Tuesday, 16 August 2016

(శ్రీ కృష్ణకర్ణామృతం-

ఓం  శ్రీ రామ్  ఓం శ్రీ రామ్  ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ -  అంతర్జాల  సేకరణ ప్రభ 

సర్వే జనా సుఖినోభవంతు

శుభోదయం.!
.
(శ్రీ కృష్ణకర్ణామృతం---లీలాశుకమహర్షి విరచితం.)
అద్భుతమైన శ్లోకం :

:కైలాసో నవనీతతతి క్షితిరయం ప్రాక్దగ్ధ్యమృల్లోష్టతి,
క్షీరోదోపి నిపీత దుగ్దతి లసత్ స్మేరే ప్రఫుల్లే ముఖే,
మాతా జీర్ణధియా ధృఢం చకితయా నష్టాస్మి దృష్ఠః కయాః,,
థూ థూ వత్సక జీవ, జీవ చిరమిత్యుక్తో వతాన్నో హరీః.
.
బలరాముడు తల్లి యశోద దగ్గరకు వెళ్ళి తమ్ముడు మన్ను తిన్నాడని చెపాడు. యశొదమ్మ కృష్ణుడిని నోరు తెరవమంది. కృష్ణుడు నోరు తెరిచాడు.
ఇంకేముంది? తల్లికి కైలాస పర్వతం కనపడ్డది.. అది చూసి "అమ్మో, పొద్దున తిన్న వెన్న ముద్ద అరగకుండా అట్లాగే వుంది" అని అనుకున్నది.
పరిభ్రమిస్తున్న భూగోళం చూసి, నిజమే మన్ను తిన్నాడనుకున్నది.
క్షీరసముద్రం చూసి, అయ్యో పాలు కూడా అరగలేదనుకున్నది.
ఆ చిరునవ్వులు చిందిస్తున్న ఆ కొంటె కృష్ణుడిని చూసి,
తల్లి కంగారు పడి పోయి "ఇంకేముంది, ఎవరి దృష్టో తగిలింది" అని
"థూ, థూ, చిరంజీవ, చిరంజీవ, బిడ్డా" అనుకుంటూ దిష్టి తీయించుకుంటున్న
శ్రీ కృష్ణుడు మనలను కాపాడుకాక.
   
1.--((**))--

ఒకసారి విక్రమార్క మహారాజు వద్దకు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు.ఒక సీస పద్యము చెప్పి తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
రాజ్యంబు వదలక రసికత్వ మెడలక
జయశీల ముడుగక నయము చెడక
 దీనుల జంపక దేశంబు నోంపక
నిజముజ్జగింపక నేర్పు కలిగి విప్రుల 
జుట్టాల నెన్ను సోచ్చినయట్టి వారిని 
గొల్చిన వారి ప్రజల హర్షంబుతో 
గాచియన్యాయ ముడుపుచు మున్ను 

చెప్పిన రీతి జెన్ను మీరి చేత లొండు లేక పాత్రల విడువక యశము కలిమి తమకు వశముగాగ వసుధ యేలు రాజవర్గంబులో నన య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్నుఇందులో రాజును ప్రశంసిం చడము తో పాటు ఒక వినతి కూడా దాగి ఉంది. ప్రతి పాదము లోని మొదటి అక్షరాలు కలిపితే "రాజ దీని వివాహము చేయవయ్యా"అనే విన్నపము ఉంది.రాజు రసికుడు కాబట్టి గ్రహించి అమ్మాయి వివాహానికయ్యే ధనము ఇచ్చి పంపి నారట.ఈ పద్యము వ్రాసినవారు శ్రీ కొరవి గోపరాజు గారు. మన తెలుగు కవుల గొప్పతనము చూడండి..
--((**))--

No comments:

Post a Comment