Sunday, 9 July 2017

****శ్రీ నరసింహ శతకము***


శ్రీ నరసింహ శతకమునుండి - శేషప్ప కవి ప్ర ణితము --- 
నరసింహా! నాకు దుర్ణయములే మెండాయే సుగుణ మొక్కటిలేదు జూడ బోవ; --- 
నన్యకామ్తల మీద నాశమానగలేను, ఒరుల క్షేమము జూచి యోర్వలేను, ---- 
ఇటువంటి దుర్భుద్ది లిన్నీ ణా కున్నవి, నేను జేసేదివాన్ని నీచకృతులు; ---- 
నావంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్టజేసితి వేల? భోగిశయన ! ------- 

అబ్జదళ నేత్ర! నాతండ్రివై ఫలము -- నేరములు కాచి రక్షించు నీవే దిక్కు; భూ -------

 భావము ------ 

ఓ పద్మరేకులవంటి కన్నులుగాలవాడా! నరసింహా! చూడగా నాలో దుర్గుణము లే ఏక్కువగానున్న వికాని సద్గుణ మొక్కటియైన కానరాదు. పరస్త్రీ వ్యామోహము వదలలేదు. యితరుల ఔన్నత్యమును చూచి సహించలేను. యిటువంటి చేడుబుద్దులెన్నో యున్నవి నాలో. నేను చేసే పనులన్నియు తుచ్చాములే. ఇలాంటి నన్ను ఈ భూమిపై ఎందుకు పుట్టించి తివయ్యా! ఓ శేషశయనా! నీవే ణా తండ్రివి. నీవే నాకు దిక్కు. నీ పుత్రుని తప్పులుసైచి కావుము తండ్రి!

శ్రీ నరసింహ శతకమునుండి- శేషప్పకవి ప్ర ణితము ---- 
ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధన మెప్పటికి శాశ్వతంబు గాదు, 
--- దారసుతాదులు తన వెంట రాలేరు, బృత్యులు మృతిని దప్పిమ్పలేరు, 
--- బంధుజాలము తన్ను బ్రతికిం చుకోనలేదు, బలపరాక్రమ మేమి పనికిరాదు, 
--- ఘనమైన సకల భాగ్యం బెంట గల్గియు గోచిమాత్రం బైన గొంచు బోడు, 
--- -- వెఱ్ఱికుక్కలా భ్రమలన్ని విడిచి నిన్ను 
---- భజన జేసెడివారికి బరమ సుఖము ; భూ -------

భావము ------- 

ఓ జగన్నాధా! మరమాత్మా! నరసింహా! ఈ అశాశ్వతమైన శరీరము వేయేండ్లు భూమిపై నిల్వజాలడు. ధనమేన్నతికి స్థిరముగా దు. భార్యాబిడ్డలు తనవెంట రారు. భ్రుత్యులు మృత్యువును తప్పించలేరు. బంధువులు బతికిమ్చాలేరు. బలపరాక్రమములు పనికిరావు గొప్ప సంపదకల్గియున్నాను ఇసుమంతైనా వేమ్తగోనిపోడు. వెఱ్ఱి కుక్కలవంటి అనగా పనికిమాలిన తలంపులు మాని నిన్నే మనః స్పూర్తిగా భాజించెడు వారికి ఇహపరసౌఖ్యము లిచ్చి కాపాదేదాతావు నీవే గదా!

శ్రీ నరసింహ శతకమునుండి - శేషప్పకవి ప్ర ణితము 
---- భువన రక్షక నిన్ను బోగడ గనేరని నోరు ప్రజా కగోచరమైన పాడుబొంద;
 -- సురవరార్చిత! నిన్ను జూడ గోరాణి కనుల్ జలములోపల నెల్లి సరాపుగుండ్లు ;
 --- శ్రీరమాధిప! నీకు సేవజేయని మేను కూలి కమ్ముడువోని కొలిమి తిత్తి;
 --- నేడ్కతో నీ కధల్ వినని కర్ణములైన గతిన శిలాదుల గలుగు తొలులు;
--- పద్మలోచన! నీ మిద భక్తిలేని -- మానవుడు రెండు పాదాల మహిషమయ్య! భూ.
 ----- భావము 
 
-------- ఓ నరసింహ స్వామీ! లోకరక్షకా! నిన్ను స్తుతించని నోరు పాడు బావివంటిది. ఓ సర్వార్చితా! నిన్ను చుదగోరని కనులు నీటి బుడగలు వంటివి. ఓ లక్ష్మీపతి నిన్ను సేవిచని శరీరము నిష్ప్రయోజనమైన తోలుతిత్తి వంటిది. నీ కధలు వినాలని ఉవ్వి ళ్ళు రని చెవులు కటి నశిలల మధ్యనుండే రంధ్రముల వంటివి! ఓ కమలాక్షా! నీ మిద భక్తిలేని మానవుడు రెండుపాదాల దున్నపోతువంటివాడే.

శ్రీ నరసింహ శతకమునుండి - శేషప్ప కవి ప్ర ణితము
 ---- అవనిలోగా యాత్ర లన్ని చేయగవచ్చు, ముఖ్యుడై నదులందు మునుగవచ్చు,
 --- ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వగవచ్చు, దిన్నగా జపమాల ద్రిప్పవచ్చు,
 ---- వేదాల కర్ధంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్టయాగాములెల్ల జేయగవచ్చు,
---- ధనము లక్షలుకోట్లు దానమియగావచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు,
 ----- జిత్త మన్యస్తలంబున జేరకుండ --- నీ పదాంభోజములయందు నిలుపరాదు! భూ 

------ భావము -------
 ఓ నరసింహ స్వామీ! భూమియంద లి తీ ర్ధయాత్రలన్నియు చేయ వచ్చును. ముఖ్యనదులలో మునగావచ్చు. ముక్కు మూసుకొని, సంధ్యావందనం చేయవచ్చు. జపమాలతో జాగ్రత్తగా జపించ వచ్చు. వేదాల కర్దము విడమర్చి చెప్పవచ్చు. గొప్పవైన యజ్ఞములను చేయవచ్చు. విరివిగా దానములు చేయవచ్చు. నియమనిష్టలతో ఆచారవ్యవహాములు నాచరించ వచ్చు. కాని దేవదేవా! ఏకాగ్రతతో నీ పాదపద్మములను కొలుచుట సాధ్యము కాకున్నది తండ్రీ!

శ్రీ నరసింహ శతకమునుండి -శేషప్ప కవి ప్ర ణితము
 ---- భుజబలంబున బెద్ద పులుల జంపగవచ్చు, పాముకంతము జేట బట్టవచ్చు,
-- బ్రహ్మరాక్షస కోట్ల బారద్రోలగ వచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు,
 -- జిహ్వ కిష్టముగాని చేదు మ్రిం గంగ వచ్చు, బాధను ఖడ్గము చేత నదుమవచ్చు,
-- గష్టమొం దుచు మోడల కంపలో జోరవచ్చు, దిట్టుపోతుల నోళ్ళ కట్టవచ్చు, 
----- బుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ దెలిపి 
--- సజ్జనుల జేయలేదేమ్త చతురుడైన; భూ 

------ భావము ----
 ఓ నరసింహా! భుజబలముతో పెద్దపులులను జమ్పవచ్చు, పాముకంతాన్ని చేతితో పట్టుకోవచ్చును, బ్రహ్మరాక్షసులను పారద్రోలవచ్చు, మనిషి రోగములను మాన్పవచ్చు, ప్రియములేని చెడును మ్రిం గవచ్చు. పదునైన కత్తిని చేత్తో నడిమిపట్టవచ్చు. కష్టమైననూ ముండ్ల కంపలో దూకవచ్చు, చేడువాగుడు కాయల నోళ్ళు నరికట్టవచ్చు, కాని ఈ భూమియందు దైవోపధేశముచే దుర్జనులను సజ్జనుల చేయుట ఎంతటి సంర్దునకైన నూ నలవికాదుగదా.

శ్రీ నరసింహ శతకమునుండి- శేషప్ప కవి ప్ర ణితము 
--- ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి, నరుడు 
-- సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు ;
 -- తుదకు హాలుని యుద్ద దూత లిద్దరువచ్చి గుంజుక చని వారు గ్రుద్దుచుండ ,
--- హింస కోర్వగాలేక యేడ్చి గంతులువేసి దిక్కు లేదని నాల్గు దిశలు చూడ,
---- దన్ను విడిపింప వచ్చెడి ధన్యుదేవాడు? 
---- ముందే నీదాసుడై యున్న ముక్తిగలుగ; భూ 

------ భావము 
---- ఓ స్వామీ! నరసింహస్వా మీ ! భూమిపైన నూకలు న్నంతవరకు మనిషి మాయా సంసారమునకలవాటు పడి ఎన్ని పాపాలనైనా చేయును గాని నిన్ను చేరే సూక్షపు ఆలోచన చేయడుగదా! చివరకు ఇద్దరు యమభటులు వచ్చి యీడ్చుకొనిపోయి హింసిస్తుం టే సాహిమ్పజాలక తన్ను రక్షించే ఉత్తముదేవ్వదోయని నలుదిక్కులు జూచును గాని ముందుగానే నీయందు భక్తి విశ్వాసముంచి ముక్తి నొం దడుగదా!

రీ నరసింహ శతకమునుండి - శేషప్ప కవి ప్ర ణితము --- గౌతమీస్నానాన గడతేరుడా మ టన్న మొనసి చన్నీళ్ళలో మునగాలెను; --దిర్ధయాత్రలచే గృతా ర్దుదౌడ మ టన్న బడలి నేమంబు లే నడపలేను ; ----దానధర్మముల సద్గతిని జెందుదమన్న ఘనముగా నాయోడ్డ ధనములేదు ; --- తపమాచరించ సార్ధకము నొండు దమన్న నిమిషమైన మనస్సా నిలపలెను. ---- కష్టములకోర్వ నాచేతగాడు; నిన్ను ---- స్మరణ జేసెడ ణా యధాశక్తి కొలది ; భూ --------- భావము ------ఓ నరసింహస్వామి! గోదావరిలో స్నానమాడి పునితుదనౌదామన్న తెగించి ఆ చన్నీళ్ళలో మునుగలేను. తీర్ధ యాత్రలు చేసి క్రుతార్ధుదనౌదమన్న నియమాలనే పాతిమ్చాలెను. దానధర్మాలచే సద్గతిని పోమ్డుదామన్న ఎక్కువైన ధనము ణా వద్ద లేదు. తపస్సులు చేసి ముక్తిపోమ్డుదామన్న ఒక్క నిముషము గూడ మనస్సు నిల్పలెను. కష్టములు భరించే శక్తి ణా యోద్దలేదు. దేవా! నాశక్తి కొలది నిన్ను స్మరింతును .

శ్రీ నరసింహ శతకమునుండి - శేషప్ప కవి ప్ర ణితము ---- కోతికి జలతారు కుళ్ళాయి యేటికి? విరజాజిపుడండ విధవకేల ? --- ముక్కిడి తొత్తుకు నత్తేల? యద్దమేమితికి జాత్యంధునకును? --- మాచకమ్మకు నెల మౌక్తికహారముల్? క్రురచిట్టునకు సద్గోష్టులేల ? -- రంకుబోతుకు నెల రమ్యంపు నిష్ఠలు? వావి యేటికి దుష్టవర్తనునకు?-- మాటనిలకడ సుంకరి మోటు కేల? --- చెవిటివానికి సత్యాధా శ్రవణ మేల? భూ ----- భావము ----- ఓ నరసింహా! కోతులకెందుకు జరిటోపి? విధవాస్త్రిలకు మల్లే,సన్నజాజుల పూలమాలలెందుకు? ముక్కులేని ముండకు ముక్కు పోగులేమ్దుకు? పుట్టు గుడ్డివానికి అద్దమెందుకు ? కాపురానికి పనికిరాని ఆడడానికి ముత్యాల హారా లెందుకు ? దుష్టబుద్దు లకు సద్గోష్టులు ఎందుకు? వేశ్యల కెందుకు దాంభిక నియమాలు? దుష్ప్రవర్తులకు వావి వరసలెందుకు? లంచగొండి కెందుకు మాతనిలకడలు, చెవిటివాని కెందుకు సత్కదా శ్రవణము లు, ఇవన్నియు అవసరములేదు, వ్యర్ధముల నియర్ధము.

శ్రీ నరసింహ శతకమునుండి శేషప్ప కవి ప్ర ణితము ---- గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు? మర్కటంబున కే ల మలయజంబు? --- శార్దులమునకేల శర్కరాపూపంబు? సూ కారంబున కేల చూ తఫలము? --- మార్జాలమునకేల మల్లెపువ్వులబంతి? గుడ్లగుబకేల కుండలములు? ---- మహిశంబుకేల నిర్మలమైన వస్త్రముల్ ? బకాసంతతికేల నెల పంజరంబు? --- ద్రోహచిం తన జేసేది దుర్జనులకు --- మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ ------ భావము ------ఓ నారసింహా! గాడిదకు కస్తూరి బొట్టు, కోతికి గంధము , బేబ్బులికి చక్కెరతో చేసిన పిండివంట, పందికి మామిడిపండు, పిల్లికి మల్లేమాలలు, గుడ్లగుబకు చేవులపోగులు, దున్నపోతునకు పరిశుబ్రమైన వస్త్రాలు, కోగాలకు పంజరము ఇట్లు సరిపదవో అటులనే దుర్మార్గ ప్రవృత్తులకు మధురమైన నీ దివ్యనామామ్రుతము రుచిం చదు.

శ్రీ నరసింహశతకము నుండి శేషప్ప కవి ప్ర ణితము ----శ్రవణ రంద్రముల నీ సత్కధల్ పొగడంగ లేశ మానందంబు లేనివాడు -- పుణ్యవంతులు నిన్ను బూజసేయగా జూచి భావమం దుత్సాహ పడనివాడు -- భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ దత్పరత్వములేక తోలగువాడు -- తనచిత్తమండు నీ ధ్యాన మేన్నడులేక కాలమంతయు వృధా గడుపువాడు -- వసుధలోనెల్ల వ్యర్ధుండు వాడే యగును; మఱియు జెడుగాక యెప్పుడు మమత నొంది; భూ .--------- భావము ------- ఓ శ్రీహరి! నరసింహా! నీ ఉత్తమ కధలు వర్ణింప చెవులారా విని ఆనందిం చనివాడు నూ, పుణ్యాత్ములు నిన్ను పూజింపగా మనస్సు నమ్డుత్సాహపదనివాడు నూ భాక్తాగ్రసరులు నీ ప్రభావము లను ప్రస్తుతిం చ , భాక్తితత్పరతను బొమ్దనివాడును . మనస్సు నీ యందుం చక కాలయాపన చేయువాడును పనికిమాలిన దుర్మార్గుదగును, అట్టి వాడేల్లప్పు డు మోహాంధకార ములో పడి నశించిపో తాడు.

శ్రీ నరసింహ శతకమునుండి -- శేషప్ప కవి ప్ర ణితము --- ఆదినారాయణా యనుచు నాలుక తోడ బలుక నేర్చినవారి పాదములకు -- సాష్టాంగముగ నమస్కార మర్పణ జేసి ప్రస్తుతిం చే దనయ్య బహువిధముల -- ధరణిలో నరులెంత దండివారలైనను నిన్ను గానని వారి నే స్మరింప; -- మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుం దేదివారి చెంత జేరగబోను శేషశయన! -- పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల -- దాసులకు దాసుదనుజు మీ ధాత్రిలోన; భూ ----- భావము ----ఓ ఆదినారాయణా! నరసింహా! తోలిదేవుడవు. నీవే యనినేవరు నిన్ను పూజింతు రో వారి పాదములకు సాష్టాంగ నమస్కారమోనరిం తును. ప్రశంసిం తును. నిన్నేరుం గాని వారెంత గోప్పవారైనాను ఈ భోలోకాధిపతి యైనను వారిని నేను తలతును. ఓ శేషశయనా! గొప్పవారమని స్వార్ధ బుద్దితో, కిర్తికండు టితో నున్నవారిని దరిజేరనివ్వను. ఈ భూమిపై మిక్కిలి శాంత స్వభావుడైన నీ భక్త శ్రేష్టులను భక్తితో సేవిం చెదను.

శ్రీ నరసింహ శతకమునుండి-శేషప్ప కవి ప్రణితము ---- చిత్తశుద్దిగ నీకు సేవ జేసెడ గాని, పుడమిలో జనుల మెప్పులకు గాదు;--- జన్మపావనతకై స్మరణ జేసెడ గాని, సరివారిలో బ్రతిష్టలకుగాడు ; --- ముక్తికోసము నేను మ్రోక్కివేదేదగాని, దండి భాగ్యము నిమిత్తంబుగాదు; --- నిన్నుబోగడ విద్య నేర్చితినేకాని, కుక్షినిమ్దేదు కుతి కొఱకు గాదు ; --- పారమార్ధికమునకు నే బాతుపదితి --- గిర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ! భూ . ----- భావము ---- ఓ దుష్టసంహారా! నరశింహా! మనః స్పూర్తిగా నిన్నే సేవింతు గాని దుష్టజనుల మేప్పునకు కాదు. నాజ్మ సాఫల్యటకై నిన్నే స్మరింతును గాని నాసాతివారిలో అనవసర గోప్పతనమునాకుగాడు. ముక్తికోసమే నిన్ను మ్రొక్కి వేడుకుంటున్నాను గాని అనిత్యమైన భోగాభాగ్యాదుల కొరకుగా దు. నిన్ను ప్రస్తుతిమ్చుతకే విద్యనేర్చితినిగాని నశ్వరమైన శరీరము కొఱకు గాదు. ముక్స్తి కొఱకు నే పాతుపడుతున్నాను గాని కీర్తి కొఱకు గాదు. ఓ నిలమేఘశ్యామా! కీర్తిని కోరుతలేదు. ముక్తిని మాత్రమే ప్రసాదించ మని వేడుకొంటు న్నాను.

శ్రీ నరసింహ శతకమునుండి --శేషప్ప కవి ప్ర ణితము --- ఐశ్వర్యము లకు ని న్నను సారింప గలేదు; ద్రవ్య మిమ్మని వెంట దగుల లేదు; --- కనక మిమ్మని చాల గష్ట పెట్టగలేదు! పల్లకిమ్మన నోట బలుకలేడు ; -- సొమ్ము మిమ్మని నిన్ను నమ్మికోల్వగాలేదు భూములిమ్మని పేరు పొగడలేదు; -- బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు పసుల నిమ్మని పట్టుబత్తలేదు; -- నేను గోరిన దొక్కటే నీలవర్ణ! -- చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు ; భూ. ------ భావము ------ ఓ నరసింహస్వామి! నాకు ఐశ్వర్యము లు వద్దు. సంపదలో ద్దు ధనము వద్దు. బంగారము ,వాహనములు, సొమ్ములు, భూములు, శక్తియుక్తులు, పనులు మేదలగునవేవి నాకక్కరలేదు. ఓ నిలమేఘశ్యామా! నిన్ను కోరేదోక్కటే! మోక్షము ప్రసాదించమని అడుగుతున్నాను, వెంటెనే మోక్షప్రాప్తి ననుగ్రహింపుము తండ్రి!

రీ నరసింహ శతకము -శేషప్ప కవి ప్ర ణితము ---- ఇహలోక సౌఖ్యమ్ము లిచ్చగిం చేదమన్న దేహ మేప్పతికిడా స్థిరత నొంద, -- దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు నొక్క తిరుననుమ్డ దుర్విలోన; -- బాల్య యౌవన సుడుర్బాల వార్ధకములను మూ టిలో మునిగెడి మురికి కొంప ; -- భ్రాంతితో దీని గాపాడుడ మానుకొన్న గాల మృత్యువు చేత గోలుపోవు.---- నమ్మరాడయ్య! యిది మాయనాతకంబు -- జన్మమిక నొల్ల నన్నేలు జలజనాభ! భూ , ----- భావము ------ ఓ నరసింహస్వామి! ఇహలోకము అనగా భులోకసుఖములు కోరుదామంతే ఈ శారిరమునశ్వరమైనది.శాశ్వతమై నాదికాదు.జీవితాంతము బలము ఒకే విధంగా ఉండదు. ఈ దేహమనే కట్టే చిన్నతనము, ప్రాయము, ముసలితనమనే మురికి గోతలో మునిగిపోయే తోలుతిత్తి, దీనిని ప్రేమతో నిలుపుకొం దామంటే చావు, మ్రుత్యువులలో నిదిజారిపోతుమ్ది, దీని నిన్నేతికిని నమ్మరాదు.ఇది యొక బూతకనాటక మువంటిది. పుట్టుకనేది ణా కొద్దు తండ్రి! ఓ పంకజనాభా! నన్ను రక్షింపుము .

శ్రీ నరసింహ శతకము -శేషప్ప కవి ప్ర ణితము --- దనుజ సంహార! చక్రధర! నీకు దండంబు ; లింది రాదిప! నీకు వందనంబు;-- పతితపావన! నీకు బహు నమస్కారముల్ నిరజాత దళాక్ష్ నీకు శరణు ; --- వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు ; మందరధర! నీకు మంగళంబు ; -- కంబుకంధర! శార్జకర నీకు భద్రంబు; దీన రక్షక! నీకు దిగ్విజయము; -- సకల వైభవములు నీకు సార్వ భౌమ! -- నిత్యకల్యాణము లు నాగు నీకు నెపుడు; భూ ---- భావము ---- ఓ రాక్షస సంహారి! చక్రధారి! నీకు నమస్కారములు. ఓ లక్ష్మీపతి! నీ కిదే ణా వందనము. పతితపావనా నీకు పెక్కు నమస్కారములు. పద్మపత్ర దళాక్ష్! నీకు వందనము. ఇంద్రాది దేవతలచే పూజింప బడువాడా! మేఘవర్ణశారిర! నీకు శుభము! ఓ మందరధరా! నీకు మంగళము. శంఖము వంటి కంతంముగాలవాడా ! విష్ణువు విల్లును ధరించినవాడా! నీకు మేలు . దీ నులను రక్షించు నాదా ని దిగ్విజయము . సార్వభౌమా! నికేల్లపుడు సకల పూజలతో వేడుకలతో శుభమగు గాక!

శ్రీ నరసింహ శతకము - శేషప్ప కవి ప్ర ణితము ----- నరసింహ! నీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలము లేల్లదోలవచ్చు; -- నరసింహా! నీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు; -- నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు; -- నరసింహ! నీ దివ్య నామ మంత్రముచేత దండ హస్తుని బంట్లదరుమవచ్చు; -- భళిర! నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంత పదవి సాధింపవచ్చు! భూ ----- భావము ---- ఓ నరసింహ స్వామీ! నీ పవిత్రనామ మంత్రముచే సమస్త పాపములను పోగోత్తవచ్చును. దీ ర్ఘవ్యాదులు నివారించవచ్చు. శత్రు సమూ హములను జంప వచ్చును. యమభాతులను దరమవచ్చును! ఓహో ! నీ నామ మంత్రమహిమచే గొప్పదైన వైకుంత మునందు బడవిని బొమ్దవచ్చు. ఆహా! ఏమని చెప్పుదును? నీ నామమంత్ర మహిమచే సాధింపలే ని కార్యములేదు.

శ్రీ నరసింహ శతకమునుండి -శేషప్పకవి ప్ర ణితము ---- 
ధీరత బరుల నిందింప నేర్చితి గాని తిన్నగా నిను బ్ర్స్తుతింప నైతి ; -- 
బొరుగు కామినులందు బుడ్డి నిల్పితి గాని నిన్ను సంతతము ద్యానింప నైతి;--- 
బొరుగు ముచ్చట లైన మురిసి వింటిని, యెంచి నీ కదా లాలకించనైతి; --- 
గౌతుకంబున బాతకము గడించితి గాని, హెచ్చు పుణ్యము సంగ్రహింప నైతి ;------ 
నవనిలో నేను జన్మించినందు కేమి -- సార్ధకము కానరాదాయే స్వల్పమైన ; భూ -------- 

భావము ------ ఓ నరసింహ స్వామీ ! గర్వముతో ఇతరులను నిందిం ప నేర్చితినిగాని మస్పుర్తిగా నిన్ను పొగడనైతిని. పరస్త్రిలపై వ్యామోహము పెంచుకొన్నాను గాని నిరతము నిన్ను ధ్యానించ నైతిని. యితరుల వ్యవహారములపై ఆసక్తి చూపి తినిగాని, నీ పున్యకదా శ్రవణము పై శ్రద్ధ చూప నైతిని. వేడ్కతో పాపమును మూటగట్టు కొన్నాను గాని ఎక్కువైన పుణ్యమును సంపాదించు కొననైతిని. ఈ భూమి పై పుట్టినందుకు కొంచమైన నూ జివితసార్ధకము కానరావట్లేదు,తండ్రీ! కరుణతో కరుణిం పుము కరుణేశ్వరా!

శ్రీ నరసింహ శతకము నుండి -శేషప్ప కవి - ప్ర ణితము ----
సీ. --- ప్రహ్లాదు డేపాటి పైడి కానుకలిచ్చే? - మదగజం బేన్నిచ్చే మౌక్తికములు? ---- నారుడుదేన్నిచ్చే నగలు రత్నంబు? ళ - హల్య నీ కే యాగ్ర హారమిచ్చే? -- 
నుదుట నికేపాటి యుడిగంబులు చేసే? - ఘన విభీష ణుడేమి కత్నమిచ్చే? ---- పంచపాండవులేమి లంచమిచ్చిరినీకు? - ద్రౌపది నీ కెంత ద్రవ్యమిచ్చే?-----
తే.--- నీకు విరందరయినట్లు నేను గాన -- యెందు కానీ నన్ను రక్షింప విందు వదన! భూ. ----- 

 భావము ----- ఓ ఇందువదవా! నీ భక్తుడైన ప్రహ్లాడుడేపాటి కానుకలిచ్చాడని రక్షించితి వి? గజేంద్రు డెన్నినుత్యము లోసంగేనని మోక్షము నిచ్చితివి? నారదు డెన్నినగలు,రత్నములు ఒసంగినాదని ఆదరించి టివి. అహల్య నీకు ఏ అగ్రహారమిచ్చిం దని ఆదరణ చూపావు? ఉడుత నీ కెంత సేవ చేసింద ని కరుణ చూపావు? గొప్ప విబీషణుడు నీ కెంత కట్నమిచ్చాడని లంకారాజ్యాన్ని ధారాదత్తం చేశావు? పంచాపామ్దవులేమ్త లంచామిచ్చారని పక్షపాతము చూపావు? ద్రౌపది ఎంత ద్రవ్యమిచ్చేనని దయ తలచావు? వారికి మల్లే నీ భాక్తుదనేకానా? నన్నెందుకు రక్షింప వు తండ్రీ!

శ్రీ నరసింహ శతకము నుండి - శేషప్ప కవి - ప్రణితము --- సీ. 
కమలలోచన! నన్ను గన్న తండ్రివి కాన - నిన్ను నేమరకుం టి నేను విడక , ---- 
యుదర పోషణకు నై యొకరి నే నాశింప - నేర; నాకన్నంబు నీవు నడవు, -- 
పేట్టలేనంటి పిన్న పెద్దలోన - దాగివు కిప్పుడు డియ దలచినాను; -- 
ధనము భారంబైన దలకిరిటము లమ్ము, కుండలంబులు పిండి గోలుసులమ్ము; --- 
తే. ---- కొనకు నీ శంఖచక్రముల్ కుదువబెట్టి -- గ్రాసము నొసంగి పోషించు కపటి ముడిగి; 

భూ. ----- భావము ---- ఓ కమలలోచానుడా! నన్ను కన్న తండ్రివి గావున నిన్ను విడువలే కున్నాను. ణా ఉదరపోషణ కొరకు నేనితరుల నాశ్రయింపలేదు. ణా పోషణ నీదే తండ్రీ! కాడంతివా తగువుకైనా వేకాడను. పిన్న పెద్దల మధ్య తగువు కిడ్చదలచాను. శక్తి లేదందువా,నీ బంగారు ఆభారనములైన కిరితమును గాని, నీ శంఖ చక్రమును గాని కుదువ బెట్టి ణా పోషణ భారము వహింపుము తండ్రీ!

శ్రీ నరసింహ శతకమునుండి - శేషప్పకవి ప్ర ణితము ---- 
సీ . నరసింహా! నాతండ్రి నన్నేలు నన్నేలు, కామితార్ధము లిచ్చి కావు కావు,---- 
దైత్య సంహార! చాల దయయుంచు దయయుంచు దీ నా పోషక! నీవే దిక్కు దిక్కు, --- 
రత్న భూ శితవ క్ష! రక్షించు రక్షించు, భువన రక్షక! నన్ను బ్రోవు బ్రోవు, --- 
మారకోటిసురూప! మన్నించు మన్నించు, పద్మలోచన చేయి బట్టు పట్టు,------- 
తే. ---- సురవినుత! నేను నీ చాటు జొచ్చినాను, ---- ణా మురాలించి కడతేర్చు నాగశయన! భూ. ----

-- భావము ------ ఓ నరసింహా! ణా తండ్రి! నన్నేలుకొమ్ము. నాకోరికలను తీర్చి కావుము తండ్రీ! ఓ రాక్షస సంహారి! నాపై దయజూడుము. ఓ దీ నపోషక! నీవే నాకు దిక్కు. రత్నాభరణ భూషిత వక్షస్థలము గలవాడా! నన్ను రక్షింపుము. లోకరక్షా! నన్ను కాపాడుము తండ్రీ! ఆగ ణిక సౌందర్య మూర్తి! ఓ నవమన్మదాకారా! నన్ను మన్నించుము. ఓ పద్మలోచానుడా! నీ చేయి నాకందిం ఛి సాయపడుము. సురవినుత! నీ చాటున చోచ్చినాను. నామోరాలిం ఛి నన్ను కరుణిం చావా కనక భూషణ భుజంగ శయనా!

శ్రీ నరసింహ శతకమునుండి - శేషప్పకవి ప్ర ణితము ---- 
సీ. అడవిపక్షుల కేవ్వదాహార మిచ్చెను? మ్రుజాటి కెవ్వాడు మేతబేట్టే? --- 
వనచరాదులకు భోజన మేవ్వడిప్పించే , జేట్లకెవ్వడు నీళ్ళు చేదిపోసే? --- 
స్త్రిలగర్భంబున శిశువు నెవ్వడు పెంచే? ఫణుల కెవ్వాడు పోసే బరగాబాలు --- 
మధుపాలి కెవ్వాడు మకరంద మొనరిమ్చె? బసుల కేవ్వదోసంగే బచ్చిపూరి? --------

తే. --- జివకోట్లను బోషింప నివేకాని, -- వేరే యోకదాత లేదయ్యా వెదకి చూడ! భూ . ----- భావము ------ ఓ శ్రీహరీ! అడవిలోని పక్షులకేవ్వడా ధారమయ్యెనో, మృగజాతి కెవ్వాడు మేట పెట్టెనో, అడవిలోని పశుపక్ష్యాదుల కేవ్వడా హారమిచ్చెనో, చేట్లకెవ్వడు నీళ్ళు పోసిపెంచెనో,స్త్రిలగర్భాములోని శిశువులనెవ్వరు పెంచి రో, పాములకెవ్వరు పాలుపోసి పెంచెనో, తుమ్మెద సముహమున కెవ్వరు మకరంద మిచ్చెనో, పశువులకు పచ్చగడ్డి పెట్టి పోషించే వాడెవ్వడో అట్టి జగద్రక్షకుడైన నరశింహ మూర్తి యే సర్వులకు దాతగాని వేరొకడు కాడుగదయ్యా!   

 !!""శుక్లాం భరదరం విష్ణుం' అని చదువుతూనే
వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు??
తెలియనివారు ఒక్కసారి చదవండి...
శుక్లాం భరదరం- తెల్లని వస్త్రములతో
విష్ణుం - అంతటా వ్యాపించిన వాడై
శశివర్ణం - చంద్రుని వంటి ప్రకాశం కలవాడై
చతుర్భుజం - నాలుగు
భుజములు(చేతులు) కలవాడై
ప్రసన్న వదనం - ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని
ధ్యాయేత్ - ధ్యానించుచున్నాము
ఆగజానన పద్మార్హం- నాయకత్వం లేని మాకు
గజానన మహర్నిశం - నాయకుడివై మమ్ములను నడిపించు
అనేకదం తం బక్తానమ్- కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో
ఏకదంతం ఉపాస్మహే- ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము""
జై గణేష జై జై గణేష!!

      

Saturday, 8 July 2017



" బ్రాహ్మణో భోజన ప్రియః " అనేది అనాదిగా వస్తున్న నానుడి . బ్రాహ్మణుల భోజన ప్రియత్వము గురించి సరదాగా పోస్టింగు . దయచేసి ఎవ్వరూ అపార్ధం చేసుకోవద్దు . బ్రాహ్మణుల ఇంటి భోజనము గురించి . Watsup message . మీరేమన్నా అనుకోండి మాష్ఠారూ... బ్రాహ్మణ భోజనాలు భలేగా ఉంటాయండీ! "అంటే ఏవిటయ్యా? మిగతా భోజనాలన్నీ తేడాగా ఉంటాయంటావా!?" అని నామీద విరుచుకుపడొద్దు... నిజం చెప్పొద్దూ.! ఇవాళ మనస్పూర్తిగా బొజ్జ పూర్తిగా నింపుకుని ఉత్తరావపోసన పట్టి.. బ్రే....వ్వ్ అనడం జరిగింది.

వర్ణన:- మొదట చాప వేసి మమ్ములను ఆశీనులౌమన్నారు. మా ముందుగా వయసులో ఉన్న పచ్చటి అరిటాకులను వరసగా పరుచుకుంటూ వెళ్లారు. ఆ ఆకులకు ప్రథమ సంస్కారంగా ఆకులపై నీళ్ళు చల్లారు . వెంటనే విస్తట్లోకి “నచ్చుతానో,నచ్చనో” అని పెళ్లిచూపుల్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లాగా మొహమాటంగా వస్తున్న వంటకాలు . మొదట విస్తట్లోకి జీడిపప్పు, పల్లీ సహిత పులిహోర హోరెత్తింది. పక్కనే పరమాన్నం ప్రత్యక్షం అయింది . పక్కన టమాట పప్పూ, శనగ నూనెలో వేయించిన అప్పడ,వడియ,చల్ల మిరపకాయలు . వెంటనే శాఖాహారుల శాకాంబరి గుత్తి వంకాయ! ఇంటల్లుళ్ళకు ఇష్టమంటూ బాగా ఆవ పెట్టి చేసిన పనసపొట్టు కూర . వేసవి కాలం ఒడుగు లగ్గాల్లో ఉపనయనం అయిన పిల్లవాడిలా ముచ్చట గొలిపేలా ఉన్న అప్పుడే పెట్టిన ఆవకాయ! దాని పక్కనే ఈర్ష్యాసూయలతో దోసావకాయ! కోపం తో మాడిపోయిన బెండకాయ వేపుడు, శనగ పొడిలో విసిగిపోయిన దొండకాయ వేపుడు . చివర్లో తమన్నాని తలదన్నే అందంతో అన్నమూ వచ్చాయి. ఆగాగు తొందర పడమాకూ... అయ్యా నేనొస్తుండా...బాబూ నేనొస్తుండా.... అయ్యా నేనొస్తుండా...బాబూ నేనొస్తుండా.... అంటూ చివర్లో నెయ్యి వచ్చింది. ఇక రాగి చెంబులో నీళ్ళిచ్చి “చిన్నగా కూర్చోండి... బాబూ” అని ఒక మాట చెప్పారు. నా చెవులకది డైరెట్రు గారు "action "అనరిచినట్టు వినబడింది. ఇక అవపోసన పట్టి మొదలెట్టాం. మొదట పులిహోర తిని, తర్వాత పప్పు పని పట్టాను అప్పడంతో. ఇంకా సగం పప్పు మిగిలి ఉంది!. నేను మొదట్నుంచీ గమనిస్తూనే ఉన్నాను ఆ టమాటపప్పు విస్తట్లోకి వచ్చినప్పటి నుంచి ఆ ఆవకాయకి లైనేస్తోంది. ఇక ఆ ఆవకాయ్...పెట్టి ఆర్రోజులే ఐనా అప్పుడే ఆరింద ఐపోయింది. వాళ్ళ ప్రేమకి ఆ నెయ్యిగాడు కారణం ఐయ్యాడు... ఇక నేనూరుకోలేదు... విశాల హృదయంతో ఆ రెంటినీ నెయ్యి గాడి సాక్షిగా కలిపి మింగేశాను. "వేడి తగ్గేలోపు తొందరగా తినవయ్యా మగడా... !" అంటూ గుత్తొంకాయ ఘుమఘుమలాడింది. దాని పని కూడా పట్టేసా… వెంటనే బెండకాయ్ వేపుడు అందుకుంది...ఉంది కదా అని ఆ టక్కులమారి వంకాయ ని అలా లాగించేయకయ్యా... తర్వాత దురదలని మొత్తుకుంటావు. పచ్చటి జీవితాన్ని త్యాగం చేసి వచ్చిందెవరికోసం...? నీకోసం కాదా? అంటూ నసిగింది.. దానికి దొండకాయ వత్తాసు పలికింది. ఇద్దర్ని కలిపి ఒకేసారి లాగించేసాను... మొహమాటం తో మూల నుండి “హాయ్ బావా” అని మరదలు పిల్ల పలకరించినట్టు పనసపొట్టు కూర సిగ్గు పడుతూ అక్కడే ఉండిపోయింది... దాని పనికూడా పట్టి ఇక పెరుగన్నం వైపు కాశి యాత్ర చేద్దాం అనుకునే లోపు...పరిగెత్తుకుంటూ వేడి వేడిగా సాంబారు బామ్మర్ది గాడు వచ్చి “అదేంటి బా అలా వెళ్లి పోతున్నావ్!? నన్ను నాలో ఉన్న ముక్కలని గ్రహించి మమ్మల్నందర్నీ ఉద్దరించండి” అని బెల్లం ముక్క తో బ్రతిమిలాడాడు... ఏవిటో నా మీద వెర్రి అభిమానం అనుకోండి ఈ వంటకాలన్నిటికీనూ ... ఓ పట్టు పట్టేదాకా ఓ పట్టాన వదల్లేదు... చివర్లో గులాబ్ జామూన్ శోభనం పెళ్లి కూతురు లాగా వచ్చి కవ్వించింది... దాన్ని తింటూ అల్లకల్లోలమైయున్న నా విస్తట్లోకి చూసాను..విస్తట్లో నుంచి వెలి వేసిన కరివేపాకు దీనంగా నా వైపు చూస్తే, ఆవకాయ టెంకే మోక్షం పొంది నాలో ఐక్యం ఐపోయిన భావనతో చూసింది. విస్తట్లో మిగిలిపోయిన దోసావకాయ్ నాకు తెల్సు నీకు ఆ ఆవకయంటేనే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని ప్రేయసి లా గొడవ పెట్టుకుంది . సగం కరచిన పూర్ణం బూరి, సగం సగం మిగిల్చిన వంటకాలు... "మాలో అర్ధ భాగమే తిని మా బ్రతుకులకి అర్ధం లేకుండా అర్ధాంతరంగా వదిలేసావ్ అంటూ అర్ధించాయి." ఇక నా పొట్టలో ఏ మాత్రం కాళి లేనందున ఉత్తరావపోసన పట్టి లేచి శుభ్రంగా బ్రే...వ్ అని త్రేన్చి... కాస్త అటూ ఇటూ తిరిగి ఓ కునుకు తీసాను... అన్నధాతా సుఖీభవ.

* మంగళ సూత్రంలో పిన్నీసులు ఉంచరాదు. అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి ఉంచుతుంటారు. మంగళ సూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడిన భర్త ఆయువుపట్టు. మంగళ సూత్రం రూపంలో హృదయం వద్ద చేరి ఉంది. ఇనుప వస్తువులు [పిన్నీసులు, ఇనుముతో చేసినవి] దివ్య శక్తులను ఆకర్షించుకొను గుణం ఉన్నాయి. అవి మంగళ సూత్రంలో దివ్య శక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి.
 * స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక, వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది.
* ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచ‌డం అంత క్షేమం కాదని, డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలా మంది నమ్మకం.
* సంపదలను, ఎక్కువగా ప్రదర్శించ‌డం వల్ల నరఘోష ఏర్పడుతుంది. తద్వారా చెడు జరుగుతుంది. అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవటం, సాధారణ జీవిత విధానాన్ని పాటించటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు.

 * ఆడపడుచులు, అత్తమామలతో విభేదాలు ఎక్కువైతే, వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద తులసి వేరు ఉంచండి వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు. విరోధాలు తగ్గిపోతాయి.
 * వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి… వంటకాలు ఎంతో రుచిగాను, ఆరోగ్యకరంగాను ఉంటాయి.
 * పని మనిషిరానప్పుడు విసుగు చెంది కోపంతో బాధపడే కంటె, పని మనిషి కంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను, వాళ్ళ‌కంటే నేనైతే శుభ్రంగా ఉంచుకోగలనని మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీ పనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి. అసలు పని మనిషిని మానిపించాలనే అనిపిస్తుంది మీకు. * సుఖ సంతోషాలు కరువైనవారు పసుపు రంగు పూలు ధరించండి, క్రమేపీ స్థితి మెరుగవుతుంది. * అప్పుల బాధ ఎక్కువగా వుంటే తెలుపు పూలు ధరించటం వల్ల రుణ బాధలు తగ్గుతాయి.
* ఆరోగ్యం సరిగా లేని వారు, శరీరం నొప్పులు వున్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.
 * పెళ్ళి చూపులప్పుడు ఎరుపు పూలు, పసుపు పూలు కలిపి మాలకట్టి పెట్టుకుంటే అమ్మాయిలకు మంచి సబంధాలు వస్తాయట.
 * ఇక ఆఖరుది అతి ముఖ్యమైనది భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే, గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్లమనండి. భర్తకు ఆ రోజు సంపాదనా , విజయం సంతోషం వెంట ఉంటాయి. ఇవన్నీ మూఢ నమ్మకాలు. అలా జరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందనే వాదనలు చేసేవారి సంగతి కాసేపు పక్కన పెడితే.. ప్రపంచవ్యాప్తంగా నమ్మకాలు అనుభవాలను బట్టే కలుగుతాయి అంటున్నారు.

*ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి సందర్భముగా శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నాను ఫెస్ బుక్ ద్వారా మీ స్నేహాన్ని కోరు తున్నాను, శ్రీ గురు చరిత్ర లో ఉన్న అన్నీ కధలను నేను రికార్డు చేస్తున్నాను, వాటిని ఫెస్ బుక్ లో పెడుతున్నాను, విని శ్రీ గురు కృపకు ప్రతిఒక్కరు పాత్రులు కాగాలరని ఆశయంతో ఇందు పొందు పరుస్తున్నాను. విని మీ అభిప్రాయాలు తెలుపగలరు


*హాయ్...........
ఇవి మీకు తెలుసా ?
*అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
*కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
*నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
*గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
*అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
*జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
*బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
*సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
*మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.
*దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
*ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.
*అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.
*కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.
*మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.
*ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.
*బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.
*క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
*మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.
*ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
*అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
*పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
*సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.
*దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
*ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.
*చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
*కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
*క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.
*యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.
*వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.
*పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.
*ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.
*ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
*ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.
*జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.
*నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
*మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.
*మునగ కాయలు ఆకలిని పెంచుతాయి. యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని