ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - శృంగారంలో సరదా ప్రభ
సర్వేజనా సుఖినోభవంతు
శృంగారం లో పాల్గొంటు సరదా ముచ్చట్లు
*. గుండెలో గాయం చేసింది నీ మాయ ప్రేమ
పువ్వు సోకగా నా సోకు కందించే ప్రేమ
కన్నీటి ధారలతో మేని పులకరింతలతో ప్రేమ
మనుషులేరగని మాయను కమ్మిన వెర్రి ప్రేమ
*. మాట కటువు, మనసు వెన్న లాంటిదీ
నీటి బుడగను, వర్ణించ కాని దీ
ఒట్టు తీసి గట్టు మీద, పెట్ట లేకున్న దీ
కలియుటకు పంతం ఉన్నదీ
*. స్త్రీ బ్రతుకు గతించిన కాల స్మ్రుతులతో
స్త్రీ బ్రతుకు భవిషత్ గురించి ఆలోచనలతో
స్త్రీ బ్రతుకు వర్తమానంలో ఆశ, నిరాశలతో
స్త్రీ బ్రతుకు కల్పవల్లిగా మరే జీవితాశయంతో
*. మోసేవాడికి తెలుస్తుంది బరువెంతో
తవ్వే వాడికి తెలుస్తుంది లోతెంతో
రోగానికి తెలియదు డాక్టార్ విలువెంతో
పిల్లలను పెమ్చేటప్పుడు తల్లిపడే భాదెంతో
* ద్వేషించడం మాని, ప్రేమించడం నేర్చుకో
జీవ హింస మాని, పోషించటం నేర్చుకో
భార్య సలహా విని , బ్రతుకు మా ర్చుకో
ఇరువురు ఒకటే ఆత్మగా బ్రతుకు దిద్దుకో
*. అదృశ్యంగా కదులుతూ కదిలించే గాలి శక్తి
నడుస్తూ ప్రాణులకు దాహం దీరుస్తూ నీటి శక్తి
ఉన్నచోట తన ఉనికిని తెలియ పరిచే అగ్నిశక్తి
కోపం తగ్గించి, తాపాన్ని చల్లార్చే భార్యామణి శక్తి
*. విరక్తి చెందక, చలోక్తులతో కట్టించాలి రక్తి
యుక్తి యుక్తి అంటు కలవాలని లోకోక్తి
మడికట్టుకోని కూర్చోక పెంచుకోవాలి శక్తి
ఇరువురిశక్తి కలసి ఏర్పడుతుంది కొత్తశక్తి
*. స్త్రీ చిరునవ్వుతో యుద్ధాలు ఆప వచ్చు
స్త్రీ చిరునవ్వులు శత్రువుపై సంధించ వచ్చు
స్త్రీ చిరునవ్వుతో కుటుంబకలహం తీర్చవచ్చు
స్త్రీ చిరునవ్వుతో ఎవ్వరినైన బుట్టలో వేయవచ్చు
*. రవి కాంచని చోట కవి ఊహలు గాంచు
మమతలు లేనిచోట మనసు గాంచు
వయసు పెరిగే చోట వలపు గాంచు
పతివ్రత ఉన్న చోట సుఖం గాంచు
*. గూట్లో దీపం వెలిగించు నోట్లో ముద్దను దించు
ఒంట్లో శక్తిని పెంపొందించి ఈ మత్తును దించు
మనసుకు ఉతేజ పరుచు ఇది కొత్త అని పించు
అలవాటుగా మారి ఇంకా ఇంకా కావాలని పించు
*. సుఖించి సుఖమును పంచి బ్రతికించు
వరించి వలపును పంచి మురిపించు
తెగించి యముడునే ఎదిరించి బ్రతికించు
ప్రేమించి ప్రేమను పంచి సంతోషపరుచు
*. గడబిడ పడక దడ దడ లడించక
జడ తలగడగా పడక అడ్డు తడక
నడక తడబడక ఛడమడా లాడక
ఢమ ఢమ లాడించి ఢంకా తట్టక
*. కొంగు జార్చక కోక విడువక కొంగలా ఒంటికాలుపై ఉండక
కోకో అంటూ ఆడక కొక్కొరకో కొక్కొరకో అని కోడిలా అరవక
కోడె దూడలా పరుగులు పెట్టక, కోడె త్రాచులా బుసలుకొట్టక
కోరి కోరి కోరుకున్న మొగుడి కోరికను కలలో కుడా తీర్చక
*. తట్టి తట్టి గట్టిగా పట్టి పట్టి చేయకు రట్టు
ఒట్టు ఒట్టు నాగుట్టు పై పెట్టు తీసి పెట్టు
పట్టు చీర కట్టు విప్పి పట్టాలి ఒక పట్టు
చేయి, కాలు, నడుం, పట్టి ఉడుం పట్టు
*. నీ వింత తిని ఎవరికైన కొంత పెట్టు
ఆరోగ్యముగా ఉండి భర్తను సుఖ పెట్టు
భార్యాభర్తలు కలసిఉంటే ప్రగతికి మెట్టు
దేవుణ్ణిపూజిస్తె మనశాంతి ఉండును ఒట్టు
* తహతహ లాడకు తపన తగ్గిమ్చేదాక ఓపిక పట్టు
తమకంతో, కోపంతో ఉండకు ఏదో తప్పు చేసినట్టు
తామర పువ్వునుచూసి ముద్దివ్వాలనిపించి నట్టు
తన్మయత్వంతో నీకు తనువూ అరిపిస్తా నీపై ఒట్టు
* నీకు సాద్యం కానివన్నీ అసాద్యం అనకు
గర్భం రాలేదనకు ప్రయత్నం మానకు
త్రుప్తిపడితే అంతా సుఖమని మరువకు
పనిచేయటమే నీవంతు ఫలితం ఆశించకు
*. అరచేతిలో వైకుంఠం అని చెప్పమాకు
ఆర్భాటాలతో ఎగిరెగిరి క్రింద పడమాకు
ఆశల వలయంలో చక్కి అవమానపడకు
ఉన్న దానిని సుఖపెట్టి హాయిగా బ్రతుకు
*. నన్ను అదేపనిగా గిల్లి గిల్లి గిలి గింతలు పెట్టమాకు
గమ్మత్తులు, కలవరిమ్తలేనా తట్టి తట్టి లెపు ఆకు
ముందు వెనుకా ఉండదు ఈ పనికి చీకటిలో పాకు
దమ్ము, సొమ్ము అంతా నాకు చూపు ఈపూటకు
* సిగ్గు ఎగ్గు లేక తగ్గు తగ్గు అంటూ ముగ్గులోకి లాగకు
ఛెంగు ఛెంగు అంటూ గ్గుర్ గ్గుర్ అంటూ గోడుగేత్తకు
గుగ్గిలం లా భగ్గు భగ్గు మంటు తొంగి తొంగి చూడకు
దగ్గు తగ్గించి దగ్గర చేరి ధగ ధగ మెరుపు ఆడించకు
*. కళ్ళజోడు పెట్టుకొని తడిమి తడిమి చూస్తా వెందుకు
చల్లకు వచ్చి ముంత దాచి పిరికి వాడివయ్యా వెందుకు
వళ్ళంతా గుల్ల గుల్ల చేసి కోర్కను తీర్చు కో వెందుకు
ఏ పని చేయక ఊరకే డబ్బు లిచ్చి పోతా వెందుకు
*. చెయ్యొద్దు చెలి నా జీవితాన్ని ఒక ఆటగా
నవ్వొద్దు కోమలి నా భావానికి తోడుగా
కొట్టద్దు కామిని శక్తి లేద్దన్న ఒక్క మాటగా
నీవు తిట్టద్దు నాకన్నా నీకు డబ్బు కావాలిగా
* ముసురుకున్న ముసలి తనాన్ని మరిచే విధముగా
విజ్ఞానాన్ని విస్తరింపచేసుకొని జ్ఞానభోధలు చేయాగా
ఆజ్ఞానులను, జ్ఞానులుగా మార్చుటకు ప్రయత్నించగా
60లోఉన్న 20లోఉన్న వారివలె మావంతు కృషిచేయగా
*. విధి తప్పింప ఎవరి తరమూ కాదు
మనస్సును మేపిమ్చుట కష్టము కాదు
సుఖము ఇంతని చెప్పుట సాద్యము కాదు
యవ్వనము ఎప్పుడు స్తిరముగా ఉండదు
*. శంఖంలో పోస్తే గాని తీర్ధం కాదు
పుష్పవతి ఐతే గాని పెళ్ళి కాదు
అనుభవం ఐతే గాని నిజం తెలియదు
పెళ్ళి ఐతే గాని సుఖం అంటే తెలియదు
*. విధి తప్పింప ఎవరి తరమూ కాదు
కళ్ళలో కన్నీరు ఆపడం తరము కాదు
పరిమళాన్ని ఆపడం ఎవరి తరము కాదు
ఆడవాళ్ళ మధ్య తగాదా తీర్చుట కుదరదు
*. సొమ్ము పిల్లలు లేక పోతె దమ్ము ఉండదు
దమ్ము లేకపోతె మంది మార్బలం ఉండదు
మందిమార్బలం లేకపోతె పరువు ఉండదు
పరువు లేకపోతె రజకీయ పదవి ఉండదు
*. పడ్డ వారెవరు చెడ్డ వారు కాదు
ఆడది తిరిగినంత మాత్రాన చెడ్డది కాదు
మగాడు తిరగనంత మాత్రాన చెడ్డవాడు కాదు
బ్రతుకుకోసం వళ్ళు అమ్ముకొనే వారుచెడ్డవారుకాదు
*. చెడ్డ కొడుకుండచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు
చెడ్డ మొగుడుండచ్చు కాని చెడ్డ భార్య ఉండదు
మనసు మంచిది కావచ్చు కాని చేసే పనే ఉండదు
భర్త శాంతంగాఉండచ్చు భర్యమాత్రం శాంతంగా ఉండదు
*. తనదాకా వస్తేగాని తత్త్వం భోద పడదు
పెళ్ళైతే గాని మనసు కుదట పడదు
ఇద్దరు కలిస్తేగాని ఆదృష్టం పట్టదు
కోరిక కలిగితే వయసుతో పని పడదు
*. వేషదారి మాటనెపుడు విశ్వశింప రాదు
మాటకారి నెపుడు నమ్మి మొసపోరాదు
తెలివైన వాడు మౌనముగా ఉండ రాదు
మనసున్నవాడి మాటలు మరువరాదు
*. చేప పిల్లలకు నీటిలో ఈత ఎవరు నేర్పారు
పక్షలు గాలిలో ఎగరమని ఎవరు చెప్పారు
జంతువులును చంపి ఎవరు తినమన్నారు
చదువులేని స్త్రీకి శృంగారం ఎవరు నేర్పారు
*. చిలువలు వలువలు చేసి చెప్పారు
అదిగో గుడ్డు అంటే ఇదిగో పిల్ల అంటారు
గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిమ్చిం దంటారు
కోరిక ఉంటే వయసుతో పని లేదంటారు
*. వద్దన్న వదలకుండ నా వెనుకే తిరుగుతారు మా వారు
ఎంత చేసిన ఏదోతగ్గించానని మొత్తుకుంటారు మావారు
నేనొక యంత్రాన్ని, యంత్రంలా చూస్తారు ఇంట్లో అందరు
సందిస్తే చాలు నన్ను ములగ చెట్టు ఎక్కిస్తారు మావారు
*. అందరికోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరు
పూజ చేసేది ఒక్కరు, చేయించుకొనే వారెందరు
అదృష్టం పట్టేది ఒక్కరు, అనుభవిమ్చేవారెందరు
పెళ్లి చేసుకొనేది ఇద్దరు, చేయించే వారెందరు
*. బొంగరంలా కళ్ళు తిప్పుతున్నావు
ఉంగరంలా జుట్టు పెంచుతున్నావు
బొడ్డు క్రిందకు చీర కడు తున్నావు
బొడ్డును చూపక మత్తెకిస్తున్నావు
*. పగడాల పెదవులతో మమ్ము పడగోడు తున్నావు
మల్లెపూల కురులతో మమ్ము మైమరి పిస్తున్నావు
మేడపై బట్టలారేస్తూ నవ్వుతూ నన్ను పిలుస్తున్నావు
నా కలలోకి వచ్చి చిలిపి చేష్టలతో భాధ పెడుతున్నావు
*. తీయని ముచ్చట లెన్నో చెప్పి ఆలోచనలో దింపావు
పెదాలను అంది అందించ కుండా జాగార్త పడినావు
మబ్బులు అంచులు దాక నా మనసును లాగినావు
నాకు పెళ్ళి కుదిరింది నా బ్రతుకులోకి రాకు అన్నావు
*. అన్నదానం జాములో నరగి పోవు
వస్త్ర దానం ఏడాది లో చిరిగి పోవు
గృహదానం కొన్నేళ్ళకు కూలిపొవు
ప్రేమ దానం జగతిలో నిలిచి పోవు
*. మంచిని కోరి మంటను పంచనివాడు భంధువు
హితం కోరి యక్ష ప్రశ్నలు వేయనీవాడు హితువు
సాన్నిహిత్యం కోరి ప్రాణానికిప్రాణమైన స్నేహితుడవు
సమస్త ప్రాణులకు మేలు చేసే సన్నిహితుడవు
*. పువ్వుకు తావి లాగ ఉండాలి
భార్యను భర్త రక్షిస్తూ ఉండాలి
విమానంకు రెక్కలు ఉండాలి
ప్రేమకు ఓర్పు సహనం ఉండాలి
*. మద్దెల వాయించే టప్పుడు చేతిలో పట్టు ఉండాలి
వీణ వాయించే టప్పుడు వేళ్ళ గోళ్ళు ఉండాలి
ఫ్లూటు వాయించే టప్పుడు రంద్రాలపై వెళ్ళు కదలాలి
భార్య భర్తలు సుఖపడే టప్పుడు వాళ్ళంతా కదలాలి
*. మనుష్యుల నడవడి బట్టి మనం మారాలి
గొప్పలు చెప్పే వారిని దూరంగా ఉంచాలి
ఎదురు మాట్లాడేవారుంటె మనమే తగ్గాలి
ఇరువురుకలసి ఒక్క మాటమీద నడవాలి
*. ఇంద్రి యాన నయనం ప్రధానం
తీర్ధంబున తులసి నీళ్ళు నయం
తెగించిన వాడికి తెడ్డె లింగం
విచ్చుకున్న పద్మం మరీ అందం
*. అవన్నీ వట్టి ఊక దంపుడు కబుర్లు
ఇద్దరిమద్య ఏమీలేదు వట్టి పుకార్లు
ఇద్దరం కలసి తిరిగాం వట్టి షికార్లు
కేవలం ముద్దుకే వచ్చాయి చక్కర్లు
*. సూదిలో దారం ఎక్కిచ్చాలి రా బావ
మల్లె పూలు సద్ది సరి చేసుకో బావ
సూది కదిలించను దారం ఎక్కించు బావ
సందులో పని కుదిరిందనక పెట్టు బావ
*. నా హృదయంలో ఉంది నీ రూపు
నీవు ఎందుకు చూస్తావు ప్రక్కవైపు
మరువ లేను నీవు పంచిన వలపు
నీకు ఏదికావాలన్నా ఇస్తాను తెలుపు
*. నీ బుగ్గలు బూరెలై పొంగుతూ వుంటే
నీ ఊరువులు ఒకటై ఉరకలు వేస్తుంటే
నీ పిరుదుల కదలికలు మతి పోతుంటే
నిన్ను చూస్తూ ఉంటే నాకలనిజమైనట్టే
*. పెళ్ళనేది నూరెళ్ళ పంట
ఇరువురు కలసి బ్రతకా లంట
ఇది సుఖ-దుఖాల పల్లకి నంట
పరువాలు దోచే సమయమంట
*. పొంగే కెరటం తీరం వైపు పరుగు
మకరందం కోసం తుమ్మెద పరుగు
తుంటరి పెదవి జంట కోసం పరుగు
ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు
*. ప్రేమాయణం ముదిరిన పాకం లాంటిది
ఆత్మార్పణం పిరికి వాని పని లాంటిది
శోభనం విద్య నాసనానికి పునాది
సంసారం కత్తిమీద సాములాంటిది
*. కంచే చేను మేస్తే కాపు ఏమి చేసేది లేదే
పెళ్ళాం వీధిని పడితే మొగుడేమి చేసేది లేదే
మెగుడు మొగాడు కాకపొతే పెళ్ళాం ఏమీ చేసేదిలేదే
డబ్బుతో సుఖం కన్నా రోగం వస్తుందని తెలియందికాదే
*. చేయాలను కున్నది చేయి, చెప్పాలను కున్నది చెప్పు
తినాలను కున్నది తిను, త్రాగాలనుకున్నది త్రాగు
ఆడాలనుకున్నది ఆడు, కలవాలనుకున్నపుడు కలువు
తెలియని మాటలు విను, పెళ్ళాం మాటలు విని మసలుకో
*. నీ కళ్ళతో చూడు నాకళ్ళల్లో నీళ్ళు కనబడుతాయ
నా కాళ్ళు చూడు పాదాల బీటలు కనబడుతాయ
నా సళ్ళను చూడు నీకొరకు బరువెక్కి కనబడుతాయ
నా బంగారపు వళ్ళు చూడు నీకు మతి పోగొడు తుంది
*. రచ్చ రచ్చ చేయకు రమణి రమ్యమైన ఈ రోజున
రవ్వల గొలుసుకు రణ రంగం చేయకు ఈరోజున
రుస రుస లాడకు ఈద్దరి ఆశలు ఫలించే ఈ రోజున
సంతోష సంబరముగా జరుపు కోవాలి ఈపెళ్లి రోజున
*. మనస్సును ఊహల్లోకి విహరింప చేసే ముద్దుగుమ్మ
మగతను మాయం చేసి ఉల్లాస పరిచే ముద్దుగుమ్మ
మాయ మర్మం తెలియని పరువాన్నిపంచే ముద్దుగుమ్మ
ముద్దు మీద ముద్దు పెట్టి సుఖాన్ని పంచే ముద్దుగుమ్మ
*. మొగ మొహం ఎరుగని పరువంలో ఉన్న పిల్లనంది
పస ఉంటే ఈ క్షణమున పరువాన్ని దోచుకోమన్నది
ఇద్దరు ఏకమై ఒకటవ్వాలని యవ్వన కోరిక తెలిపినది
పిల్లగుట్టుతెలిసిందినాబల్లగట్టుఎగిసిపడుతున్నది
*. చూసి చూసీ కళ్ళు కాయలు కాసాయ
సూర్య వేడికి రోళ్ళు పగల కున్నాయ
కోపంపెరిగితే వళ్ళు వేడి సెగలయినాయ
నడుస్తూపోతే మైళ్ళు తగ్గి గమ్యంచేరి నావా
*. చదువుకున్న వాని కంటే చాకలి మేలు
ఉంచు కున్న దాని కంటే ఉన్నదే మేలు
నుదుట వ్రాసిన సుఖ-దుఖాలే మేలు
శక్తి ఉన్నప్పుడే దేవుని కొలువుట మేలు
* వేడి సెగకు పొంగే పాలను నీటిచుక్కతో చల్లార్చు
గగనంలో మేఘం పొంగును మెరుపు చల్లార్చు
మమతల పొంగును శాంతి సౌభాగ్యాలు చల్లార్చు
వయసు పొంగును ముద్దు మురిపమే చల్లార్చు
* భర్త వేరొకరితో ఉంటే భార్య కన్నులు నిప్పులు కురుస్తాయి
వినకూడని మాటలు వింటే వళ్ళంతా మంటలు మండుతాయి
భార్య భర్త కోరిక తీర్చకపొతే కోపంతో కళ్ళువేడి సెగలవు తాయి
అగ్గిమీద గుగ్గిలంలా అరిచేవాడికి శాంతివచనాలు తలకెక్కుతాయ
*. సుజనుడిలా నడుచు సుజనుడిని
పశువు వోలే ప్రవర్తించు పాపిని
మందుకు బానిసైన మూర్ఖున్ని
కామాన్ని జయించలేని కాముకుడ్ని
64. మల్లెలు జడన దురిమిన నొక మగువను చూస్తె
కళ్ళలో కాంతి, చెక్కిళ్ళులో మేరుపును చూస్తె
చెంతకుపొయి నవ్వుతూ కోర్కను తెలియ పరిస్తె
ముందు లోకం చూడు తరువాత నీ కోరిక చెల్లిస్తా
*. పంచభక్ష పరవాన్నాలు తిన్న వారికి తిన్నంత
వైడూర్యాలు అందుకున్నవార్కి అందుకున్నంత
బంగారపునగలు కావలసినవారికి కావలసినంత
సొమ్ము తనది కానప్పుడు పంచుతారు ఊరంత
*. జాలిగుండె లేని పాషాణంగా మారావు మమత
ఎందుకు నామీద తాపం, కశి, కక్ష, కోపం, ఎవగింత
సహచర్యం నోచుకోలేని ఈ బ్రతుకెందుకు మమత
ఏ మన్న మరువలేను నీవు ఉంటావు నామనసంత
*. కొత్త కాపురంలో కుడి కాలుతో పెట్టాలి అడుగు
కోరుకున్న మొగుడే కదాఅని వేయకు తప్పటడుగు
అత్త,ఆడపడచులవద్ద జాగ్రత్తగా వెయ్యాలి ప్రతిఅడుగు
భర్తను మొహమాట పడకుండా కావలసింది అడుగు
*. వెచ్చదనం మమతలకు మూలధనం
పైరు పచ్చదనం అందరికి మూలధనం
తల్లి ప్రేమ అందరికి పంచే సమాన ధనం
అక్రమ సంపాదన స్తిరంగా ఉండని ధనం
*. మల్లికా మౌనమేల ఈ వేళ
మనసును దోచిన ఈ వేళ
ఆశలు తీరుస్తున్న ఈ వేళ
వలపు పంచుతానన్న ఈ వేళ
*. కావలసింది కమ్మని కబుర్లు కాదు పని చేయగల స్త్రీ
అందరూ చూడాల్సింది రూపం కాదు గుణం గల స్త్రీ
వంపు సొంపులు గల స్త్రీ కన్నా కావాలి ఓర్పుగల స్త్రీ
ఆకర్షించి చక్కని మాటలు పలికే తీర్పు నేర్పు గల స్త్రీ
*. తలార స్నానముచేసుకొని, జుట్టు ఆర బెట్టుకొని
ముఖమునకు పౌడర్ వ్రాసుకొని, బొట్టు పెట్టుకొని
అద్దంలో అందాన్ని చూసి నవ్వుకొని,చేలికాడేడని
నాలో వేడిని తగ్గించే మగాడేడని కోరేమధురవాణిని
*. లోకం తీరే అంత, లోకం పోకడే అంత
పాపం లోకం అంత, దీపం వెలు గంత
చేసేది చాలకొంత, చేయాల్సింది మరింత
స్త్రీ సుఖం కొంత, ఇరువురికి ఫలితం మరింత
*. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్ట లేడు
అనువుగాని చోట అధికుల మనలేడు
డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు
ప్రేమించ లేనివాడు భర్తగా పనికిరాడు
*. ఇచ్చే వాడుంటే చచ్చేవాడు లేచివస్తాడు
చచ్చినోడికి వచ్చిందే కట్నమన్నాడు
తాత ఐన 16ఎల్ల పడచుతో పెళ్ళన్నాడు
ఆడదంటే ప్రతిఒక్కరికి లోకువన్నాడు
*. ఆడువారి పనులకు మాటలకూ అర్ధాలే వేరులే
మగవారి మాటలకు రాలును మణి రత్నాలే
పిల్లల నవ్వులకు రాలును ముత్యాలు మూటలే
మనం పూజించాలి శ్రీ వేంకటేశ్వరుని పాదాలే
*. నక్కలు బొక్కలు వెదుకును
కుక్కలు చెప్పులు వెదుకును
సతులు పతులును వెదుకును
ప్రేమలు బ్రతుకుని గట్టెంకించును
*. తెలుగు భాషను వెలుగుగా విశద పరిచి
పాడు కొమ్మని పద్యములు పరవశించి
తెలుగుభాష గొప్ప జగతికి తెలియపరిచి
తెలుగువారి గొప్పను ప్రపంచములో విస్తరించు
*. సూర్యకిరణ స్పర్సతో పద్మం వికసిస్తుంది
చంద్రకిరణ స్పర్సతో కలువ వికసిస్తుంది
మేఘం గాలి స్పర్సతో వర్షం కురిపిస్తుంది
పరువంలో ఉన్నపడచు సర్వం అర్పిస్తుంది
*. బంగారంలా కోర్కలు ఖరీదయ్యాయి
సుఖమైన బ్రతుక్కు కస్టా లోచ్చాయి
పొగడిన నోటితోనే తిట్లు కూడపడ్డాయి
తప్పుచేసిన బొత్తిగా కంటికి కరువయ్యారు
* ఎండా వానలు వాటి ఇష్టం ప్రకారం వస్తాయి
జీవితములో సుఖ దుఖాలు వెంబ డిస్తాయి
భందాలు వద్దనుకున్న అవసరమవుతాయి
ప్రేమపక్షులు మోజు తగ్గాక గూటికే చేరుతాయి
*. శాంతి సహజీవనం సర్వులకు మేలు
అచ్చి వచ్చిన స్తలం అడు గైన చాలు
నిత్యం సుఖం పంచే భార్య ఉంటే చాలు
ఎదురు ప్రశ్న వేయని భర్త ఉంటే చాలు
పెళ్ళైన మొదటి రాత్రిలో భర్త, భార్యను చూసి ఏమి మాట్లాడాలో తెలియక ఐవిధముగా పలికాడు
*. తొంగి తొంగి చూడమాకు, నాకు అసలే, సిగ్గు ఎక్కువ
ఉడికించి, ఉడికించి, ముద్దు పెడితే, మక్కువ ఎక్కువ
అంది అందకుండా తిరిగితే, మనసుకు కోరిక, ఎక్కువ
ముంత మసాల కొరకు, మనసు లాగితే మరీ ఎక్కువ
అప్పుడే భార్య మొహమాటం లేకుండా ఈ విధంగా పలికింది కలియుగ వనిత
*. నీకు వయసుంది, నాకు వయసుంది, మనిద్దరి మద్య అడ్డేముంది
నీలొ ఉన్న వేడిని చల్లార్చే, చల్లని వలపు పట్టము, నావద్ద ఉంది
నీ పెదాలలో, నాపెదాలు జత కలిపి అమృతము, తాగాలని వుంది
నా సర్వస్వము నికే అర్పిస్తున్నాను న అందాన్నిజుర్రకో అన్నది
వెంటనే భర్త నవ్వులాటతో ఈ విధంగా పలికాడు
*. తెల్లటి చీర, బంగారపు చేతిలో పాల గ్లాసు, చూస్తూవుంటె
మత్తు చూపులాతో, మేలి ముసుగుతో, నడుస్తూ వుంటె
కాలి అందెల శబ్దాలు, గాజుల శబ్దం, గుండెను తాకుతుంటె
ఆగలేక అమాంతం బంతులందు కోవాలని, ఆశగా ఉందే
భార్య పాలగ్లాసు అందిస్తూ వ్యయారం వలపోస్తూ బుగ్గన చిటికేసి ఐవిధంగా అన్నది
*. ఆదిలో హంసపాదు రాకుండగా అధరామృతము అందుకో
ఆద మరచి నిద్రించక నీకోసం దాచుకున్నవన్నీ దోచుకో
సిగ్గుతో చీరవిడిస్తే , అందాలను చూస్తూ లోట్ట లేయకా జుర్రుకో
కాలం మరచి తేరిపారి చూడకు స్వర్గలోక సుఖాలందుకో
ఆ ఊపుకు ఆగలేక భయం భయం తో ఈ విధంగా పలికాడు
*అదేపనిగా కొంగు జార్చి, నన్ను ఇబ్బంది, పెట్టకు
క్రిందా పైన, ఆశ తీర్చు కోవాలని, తొందర పెట్టకు
నీలో ఉన్న గుట్టు విప్పాలని, నన్ను భయపెట్టకు
వద్దన్నా నీ కొవ్వు కరిగిస్తా, నాతో పందెం పెట్టుకోకు
ఎగతాళిగా పైట తీసి మొహం మిడియా కప్పుతూ తగ్గారగా చేరి ముద్దు ముద్దుగా పలికింది
*. బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికి రారు
చేప కన్నుల చిన్నది చాటుకు రమ్మంటే రాని వారెవరు
పున్నమి వెన్నెలలో కలయక జరాగాలని కోరనివరెవరు
ఆకు వక్క సున్నం వేసిన తాంబూలం రుచిచూడనివరెవరు
ఇక తన్మయత్వంతో ఊగిపోయాడు భర్త, ఇక వంటి మీద వస్త్రం నిలవనంటుంది, ఆయన తమకంతో
*. నిగనిగ లాడే నీవళ్ళును చూస్తే, నాకు గుచ్చు కుంటాయి ముళ్ళు
పాలపొంగుల పైట జారినప్పుడు చూస్తే, నన్ను కలవరపెడతాయి కళ్ళు
బొడ్డు క్రింద జార్చిన చీరను చూస్తే, నాకు కావాలని పించె కౌగిళ్ళు
పెదాల కదలికను మూతి విరుపును చూస్తే, తప్పక తెప్పించాలి వేవిళ్ళు
అలా మొదటి రాత్రి సుఖంగా జరిగి పోలింది వారిమధ్య సంభాణలు
*. కక్ష ఎందుకు పోటీ జగాన
క్రోధ మెందుకు నేటి యుగాన
ద్వేష మెందుకు సాటి స్త్రీ పైన
పంతమెందుకు ప్రేమ మందిరాన
తెల్లరాక అమ్మలక్కలు వచ్చి అమాంతం తీసుకెళ్లారు పెళ్లికూతురిని
ప్రస్నంయిదా ప్రశ్నలు వేశారు నిన్న రాత్రి ఎం జారింది అని అడిగారు
చిరునవ్వే వాసరికి సమాధానం
వెంటనే తల్లి అడిగింది
*. మౌనం అంగీకార సూచకం
మనసులోని కోర్కల ఫలితం
మమతల కలయక వలయం
శృంగారం ఇరువురి అంగీకారం
అవునుకదా అంటూ నవ్వింది .
అక్కడే ఉన్న ఒక అందాలా భామ నవ్వుతూ ఐవిధముగా అన్నది
*. పట్టుదలకు పోకు, పరువాలను భందీ చేయకు
పట్టిందల్ల బంగారము అని నమ్మి మోస పోకు
నీవు అనుకున్నది సాధించేదాక పట్టు విడువకు
ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధించాలని మరువకు
మరో భామ నవ్వుతూ ఐవిధముగా అన్నది
*. కేవలం పుస్తకాల పురుగు కారాదు
ప్రకృతిలో పంచే సుఖం మరువరాదు
మదిలో పరువాల పందిరిని వదలరాదు
అందాల సుందరి చూపులకు లొంగని వారెవరు
అక్కడే ఉన్న బామ్మగారు ఈ విధముగా అన్నారు
*. శరీర మాద్యం ఖలు ధర్మసాధనం
ఆరోగ్యం అందరికీ దివ్య ఔషధం
యవ్వనం సుఖం పురుష లక్షణం
సుఖాలను అందుకోవటమే స్త్రీ లక్షణం
*. తెలుతూ తెలుతూ సాగాలి సముద్ర యాత్ర
సాగుతూ సాగుతూ పల్లానికి నీటి యాత్ర
సుఖిస్తూ సుఖపెడ్తూ చేయాలి ప్రేమ యాత్ర
ఆడుతూ పాడుతూ సాగించు జీవన యాత్ర
*. తినద్దు చద్ది. తాపమని వేదించ వద్దు
పరువం సద్దు, కెవ్వుమని అర వద్దు
సంపద పద్దు, సరస సంతోషాల హద్దు
ఒకరు ముద్దు, ఇద్దరు కలవాలి హద్దు
అని బామ్మగారు తన భావాలు తెలియపరిచింది అలా సాగింది ఆరోజు
రెండావా రోజు రాత్రి భర్త ముచ్చట్లు
*. గుచ్చి గుచ్చి చూడమాకు నాకు గుండె దడ
కోరికతో రెచ్చ కొట్టమాకు ఉంటాను తలగడ
ఆశగా ఉండాలని ఉంది వద్దనమాకు పొంగులపైపావడ
రుచి చూడాలని ఉంది నాకు పెరుగు ఆవడ
వెంటనే భార్య ఆలాపనగా అన్న మాటలు
*. మంచిని పెంచు చెడును త్రుంచు
సుఖమును పంచు ద:ఖాన్ని త్రుంచు
శుభమును పెంచు అశుభమును త్రుంచు
ప్రేమను పంచి అహంకారాన్ని తగ్గించు
వెంటనే భర్త అబ్బా ఏమిటే ఆ పరుష మాటలు నిన్ను చూస్తూ ఉంటే నన్ను గిలిగింతలు పెడుతూ ఉన్నదే
* నీ చేతులు తాకితే నా మది తెలిపొయె
నీ కవ్వింతలకు నా గుండె బరువాయె
నీ చూపుకు మన్మదబాణాలు తగిలాయె
నీ మాటతో నాగుండె పరుగెత్తే గుఱ్ఱమాయె
*. కలలు కనగానె సరిపోదు మనసు అర్ధం చేసుకో
మనసులోని కోర్కలను తీర్చేమార్గం ఇదేనని తెలుసుకో
నా ఆశలు తీర్చావనుకో నీ బానిస నై పోతా
నీ సంతోషము కొరకు నా సర్వస్వము ఇక నిదే
*. శ్రుతిమించి రాగాను పడి ఇబ్బంది పెట్టమాకు
కళ్ళు గగుర్పాటు తెచ్చే పనులు చేయ మాకు
ఇప్పుడే మొగ్గ విచ్చిన పువ్వును అని మరువకు
పువ్వును నలిపై, ఇక్కడ కోచ్చాక సిగ్గు పడకు
అలా ఆమూడు రోజు లు ఇరువురి మధ్య సుఖాలువెల్లువ విరిసే
ఏమండీ పొద్దున్నే ఏదో వ్రాస్తున్నారు డైరీ శృంగార చమక్కులు కొన్ని వ్రాస్తే ఎలాగుంటుందో అని ఆలోచిస్తున్నాను
ఇది
ఒకరు వ్రాయస్తే చదివేది కాదు, ఇది ఒకరు చెపితే వినేది కాదు, ప్రకృతి పరవశం
అందరి సొంతం, పిండి కొద్ధి రొట్టె అన్నట్లుగా శక్తి కొద్దీ సుఖం అన్నారు
ఎవరో మహానుభావులు, మీ పిచ్చిని ఎవరు వద్దంటారు, అయిన మీరు వ్రాసాక నాకు
ఒక్కసారి చూపండి, ఇది సెన్సార్ కధ కదా, ఆట్లాగేనే
వెంటనే భార్యను మోడరన్ డ్రస్సులో చూసి ఈ విధంగా వ్రాసాడు
*. జానా బెత్త గౌను వేసుకొన్న, పెద్ద పాప
బిత్తరచూపులతో మత్తులోకి, దించే పాప
పరువాలను పదిలముగా, పంచె పాప
కాలు జారీ పడక జాగర్త పడు పెద్ద పాప
.* సూర్యకిరణాలను పట్టుకొని ఇంధనంగా మార్చాలనుకున్నా
కిరణాలవల్ల వచ్చే కలువపూలపై ప్రయోగాలు చేయాలనుకున్నా
కిరణాలతో క్రిమికిటకాలను కాలుష్యాన్ని తరిమేయాలనుకున్నా
నీటిని ఆవిరిగామార్చి, కృత్రిమ మేఘాలును సృష్టించాలనుకొన్నా
* . ఎవరెంత ఎగతాళి చేసిన నా బ్రతుకింతేనని చెప్పాలనుకున్నా
అమ్మ నాన్నలకు సేవలు చేస్తూ రుణపడి ఉండాలనుకున్నా
అనారోగ్యులను ఆరోగ్యులుగామార్చుకు నావంతు కృషి చేస్తున్నా
చేతనైనంత సహయము చేస్తూ, స్త్రీలను గౌరవిస్తూ బ్రతుకుతున్నా
ఎలజవ్వనంలోని కొత్త సొగసులు
-------------------------------------------------
సీ: ఘనసారమును సార ఘనము నాక్షేపించు
కలికి పలుకుల యింపు, కచము పెంపు;
పద్మరాగము, రాగపద్మము నదలించు
రమణంపు మోవి, పాదముల ఠీవి ;
మృగమదంబును , మద మృగమును హసియించు,
గాయంపు వలపు, కన్దోయి మెలపు ;
వరనాగమును , నాగవరముఁ జుల్కగఁ జూచు
నవకంపు నూగారు, నడల తీరు;
తే: చక్ర సామ్యత వెలయు కుచమ్ములందు ,
సామ్య చక్రతఁ దగు వెక్కసఁపుఁబిరుందు ;
రూఢి నారోహిణియు, నవరోహిణియుఁగ,
నెలఁత చెలువంబు సారె వర్ణింపఁ దగును;
అనిరుధ్ధచరిత్రము :ద్వి. ఆ: 26 వ పద్యము; కనుపర్తి అబ్బయామాత్యుడు!
ఈపద్యం కవితా కళాప్రస్థానంలో చాలా గొప్పది. ఇందులో కావ్య నాయిక ఉషాసుందరి యెలజ్వ్వనపు సొగసులను వర్ణించుచున్నాడు కవి. చామకూర తరువాత యిలాంటి చమత్కార భాసురమైన వర్ణన నిర్వహించిన
కవి మరియొకడు కానరాడు.
పద్యాన్ని పరిశీలిద్దాం. ఇందులో దీపక మనేయొక అలంకారాన్ని ప్రయోగించి తన రచనకు వన్నెలు దిద్దాడు కవి. దీపకం ఒక అలంకారం. " ఒకే క్రియతో రెండు విషయాలను సమన్వయ పరచుట"- దీపకం." గేహళీ దీపన్యాయం" అనే
తర్క శాస్ర్ర సూత్రం దీనికాధారం.' ఇంట్లో మధ్యగది గడపమీద దీపం పెడితే అది రెండుగదులలో వెలుగు నింపినట్లు ,ఒకేక్రియ రెండు విషయాలను సమన్వయపరుస్తుంది.
ఘనసారమును సారఘనము నాక్షేపించు
కలికి పలుకులయింపు,కచముసొంపు;
ఆయతివ పలుకులు పచ్చకర్పూరం చల్లదనాన్నికూడా ఆక్షేపిస్తాయట; కురులపెంపు దట్టమైన మేఘాన్ని ఆక్షేపిస్తాయట; ఆక్షేపించు అనే ఒక్క క్రియతోనే రెండు కార్యములను కవిసాధించాడు.ఇలాగే తక్కినపాదాలలోగూడా.
రెండవ పాదంలో ఆమె యందమైన పెదవిని, పాదముల యందాన్ని వర్ణస్తున్నాడు. ఆమె పెదవి పద్మరాగమును యెడలిస్తుందట,అంటే పద్మరాగ మణికన్నా రక్తిమ గలిగి ఉంటుందని భావం.పాదాలయందం , రాగ పద్మము నెడలించునట,తామర పూల రాగమును అంటే అరుణవర్ణమును తిరస్కరించునని భావం. ఇందులో యెడలించు క్రియ.
ఆమె శరీరపు సువాసన మృగమదమును (కస్తురి ) జూచి పరిహసిస్తుందట, అంటే అంతకు మించిన సువాసనలు గలది యనిచెప్పటం. ఆమెకన్దోయి యందం పొగరెక్కిన జింక చూపును గూడా నవ్వగలదట,లేడిచూపుల
కన్నా అందమైనవనిభావం. ఇక్కడ హసించు క్రియ;
ఆకన్నె నూగారు (వక్షస్థలమునుండి నాభివరకుగల సన్నని వెంట్రుకల చాలు) త్రాచు పాము కన్నా అందమైనది.దానినే చుల్కన చేయు నంటూ వెక్కిరిస్తుందంటాడు కవి. నడకల యందమో మదపుటేనుగు(నాగవరము)
నడకలను చులకన చేస్తాయి. అంతకన్నా అందమైనవి అంటున్నాడు. ఇక్కడ చుల్కన జేయు క్రియ;
గీతం దగ్గర పధ్ధతి మార్చాడు. ఆమె స్తనములు చక్రవాకములను బోలితే , ఆమెపిరుదులు చక్రంతో సామ్యాన్ని పొందుతున్నాయి.( గుండ్రంగా ఉన్నాయని భావం)
చెప్పుకుంటానికి రోహిణియనుకోవచ్చు. రోహిణీ నక్షత్రం వలె అందమైనదని భావం. లేదా నూతన రోహిణియే
యని చెప్పదగునని, ఇట్టి యామె చెలువము నెవరు వర్ణింపఁ గ లరు?అని కవిమెప్పు.
మొత్తంమీద పరికిస్తే సారం యిదే!
ఆమె మాటలు ఘనసారం. కురులు దట్టపు మేఘాలు. మోవి పద్మ రాగం, పాదాలు పద్మములు, ఆమె వలపు జవ్వాది
నతిక్రమించును. ఆమెకన్నులు లేడి చూపులను మించును. నూగారు పామువలెనుండును, ఆమె మదగజ యామిని. ఆమె కుచములు చక్రవాకములను బోలును. ఆమెకటి చక్రమువలె నుండును.
ఇక్కడ వర్ణనముగాదు,ప్రధానం, వర్ణించిన తీరు గొప్పదని భావము!
స్వస్తి!

sekarana google sekarana, vivarana rachayata satyanarayana choppakantla gaaru
ప్రణయ లేఖా రహస్యం !
భోజుని సభకు ఒకనాడు మల్లినాధుఁడనే పండితుడు వచ్చాడు . రాజుగారికి వినయంగా నమస్కరించి " మహారాజా! మీసభలో కాళిదాసుగారి వంటి గొప్పకవులు, పండితులు, మేథావులు అనేకమంది ఉన్నారు వారిలో యెవ్వరైనా ఈశ్లోకంలోని మర్మం విప్పి చెప్పగలరా?" - అంటూ
శ్లో: కాచిత్ బాలా రమణ వసతిీం ప్రేషయంతీ కరండమ్
దాసీహస్తాత్, సభయ మలిఖత్ వ్యాళ మస్యోపరిష్టాత్
గౌరీ కాంతం , పవన తనయం, చంపకం , చాత్ర భావం
పృఛ్ఛత్యార్యో నిపుణ తిలకో, మల్లినాధః కవీంద్రః ;- అనేశ్లోకం చదివి వినిపించాడు. దాని యర్ధమిది;

కాచిత్-ఒకానొక; బాలా-యువతి; కరండం-చిన్నపెట్చెను;
దాసీహస్తాత్- దాసిచేతికి యిచ్చి; రమణవసతిం-ప్రియునియింటికి; ప్రేషయ
ంతి -పంపుచున్నదియై; అస్య- దానియక్క; ఉపరిష్టాత్- పైభాగమునందు; సభయం- భయపడుతున్న; వ్యాళం-పామును,;
గౌరీకాతం- శివుని;పవనతనయం-హనుమంతుని;చంపకం--సంపెంగపూవును;అలిఖత్--చిత్రించినది;ఆర్యః--సభలోనిపెద్దలు;నిపుణతిలకః--ెతెలివైనవారు; కవీంద్రః- కవాశ్వరులను; మల్లినాధః--మల్లినాధకవి; అత్రభావం--ఇందలిభావము,యేమైయుండునని పృఛ్ఛతి--అడుగు చున్నాడు;
భావము; ఒకయువతి దాసిచేతికి ఒకపెట్టెనిచ్చి ప్రియుని యింటికి పంపుచున్నది. ఆపెట్టెపై పాము, శివుడు,
ఆంజనేయుడు , సంపెంగల బొమ్మలను భయం భయంగా చిత్రించింది. దీని భావమేమి? యని మీసభలోని పెద్దలను ,కవులను, తెలివైనవారిని మల్లినాధుడు అడుగుచున్నాడు. అని;
విన్నవారందరూ మౌనము వహింపగా కాళిదాసు ఆశ్లోక భావము నిట్లు వివరించెను.
" ఆయువతి అష్టవిధ శృంగార నాయికలలో ప్రోషిత భర్తృక. యెక్కడనోయున్న ప్రియునికి తన విరహబాధను మర్మంగా సందేశం పంపుతున్నది. తన విరహ బాధను నలుగురు పెంచుతున్నారని,నువ్వు త్వరగా వచ్చి ఆబాధను పోగొట్టమని ,యీసందేశంలోని మర్మం!
ఆనలుగురు యెవరనేది వారి శత్రువులను పెట్టెపై చిత్రించటం ద్వారా తెలియ జేసింది. విరహాన్ని పెంచేవి యేమిటి?1 మలయమారుతం . దానికి శత్రువు పాముగదా (పామునకు గాలియాహారం) 2 రెండవది మన్మధుడు. మన్మధునకు శత్రువుశివుడుగదా! ఇక3 మూడవది ఉద్యాన వనములు . వనమునకు శత్రువు వానరనేగదా!( అదేహనుమంతునిబొమ్మ) 4 నాల్గవది తుమ్మెదలు.వాటికి శత్రువు సంపెంగపూలు.( సంపెంగ వాసన తుమ్మెదకు పడదు)
ఇంత రహస్యంగా కోడ్ భాషలోవలె యెవరికీ అర్ధం గానంతగా చిత్రించిన యువతినీ, ఇదిచక్కగా వర్ణించిన మల్లినాధునీ, దీనిని చక్కగా విపులంగా వివరించిన కాళిదాస మహాకవిని సభఎలోనున్నవారెల్లరు బహుధా ప్రశంసించినారు.
భోజుడు కాళిదాస మల్లినాధులను ఘనంగా సత్కరించినాడు.
నాటి కవుల ప్రతిభా వ్యుత్పత్తులట్టివి!
మహాకవి కాళిదాసుకధ!
-------------------------------------
శ్లో: అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా , హిమాలయోనామ నగాధిరాజః /
పూర్వాపరౌ వారినిధీం విగాహ్య, స్థితః పృథివ్యా ఇవ మానదండః//
కుమార సంభవము-ప్రారంభశ్లోకము;
శ్లో: " కశ్చిత్కాన్తా విరహ గురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తం గమిత మహిమా వర్ష భోగ్యేణ భర్తృః
యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు
స్నిగ్ధఛ్ఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు//
మేఘసందేశము -ప్రారంభశ్లోకము;
శ్లో: వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వం దే పార్వతీ పరమేశ్వరౌ//
రఘువంశ మహాకావ్య ప్రారంభ శ్లోకము;
విధి విచిత్ర మైనది; పామరుని పండితునిగ ,దరిద్రుని ధనవంతునిగ ,జేసి యసాధ్యములనెల్ల సుసాధ్య మొనరించును. ఇంతకూ మూలము దైవానుగ్రహమే! ఆజగదంబ యనుగ్రహమున పామరుడును పరమ మూర్ఖుడును అయినవాడు. ప్రపంచపు
మెప్పు బడసిన పండితునిగా నెట్లుమారెనో వినుడు. ఇది కాళిదాసు కథ!
మొదట నితడు వెర్రి గొల్లడు. పరమ మూర్ఖుడు. గొర్రెలను మేపుకొనుచు పరిసరాటవులలో తిరుగు చుండెడివాడు.
ఆరాజ్యమునేలు రాజునకొక కుమార్తెగలదు. పేరు విద్యాధరి. పేరుకు తగిన విద్యావంతురాలు.చక్కనిచుక్క .కానీ యామెకు విద్యాహంకారము మెండు. యుక్త వయస్సువచ్చిన రాకుమార్తెకు తగిన వరునితో పెండ్లియొనర్ప వలెనని తండ్రిప్రయత్నము. కానీయామె విద్యాహంకారముతో రాకుమారుల నెల్లరను తిరస్కరించుచు అవమానింప సాగినది.దానితో వారికి ప్రతీకారము చేయు
కోరిక యేర్పడినది. వారుతగిన వానికై వెదుక నారంభించిరి. ఆయన్వేషమున వారికి ఈవెర్రిగొల్లడు తారసఁ బడినాడు.వీడైతే దానికి తగన శాస్తి జరుగునని యెంచినారు.
వానికి మహాపండితునివలె వేషమును వైచి ,రాకుమార్తెకడకు గొనివచ్చిరి"వీరుమహా పండితులు , చతుర్దశ విద్యాపారగులు, ప్రస్తుతము మౌనవ్రతమును పూనినారు.ఇట్టిమహాపండితుడే మీకు తగిన వరుడని నమ్మబలికిరి. పరమ మూర్ఖుడైనను ఆగొల్లనిముఖమున నేదో తెలియని దివ్యకాంతిపుంజములు మెరయుచుండేను.విద్యాధరి సమ్మతితో వారిరువురకు
వివాహ మైనది.
తొలి రేయి ఆమెకు తెలసినది. అతడు విద్యావిహీనుడని; పరమ మూర్ఖుడగు నతనిని నిర్దాక్షిణ్యముగా బయటకు గెంటుచు "మూర్ఖుడా! నీవు పండితుడవై తిరిగి రమ్ము స్వాగతించెద. లేదా ఆయడవులలోనే బడియుండు మని రోషముగాబలికెను.
మూర్ఖుడేయైనను ఆయవమాన భరమున గుందుచు నతడాయడవిని బడిపోవుచు నొకచో పాడుబడిన కాళికాలయమునకు జేరెను.
అర్ధరాత్రమున కాళిక లోకసంచారమొనరించుచు అటువచ్చి తనభయంకరమైన రూపమునగాంచియు నించుకైనను భయమందని యాతనిని గాంచి దరికి వచ్చి నీ వెవ్వడవు? ఏలవచ్చితివని?రౌద్రముగా ప్రశ్నించినది.
ఆతల్లిని జూడగనే పసిపాపనివలెనేడ్చుచు నామెపాదములను బట్టి తనదీనగాధను వినిపించెను. ఆజగదంబ హృదయముకరగినది. సరస్వతీ మంత్ర బీజాక్షరముల నతని నాలుకపై వ్రాసి మహాకవి వగుదువుగాక ! యనియాశీర్వదించినది. వెంటనే వెర్రిగొల్లనినోట శ్యామలాదండకాదులు వెలువడ సాగినవి. అద్భుతమైన దివ్యశక్తులు అతనకి హస్తగతమైనవి.
రూపము మారినది .వేషము మారినది . భాషమారినది . భావము మారినది. ముఖ్యముగా, నతని మోమున నేదో కొత్తదనము కనబడసాగినది. అమ్మ యనుజ్ఙ గైకొని విద్యాధరి కడ కరుదెంచినాడు. అపుడామె యంతః పురమున హంస
తూలికాతల్పమున విలాసముగా పరుండి యుండెను. వచ్చిన కాళిదాసును యీసడింపుగా జూచి" అయి! అస్తి కించిత్ వాక్య
విశేషః?"- అనిప్రశ్నించినది.( ఓయీ! యేమైనా విశేషమును చెప్ప వచ్చితివా? అని దానియర్ధం )
దానికి సమాధానంగా " అస్తి కశ్చిత్ ప్రచండ వాగ్విశేషః"- (ఆహా! చాలా పెద్ద విశేశమే చెప్పాల్సి ఉందిలే) అన్నాడు.
కాళిదాసు మాటాడిన ఆఒక్కమాటతోనే ఆమెకు అర్ధమైపోయింది, అతడు పండితు డైనాడని.పట్టరానిసంతోషంతో పన్నీటితో పాదాలుకడిగి , అన్నపానాదులతో సేద దీర్చి తన పానుపున గూర్చుండ బెట్టుకొని స్వయముగా వీవెన వీచుచు ,విశేషములను తెలిసికొన్నది.
తదనంతరము కాళిదాసు. భార్య ప్రశ్నలోని అస్తి , కశ్చిత్ , వాక్ , అనే మూడు పదాలనూ ఆధారించుచూ మూడు
మహా కావ్యములను వ్రాసెను.
అస్తి: అస్త్యుత్తరస్యాం" అనేప్రారంభంతో కుమార సంభవకావ్యం! (ఆరంభమునగలదు చూడగలరు)
కశ్చిత్: కశ్చిత్ కాంతా విరహ గురుణా అనేప్రారంభంతో మేఘ సందేశము.( ప్రారంభంలో చూడండి)
వాక్: వాగర్ధావివ సంపృక్తౌ" అనే ప్రారంభంతో రఘువంశము. (చూడండి మొదటిలో)
వ్రాసి ,మహాకవిగా కవికుల తిలకునిగా ,వాసి గాంచాడు. సంస్కృత వాఙ్మయంలో పంచకావ్యాలుగా చెప్పబడే గ్రంధాలలో ఈమూడింటికి ప్రథమ స్థానం లభించింది. భారవి కిరాతార్జునీయం నాలుగవది; హర్షుని నైషథం ఐదవది. యిందు మొదటిమూడు కాళిదాసువి కావటం విశేషం!
ఆతదుపరి 1మాళవికాగ్నిమిత్రము 2విక్రమోర్వశీయము 3 అభిజ్ఙాన శాకుంతలమనే నాటక త్రయ రచన!
ఆపై ధారానగరం భోజుని కొలువు గురించి యేవో ప్రచారంలో నున్నకథలు!
ఇదండీ కాళిదాసు గారి జీవన ప్రస్థానం !

శోభన సౌధగరిమ
--------------------------
సీ: " పాండురప్రభ క్రిందుపడిన చీకటివోలె
జిగి నొప్పు నీలంపు జగతి మెఱసి;
ఔన్నత్యమున మ్రింగినట్టి నింగులు క్రక్కు
కరణి ధూపము గవాక్షముల వెడల ;
ధారుణీ సతి సుగంధ ద్రవ్యములు దాచు
అఱల పేటిక వోలె పరిమళములు
నెలవులై , చెలువారు నిలువులు విలసిల్లి
కొణిగ పారావత కులము వదర ;
తే: పసిడి నీట లిఖించిన ప్రతిమ లలర ,
ఈగ వ్రాలిన నందంద యెలుగు లొసగు
నట్టి " సకినల మంచము" లాది గాగ
మెఱయు పరికరముల నొప్పు మేడమీద;
ఈపద్యం అల్లసాని పెద్దన గారి మనుచరిత్రమున స్వరోచీ-మనోరమల
శోభన సందర్భంగా వ్రాయబడింది.
వివాహానంతరం నాటికాలమున శోభనములెట్లు జరిగెడివో ఈపద్యమునచక్కగావివరింపబడినది.
మనుచరిత్రము-ఆ 6: పద్యం 3 :
అర్ధములు-:- పాండురప్రభ- తెల్లనికాంతి; జిగినొప్పు-మెఱయు; నీలంపుజగతి-నీలముగానున్న గృహభాగము;
ఔన్నత్యము-ఎత్తు; నింగులుగ్రక్కు- ఆకాశము వెలువరించు; కరణి-విధము: ధూపము-పొగ; గవాక్షములు-కిటికీలు; ధారుణీసతి-భూదేవి;
కొణిగ-ముంజూరులు; పారావతములు-పావురాలు; పసిడినీరు-బంగారు పూత; ప్రతిమలు-బొమ్మలు ఒప్ప; ఎలుగు- ధ్వని; సకినల మంచము-పందిరి మంచము;
అదియొక దివ్య మందిరం . ఎత్తైన అంతస్తులుగల భవనంలో అది పై అంతస్తు.గదిగోడలు, పైకప్పు , వెన్నెలవంటి పాలగచ్చుతో ప్రకాశిస్తున్నాయి. నేలపై నీలాలు పరచినట్లున్నాయి.అప్పుడు మందిరంలో కాంతి తెలుపు,ఆతెలుపు కొంచెంతగ్గిన నీలపు
రంగులో నున్నది. కొంచెంచిరు చీకటివలెనన్నమాట. కిటికీలవద్ద సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన ఆరోగ్యప్రదమైన గుళికలుగల
ధూప కలశాలుంచారు. ఆకాశంలోకి చొచ్చుకుపోయి , పగలామేడ ,మబ్బుతునకల్ని మింగి, అరగించుకోలేక , రాత్రి బయటకు కక్కుతున్నదా? అన్నరీతిగా , కిటికీలనుండి తెరలు తెరలుగా పొగలు బయటకు వస్తున్నాయి. ఎన్నో పరిమళాలను వెదజల్లుతున్న ఆమందిరం భూదేవియనేవనిత సుగంధ సంభారాలను దాచుకున్న అరల పెట్టిలా ఉన్నది. ఆభవనం ముంజూరులపై పావురాళ్ళు
కువకువలాడుతున్నాయి.
బంగరు వన్నెల చిత్రాలతో ఆమందిరం లోపలి భాగం అలంకరింపబడి యుంది. ఒకటిని మించిన " సకినల మంచాలు (పందిరి మంచాలు) విభిన్నమైన సౌకర్యాలతో ,అలంకారాలతో సిధ్ధంచేయబడినాయి. ఆమంచాలపై ఈగవ్రాలినా, వాటికమరించిన కృత్రిమ శుకాలు మధురంగా కూస్తున్నాయి. మరెన్నో మన్మధోద్దీప్తములైన ఫలపుష్పాలు ,పానీయాలు, అక్కడ అమరించబడినాయి. స్వరోచి మనోరమ రాక కై యెదురు చూస్తున్నాడు. సరే తర్వాత సర్వాభరణ భూషితయై శోభన గృహం
ప్రవేసించింది మనోరమ .ఇక తర్వాతి వృత్తాతం చెప్పక్కరలేదు. ప్రతిగృహస్థుకూ విదితమే!
పెద్దన గారి అపూర్వమైన సన్నివేశ సృష్టిలో యిదియొకటి. శోభన మందిరం యెలాఉండాలో యిక్కడ చక్కగా వర్ణిచారు. మరీఅంత తెల్లని కాంతిగానీ, బొత్తిగా చీకటిగానీ పడకటింటిలో ఉండకూడదు. తెలినీలంలో మబ్బుల్లో తేలిపోతున్నట్లు
ఉండాలి. అందుకే వెన్నెలగచ్చు పాలగోడలు, తెల్లనికప్పు ,నీలాల నేల అమరించారు. ఆకాంతుల సమ్మేళనం పరమ సమ్మోహనం.
ఈపద్యంలో గమనింపదగింది 'సకినల మంచాలు' యివి అక్కడక్కడ పల్లెలలో ధనవంతుల కుటుంబాలలో యిప్పటికీ
దర్శనమిస్తూఉంటాయి. ముందువెనుకలు అద్దాలుండి, పైన పూల అద్దాకాల పట్టు చాందినీ, నాలుగు ప్రక్కలా జలతారు తెరలు, పందిరిపై అక్కడక్కడా చిలుకల,కోకిలల ,బొమ్మలుగల పందిరిమంచం సకినలమంచం. వాటిపై శయనించిన వారి కదలికల కనుగుణంగా
కోకిలలు మధురమైన పాటలు వినిపిస్తాయి. అదియొక సరిగమల మంచం,
ఇంటి చూరులపై పావురాలుండటం మరో విశేషం. పావురాలు,పిచుకలు , సంతాన సమృధ్ధిగల పక్షులు. అవిగృహాలలో ఉండటం శుభప్రదమని పెద్దల విశ్వాసం. వెనుకటి తరంవారు యిండ్ల వసారాలలో వరికంకులు, జొన్నకంకులు,
గుత్తులుగా గట్టి వ్రేలాడ దీసేవారు. ఇంట్లో పిచుకలు గూడుపెడితే,సంసారం సుఖంగా సాగుతుందని, సంతానం కలుగుతుందని వారి
విశ్వాసం.
భారతీయ సంప్రదాయంలో వివాహం కేవలం కామంకోసం కాదు. మంచిసంతానం కనటం, ధర్మార్ధాలద్వారా
మోక్షాన్ని సాధించటం వైవాహిక ప్రయోజనంగా భావించేవారు. మన నివాస గృహలను మనం అర్చించే పితృదేవతలు రక్షిస్తూ ఉంటారు. ఆకారణంగా యిలాంటి శుభకార్సాలు స్వగృహాలలోజరపటం ఉత్తమం. వివాహం జరిగిన గృహాలలో శోభన దేవతలుంటారు.
అందువల్ల సంతానసోఖ్య సౌభాగ్య కారకమైన శోభన క్రియను వధూవరుల గృహాల్లోనే జరుపుకోవటం ఉత్తమం.
ఇదండీ పెద్దన గారి శోభన సౌధ వర్ణనం! సకినలమంచాల తీరుతెన్నులు/

మంచి పద్యం మధురమైన ఊహలకు మలయానిలం!
"చూ చెద వేలనో ? ప్రణయ సుందరి! నీ కాటుక కళ్ళలోని యా
"చూ చెద వేలనో ? ప్రణయ సుందరి! నీ కాటుక కళ్ళలోని యా
లోచన లేమిటో? హరిణ లోచని! నీ చిరునవ్వులోని సం
కోచ మేలనో ? కుసుమ కోమలి! నీ మధురాధరమ్మునన్
దాచు కొనంగ నేటికి? సుధామయ సూక్తి కళావిలాసినీ! "
జయశ్రీ - కరుణశ్రీ!
ఎంత మంచిపద్యం! ప్రేయసి యనేమాటే మధుర భావనకు మారుపేరు. ఆమె చూపులు, ఆచూపులలోదాగిన యాలోచనలూ, ఆచిరు నవ్వులూ, ఆనవ్వులలో దాగిన సిగ్గులూ, పెదవులు దాటని యాతీయని
మాటలు.
వాహ్! యేమి వర్ణించారు ఆకరుణశ్రీ! ప్రణయసుందరీ!, హరిణలోచనీ!, కుసుమకోమలీ!, కళావిలాసినీ!, యనే ఆసంబోధనలూ, వారెవా! అతివలో అందాల హరివిల్లు నావిష్కరించారు.! మహా కవి జంధ్యాల, మనకులేరుగదా!
ఆయనకు ఆయనేసాటి లేదిక లోకంలో ఆయనకు పోటీ!

భవ భూతి వైభవము
-----------------------------------
చం: " సరసతఁ గౌగిలింప, గిరిజా కుచపాళి నిజాంగలిప్త భా
-----------------------------------
చం: " సరసతఁ గౌగిలింప, గిరిజా కుచపాళి నిజాంగలిప్త భా
సుర భసితాంతమై కులుకుచు న్ వెలి దామఱమొగ్గ జోడు సుం
దరత వహించుచుండ , మమతం బలుమాఱులును జూచి సొక్కు శం
కరుఁడు ప్రసన్నుఁడై యొసఁగు గావుత, మాకు నభీష్ట సంపదల్;
అనిరుధ్ధ చరిత్రము- అవతారిక- 2వ: పద్యము;
కఠిన పదములకు అర్ధము:- నిజాంగలిప్త- తన శరీరమునందు పూయబడిన; భసితాంతమై- బూతిపూతలతో నిండినదియై;
వెలి- తెల్లని; మమతన్-ప్రేమతో; సొక్కు- పరవ సించు; ప్రసన్నుడై-కరుణగలవాడై ;అభీష్ట సంపదలు-
ఇష్టమైన సంపదలు;
భావము:- శంకరుడు ప్రేమతో పార్వతిని కౌగిలింపగా నతని మేనగల భూతి సోకి గిరిజ కుచ కమలములు తెల్లబడి
పుండరీక ముకుళములై' గనిపింప' పరవశము నందు శంకరుడు ,మాకు ఇష్టార్ధసంపదలొసంగును గాక! యని
భావము.
విశేషములు: పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారి సరస సల్లాపములు సహజమే! ప్రేమతో శంకరుడు పార్వతిని ,
గౌగిట జేర్చెను. అపుడేమైనది? అతని బూడిద యామెకంటినది. అదియు కుచకమలములపైన నంటినది. సహజముగా
కమలములు గులాబిరంగులో నుండును. అవి యితని విభూతి సోకుచే తెల్లబడి పుండరీక ముకుళములైనవి(పుం
డరీకముఅనగా తెల్లని తామఱపూవు) దానిని జూచి శంకరునకు ఆనందము గలిగినది. తనరంగంటినదని;
ఆహా! కవిది యేమిగొప్పయూహ! అందుచే సంతోషముగానున్నాడు. అట్టి శంకరుడు మాకు వరప్రసాది యగుగాక !
యని కవిప్రార్ధన!
భోజుని కాలమున కాళిదాసుతో బాటు భవభూతి యనుమరియొక కవీంద్రుడుండేవాడు. భవభూతి యతని
బిరుద నామము. అతడు గూడ సరిగా నిట్టి ప్రయత్నము నేచేసినాడు
" గిరిజాయాః స్తనౌ వందే 'భవభూతి' శ్శితాననః" అని ,శంకరుని నుతించెను. శంకరుని విభూతి పూతలచే తెల్లబడిన
చూచుకములుగల గిరిజా దేవి వక్షోజములకు నావందనము అని ,దాని యర్ధము. భవభూతి నంత సొగసుగా వర్ణించుట
చే నాటినుండి యతడు భవభూతి యయ్యెనట!
ప్రస్తుత పద్యమునందు కనుపర్తి అబ్బయామాత్యుడు దానికి మరింత వన్నెలు దిద్దినాడు. భూతిపూతల వలన సహజమైన తమ వర్ణమును గోలుపోయి తెలుపు రంగును స్తనములు పులుము కొనుటచే నిందు 'తద్గుణాలంకారము' వర్ణింప బడినది.
జగత్పితరుల శృంగారమును వర్ణించుట యుచితమా? యనుప్రశ్నకు యిక్కడ తావులేదు. అదివారి పరస్పరశృంగారమేదప్ప యన్యముగాదు. కవి దృష్టి పవిత్రమైనది కావున దోషము కాదని విజ్ఙుల యభిప్రాయము.

శబ్దచిత్రణ- సౌందర్యం!
----------------------------------
మ: బిగివుం జన్నులఁ గాంచి మాను నల జంబీరంబు బీరంబు, క్రొం
జిగి మోముంగని, సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు! విం
తగు భ్రూ రేఖలు గాంచి , భీతినిడు కోదండంబు దండంబు! త
జ్జగతీ నాధుని మ్రోలనున్న చెలులం జర్చింపఁగా పాడియే!

అజ్ఙాత కర్తృకము
కవి యెవరోగాని భావుకుడే! శబ్దచిత్రణతో చక్కని పద్యానికి రూపకల్పన చేశాడు.
ప్రతి పాదంలోను అందమైన యతివ సౌందర్యాన్ని వర్ణస్తూ ఒక్కొక అవయవానికి ఒక్కొక విశేషణం ఉపయోగిస్తూ అందులో ప్రథమాక్షరాన్ని లోపింపఁ జేస్తూ కొత్త కొత్త యర్ధాలను ప్రకల్పన చేస్తూ పాఠకులచేత "ఓహో"!యని
పించాడు.
కఠిన పదాలకు అర్ధాలు; జంబీరము-గజనిమ్మపండు; బీరము-బింకము,గర్వము; రాజీవము-పద్మము;జీవము-ప్రాణము,నీరు; కోదండము- ధనస్సు; దండము-వందనము;
ఇక వినండి విషయం. కధానాయిక బిగువైన వక్షోజములను జూచి ,జంబీరములు బీరమును వదలు చున్నవి.
జంబీరమంటే గజనిమ్మ పండని చెప్పుకున్నాంగదా! అవి వక్షోజ సంపదను జూచి తమగర్వాన్ని వదలుతున్నాయి అంటాడుకవి. అంతకన్నా అందంగా ఉన్నాయని కవి భావం.
ఆమె యందమైన ముఖాన్ని జూచి రాజీవము జీవాన్ని విడుచు తున్నది. రాజీవమనగా పద్మము .అది తెల్లబోతోందని కవి భావము. తనకన్నా అందమైన వారు కళ్ళఁబడితే సహజమైన అసూయతో చిన్నబుచ్చుకోవటం మనకు
తెలిసిన విషయమే;
సొగసైన కనుబొమలతీరు చూసి కోదండము దండం పెడుతున్నదట! కోదండ మంటే విల్లు. నాయికల కనుబొమల యందాన్ని వింటితో బోల్చుట కవిసమయము. కాబట్టి వాటి యందం ముందు తమ యందం చాలదని కోదండం దండం పెడుతోన్నదట! యుధ్ధంలో ఓడినవారు గెలిచిన వారికి దండాలుపెడతారుగదా అదేఇది.
కనుక లోకోత్తర సౌందర్య రాసు లయిన యీరాజుగారి చెలికత్తెల యందాన్ని విమర్శించటం
సరి కాదని కవి యంటున్నాడు.

చంద్రోదయంలో - నాట్య ప్రదర్శనం
-----------------------+---------------------------
మ: " హరిదంభోరుహ లోచన ల్గగన రంగాభోగ రంగత్తమో
-----------------------+---------------------------
మ: " హరిదంభోరుహ లోచన ల్గగన రంగాభోగ రంగత్తమో
భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్
వరుసన్ మౌక్తిక పట్టమున్ , నిటలమున్ , వక్త్రంబునుం ,దోఁచె నా
హరిణాంకాకృతి వొల్చె రేకయి, సగంబై , బంబమై ,తూర్పునన్;
వసుచరిత్రము-4 ఆ: 17 వ పద్యం: రామరాజ భూషణుడు!
కఠిన పదముల కర్ధము:- హరిదంభోరుహ లోచనలు- దిక్కులను వనితలు; తమోభరము-చీకటినిండిన; నేపథ్యము- తెఱ;
రాత్రి శైలూషి- రాత్రి యనే నాట్యగత్తె; మౌక్తికపట్టము-ముత్యాల పట్టెడ( శిరోలంకారము) నిటలము- ఫాలభాగము;(నుదురు)
వక్త్రము -ముఖము; హరిణాంకుడు-ఃచంద్రుడు- ఆకృతి- ఆకారము;వొల్చెన్- ఒప్పెను;
అది నిశా ప్రారంభ సమయం. తూర్పున చంద్రుడు మెల్లమెల్లగా ఉదయించు చున్నాడు. ఆదృశ్యం కవికి నాట్యకత్తె యొనర్చే నాట్య ప్రదర్శనా ప్రారంభంలా ఉన్నదీ అంటాడు.
ముందు నాట్యప్రారంభం గురించి తెలిసికొందాం." కూచిపూడి నాట్యారంభం తెఱ ప్రదర్శనంతో మొదలౌతుంది. ఆతెఱను,
అలా యిరువైపులా పట్టుకుని యుండగానే సూత్తధారులు హంగుదారులు ' అంబ పరాకు పాట నందుకుంటూ గట్టిగా పాడుతూ
తెఱను అటు యిటు జరుపుతూ ఉంటారు ఆతెఱవెనుక ప్రధాన పాత్రధారి యుంటాడు.పాటముగిసే సమయానికి కొంచెం కొంచెంగా
తెరను పైనుండి క్రిందికి దించుతూ ఉంటారు. ఆనాట్యంచేసే సుందరి శిరోజములు, తదుపరి నుదురు, ఆపై మొగము నాసిక మొదలగు నంగములు వరుసగా కనిపించును.దీనినే "ఆశిరో పాద దర్శన" మంటారు. చివరకు తెఱ తొలగిస్తారు. అదిగో ఆవిధంగా ఉందీ చంద్రోదయం అనికవి భావన! ఇకముందుకు పదండి!
రాత్రి యనే శైలూషి(నాట్యకత్తె) ఆకాశమనే రంగస్ధలంమీద నాట్యం చేయ నుండగా, దిక్కులనే వనితలు(సహాయకులు) చీకటియనే తెఱను నెమ్మది నెమ్మదిగా క్రిందకు దింపుతూ ఉంటే ఆనాట్యకత్తె శిరోలంకారమైన ముత్యాల పట్టెడ, నుదురు ,మొగము,
క్రమంగా మనకు అగుపడినట్టు, తొలుత రేకగా, ఆపై యర్ధచంద్రునిగా , ఆవెనుక సంపూర్ణ బిబముగా దర్శన మిచ్చుచు, తూర్పున
చంద్రోదయ మగుచున్నది .అని కవిభావము.
మొత్తముమీద చంద్రోదయం నాట్యప్రదర్శనా రంభమువలె చూడ ముచ్చటగా నున్నదని తాత్పర్యం!
చూశారా కవియూహ యెంత అద్భుతమో!
దిక్కులయందు అంగనత్వము,రాత్రియందు శైలూషిత్వము, చీకటి యందు నేపథ్యత్వము, ఆరోపించుటచే
ఇందు 'రూపకాలంకారము ' చెప్పఁబడినది!
స్వస్తి!
LikeShow more reactionవరుసన్ మౌక్తిక పట్టమున్ , నిటలమున్ , వక్త్రంబునుం ,దోఁచె నా