారు గొప్పవారు అనుకోవటం తప్పు,
అందుకే ఒక చిన్న కధ చెపుతా విను మనవుడా
కాలం కదులుతుంది అది మనకు తెలియదు, పగలు రాత్రి కలయికతో ఒక రోజు కదుల్తుంది. ఆ మధ్య సమయంలో అనేక మార్పులు నిత్యమూ గోచరమౌతాయి.
అందరి కన్నా గొప్ప నేను అనుకుంటారు ఎవరికి వారు అనగా ఓ అందమైన భవనాన్ని నిర్మించు టకు ఇటికలు గొప్పవని చెప్పుకున్నాయి. ఆ ప్రక్కనే ఉన్న సిమెంటు అన్నది మీరు విడిగా ఉన్నప్పుడు ఎవరు గమనించరు, ఇటుకలను ఎక సూత్రముగా కలుపుటకు నేనుండగా మీ గొప్ప పెరిగింది అన్నది. అక్కడే ఉన్న దర్వాజాలు, కిటికీలు అందముగా మేము ఉండుటవల్లే ఇంటికి అందం పెరిగింది అది మీరు గమనించండి అన్నాయి.
అప్పుడే అటుగా మేస్త్రి పోతూ వీళ్ళ సంభాషణలు విని నేను కూలీలను చేర్చి చక్కగా నిర్మించుట వల్లా, గొప్పగా కనిపించింది ఈ భవనము. అప్పుడే అటుగా పోతున్న ఇంటి యజమాని వచ్చి మీ రందరు కాదు ఇది నా సంపాదన వళ్ళ ఏర్పడినది మీరందరు నేను పిలవగా వచ్చిన వారు అన్నాడు.. అప్పుడే అటుగా ఒక స్త్రీ భాదపడుతూ వచ్చింది.
అమ్మా ఎవరు మీరు బాధ పడుతున్నారు అని అడిగాయి. నేను పుడమి తల్లిని మీ బరువు నంతా మోసున్నాను నన్ను మరిచి పోయారు మీరు, మిరే గొప్ప అని అను కుంటున్నారు అది ఎంత వరకు నిజం మీలో "సంయమనం, సహనం, పరస్పర సహకారం " లోపించింది. అందువల్లే నేను భాధ పడుతున్నాను . మమ్మల్ని క్షమించండి మా తప్పులు మన్నించండి. మేమందరం మీ బిడ్డలం .
మీకందఱకు నేను ఒకటే చెప్పేది ఐకమత్యం లోపించి, వ్యక్తిత్వమే ప్రాధాన్యత వహించిన చోట సదా పతనం, పరాభవం లభిస్తుంది. మీ గొప్పలు ఆవతలు పెట్టి ఐకమత్యంగా ఉండి " సంయమనం సహనం పరస్పర సహకారం ఉన్నత కాలం నేను మీ వెంటే ఉంటాను. మీరు ఎదురు తిరిగితే నేను పెట్టె కష్టాలను భరించ వలసి ఉంటుంది అని తెలుసు కొండి. ఒకరికొకరు సహకరాం అందించుకుటూ ఉంటేనే పగలు రాత్రి ప్రశాంతముగా ఉంటాయి.
తాతా అన్నిటి కన్నా గొప్పది భూమాత కదా తాత, అవునురా అందరికన్నా గొప్ప
ఇంకా ప్రత్యక్ష దైవాలు " సూర్యచంద్రులు, పంచభూతాలు, తల్లి తండ్రులు, గురువు గొప్పవారు.
మనవుడు నెమ్మదిగా వచ్చి తాత పాదాలకు నమస్కరించాడు.
ఏమిటిరా ఏ రోజు స్పెషల్ గొప్ప విషయాలు చెప్పారు, నా మనసుకు తృప్తి కలిగింది తాత
ఏమీ తెలిసిందిరా నీకు
ఎవ్వరూ గొప్పవారు కాదు, సత్యమ్, ధర్మం,న్యాయం నిలబెట్టే పరమేశ్వరుడే గొప్పవారు తాత
అవును ......... అవునా ....... అవును ... అవును
--((**))--
ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
(కధ) సంసారి
ప్రాంజలి ప్రభ (3 )
రచయత: మల్లా ప్రగడ రామకృష్ణ
3.విషంక్రక్కే భుజంగం లా, కదంత్రొక్కే తురంగం లా, మదం పట్టిన గజం లా, వలయ విచల ద్విహంగం లా, విలయ సాగర తరంగం లా, చిత్రకార్తి కుక్కలా నావెంట పడ్డా వెందుకు, నాదగ్గర ఏమి ఆశిస్తున్నావు, ధనమా, సుఖమా, మరి ఏమి కావాలి నీకు, నన్ను వెంబడించ కుండా ఉండాలంటే నేను నేమి చేయాలో చెప్పు, నన్ను వదలి వెళ్ళు, నాదగ్గర నీవు ఏమి ఆశించిన అంతా సూన్యము తప్ప ఏమి దొరకదు అది మాత్రం గుర్తించుకో, నామీద ఆశలు వదులుకో, నీ మాయలో చిక్కే మనిషిని కాదు, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అందాలు చూపిన నేను మారి మూర్ఛ పోయే మనిషిని కాదు.
నీకో విషయం తెలియపరుస్తా నిష్టా గరిష్టుడుగా ఉన్న సంసారిని ఎవరూ వేరు చేయలేరు, ప్రలోభాలకు లొంగ దియలేరు ఇది సత్యము ఆది శంకరాచార్యలు ఇవిధముగా తెలియపరిచారు " మోక్షమం దత్వంతా సక్తి గల పురుషుడు శబ్దాది విషయ వాసనలను నిర్మూలించి, సర్వ కర్మలను బరిత్యజించి, గురు వేదంత వాక్యములందు విశేష శ్రద్ధతో శ్రవణ మననాదుల సభ్య సించిన ఎడల, వట్టి వాని బుద్ది రాజోగుణ రహితమై పరిశుద్ధ మగును "
నేనంత వాడిని కాక పోయినా నీతో వాదన దిగే శక్తి నాకులేదు, నీతో మాట్లాడుతే తప్పు, అయిన ఓర్పుతో ఆడదాని వని ఎటువంటి గట్టి దండన చర్య తీసుకో కుండా నన్ను వెంటాడ వద్దని తెలియ పరుస్తున్నాను.
గులాబీ నెమ్మదిగా ఈ విధముగా అన్నది మాధవ్ తో
ఈ పూట కేమేమి -ఈ రాత్రి వెన్నెల్లొ - నవ్వు ల్లె పువ్వుల్లొ
నావెల్గు నీవేగ - నాతృప్తి నీ వేగ - ఈ వేష మెచ్చేన
ఈ మాట ఏ తీర్పు- ఈ ఆశ ఏ మాయ- ఈ బొమ్మ నీదేను
రారాసు రామా- నువే నాప్రియా నిన్ను పొందాలి ఇప్పట్లొ
ప్రాణమ్ము నీదేను, ప్రాణమ్ము మాయేను - ప్రాణమ్ము బ్రహ్మమ్ము
ప్రాణమ్ము ధైర్యమ్ము, ప్రాణమ్ము మోక్షమ్ము ప్రాణమ్ము దేహమ్ము
ను వ్వాడు యీసంధ్య వెల్గుల్లొ - నమ్మించు యీసృష్టి వెల్గుల్లొ
మాట్లాడు ఈ మంచి వెల్గు ల్లొ - ప్రేమంత చూపాలి ఈ రాత్రి వెల్గుల్లొ
నీవు మొగడివి, మఘధీరుడివి, నా కళ్లకు నీవు గోపాల కృష్ణుడివి, అందుకే ఒక గులాబీ గా నిన్ను అరాదిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఈ రోజుకు వెళుతున్నాను, నా ప్రయత్నములు మానను ఏ రోజు కైనా సరే నిన్ను నా పాదాలు పట్టించు కోక పోతానా అని అంటూ వెను తిరిగింది గులాబి.
నెమ్మదిగా ఇంటికి చేరాడు మాధవ్, తలుపు కోట్టాడు, తలుపు తీస్తూనే ఏమిటండి మీ మొఖం అట్లాగుంది, ఎదో మార్పు ఉన్నది అన్నది, ఏమి లేదులే ఎండలో వచ్చాగా అందుకే నీకు నా మొఖము కమిలి నట్లు కనిపించి ఉంటుంది, ఏమి లేదు బాగానే ఉన్నాను, మీకు వంట్లో బాగా లేక పోతే చెప్పండి ఆసుపత్రికి వెళ్దాం, రోగం దాచు కోకండి అన్నది, నాకు పట్టిన రోగం చెప్పేది కాదు, చెప్ప కూడనిది కాదు అని గొణుక్కున్నాడు, ఏమిటండి అలా గోనుక్కుంటారు ఎమన్నా అనాలంటే మొఖం మీదే అనండి అన్నది. అబ్బా కాసేపు కూర్చొనిస్తావా, మంచి నీల్లెమైనా ఇస్తావా రాధ అని వాలు కుర్చీలో నడుం వాల్చాడు మాధవ్ .
ఇదుగోనండి మంచి నీరు అనగా తీసుకోని గడ గడ త్రాగి ఒక 10 నిముషాలు నన్ను లేపకు అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు.
నిద్రలేచిన తర్వాత రాధ మాధవ్ తో ఈ రోజు గుడిలో ఒక వింత జరిగింది, ఒక ఆరడుగుల అందకత్తె మంచి పట్టు చీరకట్టుకొని అక్కయ్యగారు బాగున్నారా అని అడిగింది. నాకేం అర్ధం కాలేదు అసలెవరమ్మా మీరు అన్నా, ఏమిటండి నన్ను అమ్మా అంటారు మీ కన్న చిన్నదాన్ని, మీ వారికి బాగా తెలిసిన దాన్ని నన్ను చెల్లీ అని పిలవండి చాలు అన్నది, మటల్లో ఉన్న అంతరార్ధం అర్ధం కాలేదు. మీ వారు చాలా మంచి వారండి, పరస్త్రీ మొఖం కూడా చూడరు, కానీ మీ వారు మిమ్మల్ని వివాహము చేయక ముందు నుంచి నాకు బాగా తెలుసు, మిమ్మల్ని మోసం చేస్తున్నారామె నని అనుమానం ఉన్నది అన్నది. నాకు కోపం వచ్చింది పైకి కనిపించకుండా నేను అసలు విషయం సూటిగా చెప్పండి, డొంక తిరుగుడు వద్దు చెప్పండి, ఏమీ లేదండి మీరు వప్పుకుంటే మీవారిని నేను పెళ్లి చేసుకుంటా, మీ కిష్ట మున్న లేకున్నా ఉంచు కుంటా అని గట్టిగా చెప్పిందండి. ఏ పేరు చెప్పింది, ఆ గుర్తు రావటంలేదు బంతో, చామంతో ఆ ఆ గుర్తొచ్చింది "గులాబి " అన్నది.
ఏమి తెలియని వాడిలా మాధవ్ ఇంతకీ ఆమెతో ఏమి చెప్పావు
నేనేమి చెప్పలేదు కొందరు మనుష్యులు వచ్చి ఆమెను తీసుకెళ్లారు అదీ జరిగింది.
ఆ మనుష్యులు ఎవరో కనుకున్నావా ఏమో నాకేం తెలుసు
లేదు నీవు కనుక్కొనే ఉంటావు నా దగ్గర దాస్తున్నావు
అవునండి తెలుసుకున్నా నేను "ఆమె పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొని వచ్చిందట, ఆమె మీద 3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయిట .
పాపం ఏ తప్పు చేసిందో
ఈమెకు మద పిచ్చి పెరిగి ఒకర్ని ప్రేమించిందట, పేమించినవాడు దిన్ని మోసం చేసి వేరొకర్ని పట్టుకొచ్చి సర్వం అర్పించ మన్నాడుట అంతే ఆమాటలకు తట్టుకో లేక వచ్చిన వాడ్ని ప్రేమించిన వాడ్ని చెడుగుడు ఆడి మరి చంపి పోలీసులకు లొంగి పోయిన్ది. మానసిక రోగిగా మారింది. ఎర్రగా బుర్రగా అందంగా ఉన్న మగవాడ్ని చూస్తే బుట్టలోకి లాగి మరీ చంపు తున్నదిట, మొన్న జైల్ నుంచి వచ్చాక ఒకర్ని లొంగ దీసుకొని మొగవాళ్ళు మూర్ఖులు అని మరీ చంపి, తప్పించుకొని వేరొక మొగాడితో తిరుగు తుందట, పెళ్లైనవాడ్ని వారిని సంభందించిన వారిని లొంగ దీసుకొని వేటాడు తుంటూ ఉంటుందట. ఆమె కధ వింటుంటే నా ప్రాణం పైన పోయిన్ దనిపించింది. నామంగళ సూత్రం గట్టిది,
మావారు అలాంటి వారు కాదని నమ్మకము నాకు ఉన్నది అని చెప్పింది.
ఒక్కసారిగా ఊపిరి పీల్చాడు ఇదుగో రాధా ఇక్కడ ఆడవారు చాలా గట్టివారు మోసకారి లాగున్నారు కదూ. ఎందుకండీ అలా అంటారు మగవాళ్ళు గట్టిగా ఉంటే ఏ ఆడది భయపడ నవసరము లేదు.
ఇలాంటి మానసిక వ్యధకు గురైనవారు తటస్థపడితే మనమే జాగర్తగా ఉంటే చాలు, భయపడ నవసరంలేదు.
ఓరాధా నీవు చెప్పింది మంచి విషయమో, చెడ్డ విషయమే తెలుసు కోలేకున్నాను ఒక స్త్రీ బాధపడితే నామనసు భాదలో ఉంటుంది పాపం ఆమెకు మంచి జరగాలని ఆదేవుడ్ని కోరుకుందాం పదా గుడిదాకా వెళ్లి వద్దాము అన్నాడు మాధవ్ .
అప్పుడను కున్నది రాధ మావారు ఎంత మంచివారు ఇతరులకోసం కోసం కూడా గుడికి వెల్దామంటున్నాడు ఏమిటో విషయం
ఏమీ లేదు మీ ఆడవాళ్ళ బుధ్ధి మాత్రం మార్చుకోరు, ఏది అన్న ఎదో తప్పు పడుతుంటారు
అంతలేదండి నాలో మీరెలా గంటె అలా .. లేదు లేదు నీవెలా అంటే ఆలా
మహాప్రభూ మీతో మాట్లాడలేను నేను పదండి గుడికి ... ఆ ఆ వసున్నా
--((**))--
ప్రాంజలి ప్రభ - సెల్ ఫోన్ (చిన్న కధ) (4)
అమ్మా నాన్నా ఫోన్ చేస్తున్నాడు తీయనా, నీవు తీస్తావా అన్నది పుత్రిక రత్నం " హిమబిందు "
తియ్యవే, మీనాన్న గారితో మాట్లాడు మీరిద్దరూ ఒకటేగా, నీమీద ఈగ వాలనీడు, నీవు ఏదంటే అది తెచ్చి ఇస్తాడు.
అట్లయితే నువ్వే మాట్లాడు నేను మాట్లాడునులే అని లోపలకు వెళ్ళింది.
ఫోన్ మళ్ళీ మ్రోగింది, హలొ అని మొదలు పెట్టింది శ్రీమతి శ్రీదేవి
ఏమండి మీరెలా ఉన్నారండి అని అడిగింది
నేను బాగానే ఉన్నా, ముందు అమ్మాయి కి ఫోన్ ఇవ్వు
అట్లాగేనండి
హిమబిందు నాన్నగారు నీతో మాట్లాడుతారుట మాట్లాడు
అమ్మా చిట్టితల్లి " నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుదామని ఫోన్ చేసాను"
మంచిది నాన్న మీకు ధన్యవాదములు,
చిట్టితల్లి నీకు కొరియర్ లో గిఫ్ట్ పంపుతున్నాను, నాన్న మీరు రావటంలేదా
లేదమ్మా నాకు చిన్న పని ఉండటంవల్ల రాలేక పోతున్నాను, అమ్మ నువ్వు జాగర్తగా ఉండండి, నాన్న మీరు రాక పొతే నేను పుట్టిన రోజు ఏమి చేసుకోను, మీరొస్తేనే చేసుకుంటాను అంతే అంటూ ఫోన్ కట్ చేసింది.
మల్లా ఫోన్ మోగింది
ఏమండి మీరెలా ఉన్నారండి, వేలకు భోజనం చేస్తున్నారా, నిద్రపోకుండా ఎక్కవ కష్టపడకండి, మీ మీద ఆధారపడినవారు ఉన్నారండి అది మాత్రం మర్చిపోకండి. నీవు చెప్పినవన్నీ పాటిస్తున్న ముందు అమ్మాయికి ఫోన్ ఇవ్వు
హిమబిందు నాన్నగారు నీతోనే మాట్లాడుతారుట
ఏమిటి నాన్న
నీకు కోపం వచ్చిందని నాకు తెలిసింది, ఇక్కడ నా పరిస్థితులు నీకు, మీ అమ్మకు వివరించలేను అది అర్ధం చేసుకో,
నేను నీకు పంపినది స్మార్ట్ ఫోన్ దాన్ని ఎలా ఉపయోగించాలో నేను నీకు చెప్పనవసరము లేదను కుంటాను, థాంక్స్ నాన్న అంటూ ఫోన్లో ముద్దు పెట్టింది హిమబిందు
చూడమ్మా నీ పుట్టిన రోజు ఆన్లైన్ వీడియో లో నేను దివిస్తాను, నీవు ఆన్ చేసి ఉంచు, ఒక్క సారి అమ్మకు ఫోన్ ఇవ్వు.
ఏమిటే అమ్మాయి పుట్టినరోజు కదా, ఈరోజు స్పెషల్ ఏమి చేస్తున్నావు
నామతి మండా ఆవిషయమే మరిచాను, మీరు దూరముగా ఉన్నప్పటినుండి నామనసు మనసులో లేదు, ఎంత సేపటికి మీ ఆలోచనలే, మీరు జాగర్తగా ఉండాలని, దేవళ్ళందరినీ మొక్కుకుంటున్నాను.
నీ మొక్కుల ఫలిత మేమో ఒక్క వారంలో నీదగ్గర వాలిపోతా
ఎంత చక్కటి వార్త చెప్పారండి అమ్మాయి బర్తడే కేక్ కొరియర్లో పంపిస్థాను వెంటనే తినండి.
నా బంగారు చిట్టి తల్లి హిమబిందు మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారట, ఇంటిని శుభ్రం చేయాలి అందులో ఈ రోజు నీ పుట్టినరోజు కదా అందరిని పిలువు గ్రాండుగా చేసు కుందాం
అట్లాగేనమ్మా
అమ్మహడావిడితో నాన్న వీడియో సెల్ ఫోన్ దీవెనలతో నవ్వుల కేరింతల మధ్య జరిగింది పుట్టినరోజు .
మనుషులు దూరముగా ఉన్నా వస్తున్నాను అనే శుభవార్తె కొందరిలో ఉన్న అశాంతి తొలగించి ఉత్సాహం నింపుతుంది.
ప్రాంజలి పభ కవులను రచయితలను ఆహ్వానిస్తున్నది
మీ రచనలను రామకృష్ణమల్లాప్రగడ 101 @ జిమెయిల్.కం కు పంపగలరు