Friday, 31 January 2020


మాతృశ్రీ వందన పుష్పాలు -31

నిండుపున్నమి వెల్గులెన్నో చూశా
చెండు వువ్వుల కాంతులెన్నో చూశా
అమ్మ మాటల్లొ మంచి ఎంతో చూశా
పండువెన్నెల వన్నెలెన్నో చూశా, తెల్లారే వేళలో 

లత వెలుగు తరువులో చూశా
మది మెఱుపు యువతలో చూశా
కళ విలువ యువకలో చూశా  
నది పరుగు కడలిలో చూశా, వర్షపు వేళలో

మలి ముద్దు మనసుయందు చూశా
చలి ముద్దు సెగలు యందు చూశా
గిలి ముద్దు నళిని యందు చూశా
తొలి ముద్దు పెదవియందు చూశా మొదటి రాత్రిలో 

వెలుగు పరిచిన రవి చూశా
కధలు తెలిపిన కవి చూశా
చెలిమి కలిపిన చెలి చూశా
నళిని వలచిన శశి చూశా, అంబరం ఆశలో
--(())--


ఒక సోదరి ఉండాల్సిందే
చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉండాల్సిందే
.
పెద్దదైతే అమ్మానాన్నలనుండి రక్షించేది
చిన్నదైతే వీపు వెనుక నక్కి నక్కి ఉండేది
చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉండాల్సిందే
.
పెద్దదైతే నిశ్శబ్దంగా జేబులో డబ్బులు పెట్టేది
చిన్నదైతే నిశ్శబ్దంగా డబ్బులు తీసేది
చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉండాల్సిందే
.
.చిన్న చిన్న విషయాలకై అలిగేది
చదువుకుంటుంటే టీ తెచ్చి ఇచ్చేది
చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉండాల్సిందే
.
తప్పుచేస్తే చెవి పట్టుకుని చెప్పేది
తప్పు చేస్తే సారీ అన్నా అనేది
చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉండాల్సిందే
.
తనకంటే ఎక్కువగా మనలను ప్రేమించేది
చిన్నదో పెద్దదో ఒక సోదరి ఉండాల్సిందే
.
.
ఆడపిల్లలను రక్షించండి --- దేశాన్ని రక్షించండి —

--(())--

*భారతీయ కోడలు*

👍కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...!!!

👉ఎందుకోతెలుసా...!!!

👉చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!

👉కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!

👉తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!

👉తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!

👉కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!

👉కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!

👉పెళ్లి అయ్యాక ఏడుస్తున్న పెళ్లికూతురిని చూసి ఇప్పుడు నీకెవరు దిక్కు అని ఎవరయినా అడిగితే, చేయి పట్టుకున్న భర్తపేరును కూడా చెప్పక "నా అయ్య" అనకుండా "మా అయ్య..!" అంటూ సమాధానమిస్తుంది. ఇదివిన్న పెళ్ళికొడుకు తండ్రికి మావయ్యా అని పిలిచినట్లనిపించి, ఎవడ్రా నాకోడలిని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు.ఇక అప్పట్నుంచి కోడలిని బిడ్డలా కాపాడతాడు మామయ్య...!!


👉ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...?? కోడలే గృహలక్ష్మి...!!!

శుభం భూయాత్

_*నేటికీ ఆ సాంప్రదాయపు ఛాయల లో ఉన్న ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక నమోవాకాలు*_


🙏🙏🙏🙏

ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో
 ‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా!
ఆమె నాకంటే అందంగా ఉండేదా?’
అని అడిగింది.

ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు
 ‘ప్రభూ,
నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’
అన్నాడు.

పక్కనే ఉన్న సుదర్శనుడు
(సుదర్శన చక్రం)
కూడా.. ‘పరంధామా,
అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.
నాతో సరి తూగు వారెవరు స్వామి’
అన్నది.

ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

 దీర్ఘంగా ఆలోచించి..

 ‘సత్యా, నువ్వు సీతగా మారిపో.
నేను రాముణ్నవు తాను.
గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.
చక్రమా,
నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’
అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.

గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి..
సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు.

హనుమ ఆనందంతో పుల కించిపోతూ..
 ‘నేను నీ వెనుకే వస్తాను.
నువ్వు పద’
అని గరుత్మంతు ని సాగ నంపుతాడు.

ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు.
కానీ..
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతు నికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.

ఇంతలో..
 ‘హనుమా’
అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు.
‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’
అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ
 ‘ప్రభూ,
ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.
ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’
అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు.

ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న  స్ర్తీ
పై పడి
‘స్వామీ,
మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా!
ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.

అలా కృష్ణ
పర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు.

--(())--

*ఏమి నీ కోరిక* ? "
.
*ఒక అద్భుత కధనం*
.
ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు . చాలా ఆకలిగా ఉంది . అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం ?
.
సంత ఈ చివరి నుండి ఆ చివరికి
తిరిగాడు . ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది . దాని క్రింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమె అని .
.
ఆశ్చర్య పోయాడు పేదవాడు . అంత పెద్ద దీపం ఒక్క రూపాయే ఏమిటి అని ? దగ్గరకు వెళ్లి చూశాడు .
.
. అది అల్లాఉద్దీన్ అద్భుత దీపం లా ఉంది . సుమారు ఒక కిలో బరువు ఉంటుంది . అయినా ఒక్క రూపాయేనా ?
.
అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా ! అదీ అతడి ఆలోచన .
.
షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు . ఎందుకు అథ తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని .

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం . ఇందులో భూతం ఉంది . అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది . అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది . అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది . ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి . లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది . అదీ దాని కధ "
.
పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు . ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని రుద్దాడు . భూతం ప్రత్యక్షం అయ్యింది . " ఏమి నీ కోరిక ? " అడిగింది .
.
. తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు . క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది . భోజనం కాగానే
.
" ఏమి నీ కోరిక ? " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు . వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది . నిద్రపోతూండగా
.
" ఏమి నీ కోరిక ? " అడిగింది
.
ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు .
వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది .
.
" ఏమి నీ కోరిక ? " అడిగింది
.

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు . కోరికలు అడుగుతూనే ఉన్నాడు . అవి తీరుతూనే ఉన్నాయి . అతడికి విసుగు వచ్చేస్తోంది .
.
ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది . భూతం తో పాటు సంపదలూ పోతాయి . ఎలా ?
.
పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు . ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు .
.
తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి " ఏమి నీ కోరిక ? " అడిగింది
.
భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు . వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం . అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు . పాతేసి " ఏమి నీ కోరిక ? " అడిగింది .
.
ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు . నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని అది అని చెప్పాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది .
.
అతను తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు . తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు . తన సౌఖ్యం , తన ఇరుగు పొరుగు సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు .
.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు . భూతం స్థంభం ప్రక్కన నిద్రపోతోంది .
.

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు .
.
ఇక్కడితో కధ కాలేదు .
.
.ఈ కధ మనది. మనందరిది.
.
ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?
.

మన మనసే ఆ భూతం . అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది . ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని
.
సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్థంభం " మంత్రం " --- ఎక్కడం దిగడం మంత్రం జపం . జప సాధన !
.
. అను నిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది .
.
అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది . మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది .

.
అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి , మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము . ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం ! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం!
.

మిత్రులారా !
.
మనం మనసు మాత్రమె కాదు . అతకన్నా ఎక్కువ . మనం అవినాశి అయిన ఆత్మలం .
.
మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం .చెయ్యలెము .
.
మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది . అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం .
.
మన మనసు మనకు ఆలోచననూ , విచక్షణనూ , కోరికలనూ , అవగాహననూ , విమర్శనాత్మక దృష్టినీ , న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ , ఎన్నింటినో ఇచ్చింది . దీనివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం !
. మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం . ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు . మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది

. ద్యానమూ , మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది . దాని నియంత్రణలో ఉంచుకోలేక

పోతే అది మనలని నాశనమూ చెయ్యగలదు.


ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు . ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు .
.
మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం . జీవిత లక్ష్యాలను సాధించగలం . దాని మానాన దానిని వదిలేస్తే
( శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ , పగ , ప్రతీకారం , కామం , క్రోధం , గర్వం , అహంభావం , --- ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది .


మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి . అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి .
ఇక నిర్ణయం మీదే సుమా !
మైక్రోసాఫ్ట్‌లో స్వీపర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ముగించుకున్న సుబ్బారావుతో -

''మీ పనైపోయింది. మీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇమెయిల్ లో పంపిస్తాం'' అన్నారు హెచ్.ఆర్.

'అయ్యో నాకు ఇమెయిల్ లేదే?'

'ఏంటీ, ఇమెయిల్ లేదా? మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోసం వచ్చి.. ఇమెయిల్ లేదా... అయితే మీకు నో ఉద్యోగం. యు కెన్ గో నౌ'

దిగాలుపడ్డ సుబ్బారావు... బయటకి నడిచాడు.

ఆకలి దంచేస్తోంది. జేబులో ఉన్న ఒకే ఒక్క రూపాయితో మరమరాలు కొన్నాడు. సగం తిన్నాడు. మిగతా సగం స్కూలు పిల్లలకు అమ్మాడు.

అయిదు రూపాయలు లాభం వచ్చింది. వ్యాపారం రుచి తెలిసి ఆ అయిదును పది... యిరవై... వంద... వెయ్యి... లక్ష... కోట్లు చేశాడు అయిదేళ్ళలో.

ఇపుడతను కోటీశ్వరుడు. భారతదేశం అంతా మరమరాలు సప్లై చేసే వ్యాపారి.

వందల కొద్ది స్వంత లారీలు ఉన్నాయి. ఉన్నట్టుండి యివన్నీ తగలబడిపొతే?

అమ్మో... అనుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్ ని పిలిచాడు.

'పేపర్లన్నీ రెడీ చేసి ఇమెయిల్ చేస్తా, మీ ఐడీ యివ్వండి' అన్నాడు ఏజెంట్.

'అయ్యో నాకు ఇమెయిల్ లేదే?' అన్నాడు సుబ్బారావు

'ఏంటీ, ఇమెయిల్ లేదా? ఇమెయిల్ లేకుండానే ఇంత బిజినెస్ మాగ్నెట్ అయ్యారు అయిదేళ్ళలో. ఇమెయిల్ వుండివుంటే యిప్పటికి ఏమై వుండేవారో తెలుసా?' అడిగాడు ఏజెంట్.

మైక్రోసాఫ్ట్ లో అయిదేళ్ళ సీనియర్ స్వీపర్ గా ఉండి ఉండేవాడిని అన్నాడు సుబ్బారావు ! :D

ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే....

నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలు పడ్డ తన వేళ్ళతో రోజులు లెక్క పెట్టు కుంటున్నాడు  ఆ పెద్దాయన. చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాత బడి పోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది. కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.

4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకోడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.
'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.

దారి మధ్యలో ఇలా అంది. 'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'

పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.

అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.
కూతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...
' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'
'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.
అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...
'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకో లేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం. ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసు కోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది. 

కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...
'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా! మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ ఋణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం...పెద్దవారు పసిపిల్లలతో సమానం..
వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!
పెద్దవారు మనకు మార్గదర్శనం....

--((*))--


శ్రీ రంగని మహాత్యం 

శ్రీరామానుజచార్యుల వారి కాలంలో జరిగిన సంఘటన :

శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు భక్తులు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టు పట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి, అతనికి వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కిపోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆ పేద వైష్ణవుడు వాదించేవాడు.

ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు.

స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయడములోనే నాకు సమయం సరిపోతుంది. వీరిని వదిలేసి నేను ఆలయంలో ఏ కైంకర్యం చేయలేను అని బదులిచ్చాడు ఆ పేద వైష్ణవుడు. పైగా నేను వేదాలను గాని, దివ్య ప్రబంధములను గాని నేర్చుకోలేదు, అందువల్ల నేను ఆలయ సేవ కాలములలో కూడా ఏ కైంకర్యం చేయలేను. నాకు కొన్ని విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు తప్ప ఏమి రావు, నేనేమి చేయగలను అన్నాడు.

సరే నీకు తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకాలని చెప్పమని రామానుజుల వారు అడుగగా, ఎంతో ఇబ్బందిగా "విశ్వం విషు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు:, భూత కృత్ భూత భృత్.." నాకంత వరకే వచ్చు అని చెప్పాడా వైష్ణవుడు. సరే నీకు భూత భృత్ అనే భగవన్నామము తెలుసు కదా, ఆ నామాన్నే జపించు, ఇక నీకు ఇక్కడికి ఆహారం కొరకు రావలసిన అవసరం ఉండదు అని సెలవిచ్చారు రామానుజులు.

ఆ నాటి నుండి ఆ వైష్ణవుడు మరల ఆలయంలో ప్రసాదం పెట్టే ప్రాంతంలో కనిపించలేదు. ప్రసాదపు వరుసలలో గొడవలు ఆగిపోయాయి. అయితే ఇంకో విచిత్రమైన సమస్య మొదలయింది. రోజూ రంగనాథులకు సమర్పిస్తున్న ప్రసాదంలో చాల భాగం మాయమైపోతుంది. ప్రసాదం దొంగల బారి పడుతుందేమో అని భద్రత పెంచారు కూడా. అయినా సమర్పించిన దానిలో చాల ప్రసాదం మాయమైపోతుంది. ఆ పేద బ్రాహ్మణుడే దొంగిలిస్తున్నాడేమో అని అనుమానం అందరిదీ. చివరకి రామానుజులకి తెలియ చేసారు ఈ సమస్యని. ఆ పేద బ్రాహ్మణుణ్ణి పిలుచుకురమ్మని రామానుజుల వారు మనుషులని పంపగా, ఆయన తన పాత నివాసంలో ఉండటం లేదని తెలిసింది. ఆ వైష్ణవుడు ఎక్కడ ఉంటున్నాడో ఎవరికీ తెలియలేదు.

కొంతకాలం తర్వాత, రామానుజులు ఏదో కార్యక్రమానికై కొల్లిడం నది (శ్రీరంగం దగ్గర కావేరి పాయ) దాటుతుండగా ఆ పేద వైష్ణవుడు "స్వామి స్వామి" అని రామానుజులని బిగ్గరగా పిలుస్తూ వారిని సమీపించారు. రామానుజుల పాదాలకు సాష్టాంగం చేసి, ఆయన కనుల నుండి ధారగా కన్నీరు రాసాగింది.. "స్వామీ, మీ కటాక్షం వలన ఆ పిల్లవాడు రోజూ నాకు ప్రసాదం అందచేస్తున్నాడు. అందువల్ల నా పిల్లలు ఆ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇక ఆలయ అధికారులతో గొడవలు ఎందుకని కోవెల దగ్గర గృహం నుండి నేను ఇక్కడికి వచ్చేసాను. నేను మీకు సదా కృతజ్ఞుడను. మీరు చెప్పిన విధంగా రోజూ నేను "భూతభృతే నమః" జపాన్ని చేస్తున్నాను" అన్నాడు.

ఈ మాటలు విన్న రామానుజులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎవరా పిల్లవాడు? వాని పేరేమి అని అడుగగా, ఆ పిల్లవాడు తాను రామానుజ దాసుడనని చెప్పాడని చెప్పాడా వైష్ణవుడు. ఇంతకీ ఆ బాలుడు ఇంకెవ్వరు, సాక్షాత్ ఆ "శ్రీరంగనాథుడే"

"భూత భృత్" నామానికి అర్థం "సమస్త జీవులని పోషించువాడు" అని అర్థం.
(సేకరణ...)

"భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం
ఓం శ్రీ రామ్ 

--((***))--

తెలుగు 52 అక్షరాలను 'అ నుంచి ఱ' వఱకు ఆయా అక్షరాలతో ప్రారంభమయ్యే చిన్న వాక్యాలతో చిన్న పిల్లల చేష్టలను వర్ణిస్తూ, ఒక సరదా సంఘటనను సృష్టించుకొని, ఒక చిన్న కథగా చెప్పినారు ఎవరో కవి.

        (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు
        (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,
        (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే
        (ఈ)లల గోలల మోతలతో,
        (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో
        (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.
        (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక
        (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,
        (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల
        (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,
        (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా
        (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,
        (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,
        (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా
        (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా
        (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

        (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా
        (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,
        (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన
        (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను
        (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

        (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత
        (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని,
        (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి
        (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి
        (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు.

        (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు
        (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,
        (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు
        (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,
        (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

        (త)లుపులు తోసేసుకుంటూ,
        (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,
        (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ
        (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో
        (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

        (ప)రుగు పరుగున కొందరు,
        (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు,
        (బ)యటకు పూర్తిగా వచ్చేసి,
        (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,
        (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

        (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,
        (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,
        (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,
        (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే
        (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,
        (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,
        (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో
        (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-
        (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ
        (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-
        (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది
అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.

చదివినందులకు ధన్యవాదములు 🙏

--(())--

విటమిన్లు అవి లభించు ఆహారపదార్థాలు  - తగ్గుట వలన కలుగు సమస్యలు  : -

        మానవశరీరానికి రసాయనికంగా మరికొన్ని ద్రవ్యాలు అవసరం. వీటికే విటమిన్ అని పేరు పెట్టారు. ఇవన్నియు జీవకణములే . ఇప్పటివరకు శరీరశాస్త్రముకు సంభందించినంత వరకు ఆరు రకాల విటమిన్స్ కనిపెట్టారు.   అవి

    A , B , C , D , E , K .

 " A "  విటమిన్ -

             "A " విటమిన్ ముఖ్యంగా కంటిచూపుకు సంభందించినది. శరీరంలో A విటమిన్ తగ్గిన కంటిదృష్టి తగ్గును. ఆవుపాలు ఇంకా వెన్న , నెయ్యి, ఆకుకూరలు ముఖ్యంగా మునగ , బచ్చలి, తొటకూర వర్గానికి  చెందిన ముల్లంగి, పుదినా ఆకు, కొత్తిమీర వీటి యందు "A " విటమిన్ ఉంటుంది. మామిడి పండు, బొప్పాయి, మంచిగుమ్మడి , క్యాబేజిల యందు కూడా "A " విటమిన్ ఉంటుంది.

*  " B " విటమిన్  -

             " B "  దీనిలో కొన్ని ఉప విటమిన్లు కలిపి ఒక సమూహంగా ఉన్నవి.  ఈ విటమిన్ సక్రమంగా ఉండటం వలన రక్తం మంచి స్థితిలో ఉండును. ఈ విటమిన్ లోపించడం వలన రక్తంలో బలం తగ్గి " మేహనంజు " అను వ్యాధి సంప్రాప్తినిచ్చును . దీనిని ఆంగ్లమున బెరిబెరి వ్యాధి అని పిలుస్తారు . ఆకలి ఉండదు. కాళ్లల్లో చేతుల్లో తిమ్మిర్లు  , రక్తప్రవాహం మందగించి ఉండటం , గుండె బలహీనం అవ్వడం , ఎగశ్వాస వంటివి సంప్రాప్తి అగును.ఇది ఎక్కువుగా బియ్యపు తవుడు, , గోధుమలు , కాయధాన్యాలలో ఉంటుంది.

                ఈ " B " విటమిన్ సమూహంలో చేరిన మిగతా విటమిన్లు వరసగా రిబోఫ్లోవిన్ థయామిన్, కోటినిక్ ఆసిడ్ , ఫాంటో తెనిక్ ఆసిడ్ , ఫాలిక్ ఆసిడ్, బోరిన్ వంటివి ఉన్నాయి. శరీర అభివృద్ధికి ఇవి కొద్ది మోతాదులో అవసరం. ఇవి పాల వర్గంలో , మెట్ట ధాన్యాల యందు శించి ధాన్యాల యందు బాదం , అక్రోటు, కొబ్బరి, వెలగ , జీడిపప్పుల్లో ఉంటుంది.

              మన ఆహారంలో ఇవి లోపించిన విషయం కంటిరెప్పలు , పెదవులు , చర్మం పగుళ్లు రావటం వంటి లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చును. ఆహారంలో కోటిన్ ఆసిడ్ చాలక పోయినచో నొటిపూత వంటివి కలుగును. ఫాలిక్ ఆసిడ్ శరీరంలో ఉండు జీవకణములను పోషించి బలపరుస్తుంది. ఈ జీవకణములు నిరంతరం కొన్ని నశించిపోతూ కొన్ని ఉత్పత్తి అగుచుండును. ఫాలిక్ ఆసిడ్ ఈ జీవకణముల బలపరుస్తూ జీర్ణకోశంలో ఆహారమునకు జరుగుచుండు పరిణామాలు కు సహాయపడును . దీనిలోపం వలన రక్తం క్షీణించి పాండురోగం వచ్చును.

    " C "  విటమిన్  -

              ఈ " C " విటమిన్ ఆకుకూరల యందు పప్పు దినుసుల యందు ఉంటున్నది.  C విటమిన్ చేయు ముఖ్యమైన పని నోటి యందలి దంతాలు , శరీరం నందలి ఎముకలు మన ఆహారం లో వీటిపోషణకు , అభివృద్దికి అవసరం అయిన సున్నం , ఇనుము వంటి వాటిని విడదీసి వాటిని దంతములకు , ఎముకలకు అనువుగా మార్చి  వాటికి సరఫరా చేయును . ఈ కార్యక్రమం సరిగ్గా జరగనిచో మనుష్యులు మరుగుజ్జులు కావడం , కాళ్ల యందలి చేతుల యందలి ఎముకలు క్రమం దప్పి వంకరగాను , వికారంగాను అంగవైకల్యం ఏర్పడును . ఉశిరికాయలో ఈ C విటమిన్ విశేషంగా ఉండును. ఈ ఉశిరికలో మరొక్క విశేషం ఉంది . అది ఏమనగా మిగతా ద్రవ్యములలో ఎండినచో ఈ విటమిన్ నశించినట్లు ఉశిరకాయలో నశించిపోదు.

" D " విటమిన్  -

          ఈ D విటమిన్ విశేషంగా మనము సేవించు పాలు , వెన్న , నెయ్యి వీటిలో ఉంటుంది. దీని పనికూడా C విటమిన్ విధంగానే ఉంటుంది. మన పేగుల్లో ఉండు ఆహారపదార్థాల్లోని క్షారమును వేరుపరిచి దానిని ఎముకల యందు చేర్చుట. ఈ విటమిన్ ఎముకలకు చాలా ముఖ్యమయినది. ఈ D విటమిన్ ఆహారపదార్థాల్లోనే కాకుండా సూర్యరశ్మిలోను దొరుకుతుంది .

                 మనుష్యుడికి ఉదయపు ఎండలో తిరగడం వలన శరీరానికి కావలసిన D విటమిన్ పుష్కలంగా దొరకును.  వ్యవసాయ పనులు చేసేవారికి ఈ విటమిన్ పుష్కలంగా దొరకును.

" K " విటమిన్  -

            మనం భుజించు ఆహారములలో అనగా ఆకుకూరలు , క్యాబేజి , క్యారెట్లు ఇత్యాదుల యందు K విటమిన్ ఆకారం అయిన కెరోటిన్ ఉంటుంది. ఈ కెరొటిన్ మనశరీరంలో ఉత్పత్తి అగుచున్న ప్రాణవాయువు వలన భస్మీపటలం అగుచున్నది. అట్లు జరిగిన పక్షంలో దానివల్ల శరీరానికి ఎటువంటి ఉపకారం ఉండదు.  అలాంటి సమస్యని నివారించుటకు   e విటమిన్ కు కలదు.

               ఈ K విటమిన్ కు రక్తం గడ్డకట్టే గుణం కలదు. ఈ విటమిన్ శరీరంలొ సరైన మోతాదులో ఉన్నంతవరకు దేహంకు ఎట్టి గాయాలు అయినను రక్తస్రావం శీఘ్రంగా నిలిచిపోవును . కాయకూరలు , ఆకుకూరలు వీటియందు ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును.

                  కావున మనం తీసుకునే ఆహారములో అన్ని రకాల పదార్థాలు సమపాళ్లలో తీసుకున్నప్పుడే మనశరీరం మంచి ఆరోగ్యంతో ఉంటుంది.

--((***))--