Thursday, 17 November 2016

ఓ మనిషీ - బ్రతికీ - బ్రతికించు (పార్టు -3)

ఓ మనిషీ - బ్రతికీ - బ్రతికించు  (పార్టు -3)

అప్పుడే తల్లి వచ్చి ఇంకా కాఫీ త్రాగలేదు ఏమిరా మళ్ళీ వేడికాఫీ తెచ్చి ఇస్తా ,

ఉండూ అమ్మా కాఫీ కేం తొందర లేదు ఇటు కూర్చోమ్మా , నాకు ఏదన్నా సలహా ఇవ్వమ్మా అని అడిగాడు రామకృష్ణ .

ఏనాడైనా ఎప్పుడైనా సలహాలు ఇచ్చానా, వండానా అందరూ భోజనం చేశారా అని ఆలో చించాను తప్పా, అన్నీ నిర్ణయాలు మీనాన్న చెప్పినట్లు చేస్తేనే నాకు ఇంత కూడు దొరుకుతుంది లేక పోతే ఏనాడో  ఈ కుటుంబం ముక్కలయ్యేది, మీనాన్న చెప్పిన దాట్లో తప్పు ఎక్కడా  నాకు కని పించుట లేదు, నేను ప్రపంచములో బ్రతక గలను అని ఆత్మవిశ్వాసం ఉంటే తక్షణం బయట ప్రపంచంలో బ్రతికి నలుగురిని బ్రతికించు, నేను పెద్దగా చదువు కోలేదు ఇంతకన్నా నేను నీకు ఏమి చెప్పలేను, నాన్నే గదా అరిచింది వంటిమీద పడ్డ దుమ్ము దులుపు కున్నట్లు దులుపుకొని ఉండ దలుచు కుంటే నిత్యమూ మానసిక సంఘర్షణలకు చిక్కుతావు అది మాత్రం గుర్తుంచుకో నేను మీనాన్నకు తోడు , నాకు మీనాన్న తోడు తప్పదు. నేను ఒకటే చెప్పగలను ప్రతి రోజు అద్దం శుభ్రంగా తుడుచుకొని ముఖం చూడమన్నారు పెద్దలు. ఎందుకో తెలుసా నిన్న జరిగిన విషయాలన్నీ మరచి పోయి కొత్త ముఖంతో ఉండాలనేదే ఇందులో ఉన్న నీతి.
             
నా ఈజీవితము లో సగం పైన సుఖదుఃఖాలు అను భవించాను, ఇది మాకు శేష జీవితము.
నీవు వయసు లో ఉన్నావు, కష్ట పడగలవు ఆలోచించుకొనే శక్తి నీకు ఉన్నది అని చెప్పి లోపలకు వెళ్ళింది తల్లి......

బయట  నుండి అమ్మా ఇంత గంజి ఉంటే పోయండమ్మా, చద్ది ఉంటే  పెట్టండమ్మా, 2000 రూపాయలకు చిల్లర ఉంటే ఇవ్వండమ్మా అని అరుస్తున్నాడు ఒక బిచ్చగాడు,

బాబు బాబు అని తల్లి పిలుపుకు రామకృష్ణ తల్లి వద్దకు చేరాడు, ఒక్కసారి బయటకు పోయి రాత్రి పూరీలు తీసుకుంటాడేమో అడుగు నాయనా అన్నది  . అమ్మా ఇవ్వు నేను  ఇస్తా, వద్దు బాబు ముందు అడిగిరా మనం పెట్టిన వాటిలో కొద్దిగా వాసన వచ్చినా వారి నోటికి వచ్చి నట్లు తిడతారు అది గుర్తు పెట్టుకో సరేనమ్మా వెళ్లి అడిగి వస్తా.

రాత్రి పూరీలు తీసుకుంటావా, తీసుకుంటాను బాబు అన్నాడు.మరి చిల్లర ఉంటే కూడా సర్దు బాబు.

మీదగ్గర  చాలా చిల్లర ఉంటుంది అంటారుగా. అవును బాబు నిన్నటి దాకా ఉండేది, మా ఇంటి పక్క బాబుకు ఆరోగ్యం బాగుండక పోతే ఉన్న చిల్లరంతా ఆస్పత్రిలో  కట్టినాను 2000 రూపాయల నోటు తీసుకున్నా అయినా నేను ఉంచిన  చిల్లర ఒక ప్రాణికి సహాయ పడినందుకు నాకు సంతోషముగా ఉన్నది బాబు.  2000 చిల్లర అడుగుతున్నాను అన్నాడు.       

ఏమిట్రా బిచ్చగానితో సంభాషణ ముందు ఇవిపెట్టు అతనికి అని అన్నది తల్లి. 

రామకృష్ణ  వెంటనే పెట్టి వెనుకకు వచ్చాడు.   ......   3  .......    
 
                                       మిగతాభాగము క్రేపు చదవండి ... 

Wednesday, 16 November 2016

ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు-*1*

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
Hanan Foudah - Google+
సర్వేజనా సుఖినోభవంతు
ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు 
పార్ట్ -1 


ఇంటిముందు ముగ్గులు వేస్తున్నారు ఆడవారు, వారికి తోడుగా మొగవారు సహకారిస్తూ ముగ్గులందిస్తూ, ముచ్చట్లు చెప్పుతూ, సరదాగా నవ్వు కుంటూ ముగ్గులు పూర్తి చేసారు, అది ఒక పెద్ద కుటుంబము, ఇద్దరు కొడుకులు కోడళ్ళు, ఇద్దరు కూతుర్లు అల్లుళ్ళు అందరు కలసి సరదాగా వినాయక చవితి పండుగ జరుపు కుంటున్నారు.  ఇంటి పెద్ద చక్రధర్ గారు, శ్రీమతి శారద ఇంటిని  పద్ధతిలో నడుపు కుంటూ  ఎటువంటి ఇబ్బంది కలుగ కుండా పిల్లలకు చదువులు చెప్పించి, వారికి వివాహములు జరిపి సంతోషంలో ఉన్న కుటుంబము. 

ఆకుటుంబములో చిన్న కొడుకు రామకృష్ణ చదువు  అబ్బలేదు,  ఇష్టము వచ్చి నట్లు స్నేహితులతో తిరిగేవాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చు కుంటాడు, ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే తెలుసుకొని న్యాయం జరిగేదాకా శ్రాయ శక్తుల కృషి చేస్తాడు. చిన్న చిన్న విషయాలకే రెచ్చి పోతాడు, 

మొన్నటి మొన్న ఐస్ బండివాడు ఒక పిల్ల చేతిలో ఐస్ పెట్టాడు, ఆపాప పట్టుకోకుండా గభాలున క్రింద పడేసింది, మల్లి కావాలని ఏడ్చింది అప్పడు పాప ఏడుస్తున్నది కదా బండివానితో వేరొక ఐస్ ఇవ్వు అన్నాడు రామకృష్ణ. డబ్బులిస్తేనే ఇస్తాను ఇవ్వాటం కుదరదు అన్నాడు, ఎందుకు ఇవ్వటం కుదరదు ఇవ్వు డబ్బులిస్తా, ముందు డబ్బులివ్వు అప్పుడే ఇస్తా అన్నాడు, మాటలు పెరిగి బూతులుదాకా వచ్చేటప్పటికల్లా ఎడం చేతి వాటంతో చేయి చేసుకున్నాడు, అక్కడ చేరిన జనం అందరూ ఎవరి కిష్టము వచ్చినట్లు వారు మాట్లాడారు, అప్పుడే అటుగా వస్తున్న తండ్రి గమనించి గదా తీర్చి డబ్బు ఇచ్చి పంపించాడు.       
        
ఒకనాడు చక్రధర్ గారు కొడుకును పిలిచి నీ ప్రవర్తన మాకెవ్వరకూ నచ్చుటలేదు, కష్టము అంటే ఏమిటో నీకు  తెలియుట  లేదు, ఈ రోజు  నుంచి నీవు ఎక్కడైనా కష్టపడి డబ్బు సంపాయించి తె స్తేనే ఇంటిలో నీకు కూడు దొరుకుతుంది ఆలోచించుకో, లేదా నేనే ఎక్కడో ఒక్క చోట పనిచేసుకొని బ్రతుకుతాను అని నీకు ధైర్యము ఉంటె తక్షణం ఇంటినుండి వెళ్లి పోవచ్చు. ఇక్కడ నిన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ భోజనం చేయాలంటే రోజూ ఎంతోకొంత సంపాయించి మీ అమ్మ చేతిలో డబ్బు పెట్టాలి, 

లేదా నేనే స్వతంత్రముగా బ్రతుకు తాను అని నీవు భావించి నట్లైతే ఆ బళ్లపై ఒక వైపు 10 వేళ నోట్ల కట్ట మరో వైపు  తల్లి తండ్రుల ఫోటో గోల్డు లాకెట్ ఉన్నది, నీకు ఏది ఇష్టమైతే అది తీసుకోని తక్షణం వెళ్లిపోవచ్చు అని చెప్పాడు చక్రధర్ . 

నాన్న గారు మీరు ఇప్పటిదాకా నా మీద ప్రేమ ఏంతో  చూపారు, నాకు చాలా సంతోషము అమ్మా అని పిలిచాడు రామకృష్ణ 

ఏమిటిరా  బాబు అంటూ వచ్చింది, అమ్మా నాన్న నన్ను దీవించండి లోకంలో బ్రతకటం నేర్చుకొని మీకు మల్లి కనిపిస్తాను, మీరు నన్ను దీవించి పంపండి అని పాదాలకు నమస్కారించాడు. అన్నా వదినలకు, అక్కాబావలకు నమస్కరించి బయటకు  బయలు దేరాడు,  బాబు అన్నం తినిపోరా ఎప్పుడు తిన్నావో అన్నది తల్లి శారద. 
                                                                                               
                                                                         తరువాత భాగము రేపు చదవండి .... 


ఈ పండగ నాడు ఎక్కడికి పోయి బ్రతుకుతావురా ఇక్కడే ఉండు మీ నాన్న గారిని వప్పిస్తాను ఇక్కడే ఉండురా, ఇక్కడే ఉండి చదువుకో , నాన్నకు చెప్పు నేను బాగా చదువుకుంటాను ఇప్పుడు క్షమించు-  అని అడగారా , పంతానికి పోకురా , దేశములో బ్రతకటం చాలాకష్టం నీవు తొందర పడవద్దు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోరా. 
అమ్మా ఈ పండుగ నాడు నేను   ఎక్కడకు పోవుటలేదు రేపటి లోపు నా నిర్ణయం అందరికి చెప్పి ఇంటిలో ఉండుట లేదా బయటకు వెళ్లి బ్రతకటం చెప్పగలను. 

ఆమాటలకు అందరూ సంతోషించి అందరూ కలసి భోజనం చేసి సరదా సరదా గా ఆడుకుంటూ, పాడుకుంటూ కాలం గడిపారు ఆరోజు అందరూ.

రామకృష్ణ కు రాత్రి నిద్ర రాలేదు, అమ్మ చెప్పినట్లు విని నేను ఇక్కడే ఉన్నట్లయితే నాన్న చేత రోజూ తిట్లు తినాలి, నాన్న చెప్పి నట్లు ఇంటి నుండి బయటకు వెళితే ఎలా బ్రతకాలి అని ఎంత  సేపు ఆలోచించిన  పరిష్కారం దొరకలేదు , తెల్లవారు జామున నిద్ర పెటింది.
ఏమిటీ ఆ బడుద్దాయి ఇంకా నిద్ర లేవలేద, తెల్లవారు జామున లేచే అలవాటు ఉంటేగా, అలా వాకింగ్ పోదాం, సూర్యనమస్కారాలు చేద్దాం అని ఒక్కరికి లేదు అంటూ చక్రధర్ గారు ఒక చిన్న చాప వేసుకొని ,దానిపై చిన్న గుడ్డ వేసుకొని పద్మాసనం వేసి ముక్కును పట్టుకొని కూర్చున్నాడు.
నాన్న అప్పుడే అష్టోత్తరం మొదలైంది ఇక నా నిర్ణయం చెప్పే సమయ మైనదని అనుకున్నాడు రామకృష్ణ .

బాబు మొఖం కడుక్కో కాఫీ తీసుకోని వచ్చి ఇస్తా అన్న తల్లి మాటలకు నిద్ర     లేవక  తప్పలేదు.
                                      
తల్లి ఇచ్చిన కాఫీ త్రాగుతున్నాడు, అప్పుడే ఎరా అబ్బాయి, నీవు నాకుచెప్పి అప్పుడే కొన్ని గంటలు దాటి పోయినాయి, ఏమి నిర్ణ యించు కున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు, ఒక వేళా నీవే వేరేగా బ్రతకాలను కుంటే, మన వంశం  పేరుగాని, నాపేరు గాని ఎక్కడా ఉపయోగించు కోకూడదు,  ఎవరు ఏమన్నా పట్టించు కోకూడదు మంచి మాటలు మాత్రం  గుర్తుంచుకో , ఎవ్వరి వద్ద ఎటువంటి అప్పు తీసుకో కూడదు, నీవు ఏ పని చేసినా నాకు ఇష్టమే .

డ్రైనేజ్ శుభ్రం చేయబడును అని పాంప్లెట్ పొద్దున్నే పేపర్లో చూసా ఆ ఆపని చేసినా నాకు  అభ్యంతరం లేదు, లేదా నాన్న నేను ఈ వ్యాపారామ్ చేస్తా అని చెప్పు దాని లాభ నష్టాలు అంచనా వేసి నాకు సబబు ఐతే వ్యాపారం  పెట్టిస్తా, నాకు ఇష్టమ్ లేకపోతే నీకు చిల్లుగవ్వకూడ ఇవ్వను ఆలోచించుకో  అని చెప్పి కాఫీ త్రాగుట సగం లో అపావు పూర్తిగా త్రాగు ఏనాడన్న కష్టపడితే గా అంటూ లోపలకు సాగాడు చక్రధర్ .......... 2..... తరువాత భాగము రేపు చదవండి .... 



అప్పుడే తల్లి వచ్చి ఇంకా కాఫీ త్రాగలేదు ఏమిరా మళ్ళీ వేడికాఫీ తెచ్చి ఇస్తా ,

ఉండూ అమ్మా కాఫీ కేం తొందర లేదు ఇటు కూర్చోమ్మా , నాకు ఏదన్నా సలహా ఇవ్వమ్మా అని అడిగాడు రామకృష్ణ .

ఏనాడైనా ఎప్పుడైనా సలహాలు ఇచ్చానా, వండానా అందరూ భోజనం చేశారా అని ఆలో చించాను తప్పా, అన్నీ నిర్ణయాలు మీనాన్న చెప్పినట్లు చేస్తేనే నాకు ఇంత కూడు దొరుకుతుంది లేక పోతే ఏనాడో  ఈ కుటుంబం ముక్కలయ్యేది, మీనాన్న చెప్పిన దాట్లో తప్పు ఎక్కడా  నాకు కని పించుట లేదు, నేను ప్రపంచములో బ్రతక గలను అని ఆత్మవిశ్వాసం ఉంటే తక్షణం బయట ప్రపంచంలో బ్రతికి నలుగురిని బ్రతికించు, నేను పెద్దగా చదువు కోలేదు ఇంతకన్నా నేను నీకు ఏమి చెప్పలేను, నాన్నే గదా అరిచింది వంటిమీద పడ్డ దుమ్ము దులుపు కున్నట్లు దులుపుకొని ఉండ దలుచు కుంటే నిత్యమూ మానసిక సంఘర్షణలకు చిక్కుతావు అది మాత్రం గుర్తుంచుకో నేను మీనాన్నకు తోడు , నాకు మీనాన్న తోడు తప్పదు. నేను ఒకటే చెప్పగలను ప్రతి రోజు అద్దం శుభ్రంగా తుడుచుకొని ముఖం చూడమన్నారు పెద్దలు. ఎందుకో తెలుసా నిన్న జరిగిన విషయాలన్నీ మరచి పోయి కొత్త ముఖంతో ఉండాలనేదే ఇందులో ఉన్న నీతి.
             
నా ఈజీవితము లో సగం పైన సుఖదుఃఖాలు అను భవించాను, ఇది మాకు శేష జీవితము.
నీవు వయసు లో ఉన్నావు, కష్ట పడగలవు ఆలోచించుకొనే శక్తి నీకు ఉన్నది అని చెప్పి లోపలకు వెళ్ళింది తల్లి......

బయట  నుండి అమ్మా ఇంత గంజి ఉంటే పోయండమ్మా, చద్ది ఉంటే  పెట్టండమ్మా, 2000 రూపాయలకు చిల్లర ఉంటే ఇవ్వండమ్మా అని అరుస్తున్నాడు ఒక బిచ్చగాడు,

బాబు బాబు అని తల్లి పిలుపుకు రామకృష్ణ తల్లి వద్దకు చేరాడు, ఒక్కసారి బయటకు పోయి రాత్రి పూరీలు తీసుకుంటాడేమో అడుగు నాయనా అన్నది  . అమ్మా ఇవ్వు నేను  ఇస్తా, వద్దు బాబు ముందు అడిగిరా మనం పెట్టిన వాటిలో కొద్దిగా వాసన వచ్చినా వారి నోటికి వచ్చి నట్లు తిడతారు అది గుర్తు పెట్టుకో సరేనమ్మా వెళ్లి అడిగి వస్తా.

రాత్రి పూరీలు తీసుకుంటావా, తీసుకుంటాను బాబు అన్నాడు.మరి చిల్లర ఉంటే కూడా సర్దు బాబు.

మీదగ్గర  చాలా చిల్లర ఉంటుంది అంటారుగా. అవును బాబు నిన్నటి దాకా ఉండేది, మా ఇంటి పక్క బాబుకు ఆరోగ్యం బాగుండక పోతే ఉన్న చిల్లరంతా ఆస్పత్రిలో  కట్టినాను 2000 రూపాయల నోటు తీసుకున్నా అయినా నేను ఉంచిన  చిల్లర ఒక ప్రాణికి సహాయ పడినందుకు నాకు సంతోషముగా ఉన్నది బాబు.  2000 చిల్లర అడుగుతున్నాను అన్నాడు.       

ఏమిట్రా బిచ్చగానితో సంభాషణ ముందు ఇవిపెట్టు అతనికి అని అన్నది తల్లి. 

రామకృష్ణ  వెంటనే పూరీలు పెట్టి వెనుకకు వచ్చాడు.   ......   3  .......    



*ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు(serial) పార్ట్ -4


బాబు ఈరోజు మనం గుడికి వెళ్లుతున్నాము, అక్కడ భగవద్గీత గురించి ఉపన్యాసము చెపుతున్నారు,  కూర్చొని విని  వద్దాము. 

అట్లాగేనమ్మా 

 గుడికి చేరారు ఆ పరమాత్ముని దర్శనము చేసుకున్నారు, అమ్మా వెల్దామా అన్నాడు రామకృష్ణ  బాబు కాసేపు భగవద్గీత విని పోదాము, నాకు అర్ధం కాదు కదమ్మా,  మంచి విషయాన్ని తల ఎక్కించు కోవటం అందరికి కష్టం అయినా వినటం తప్పు కాదు అన్నది తల్లి. 

అప్పుడే ఉపన్యాసము మొదలు పెట్టారు   

ఈ  లోకములో ప్రతి ప్రాణి ప్రతి జీవి యొక్క యదార్ధ స్వరూపము బ్రహ్మమే, ఐతే ఆవిషయాన్ని తెలుసుకొనే అర్హత మానవుడికి మాత్రమే ఉన్నది, కనుక ప్రతి మానవుడు పరమాత్మను దర్శించగలడు. 

ప్రపంచములో అన్ని వస్తువులు దివ్య విభూతులూ కాదు, అవి సామాన్యలందు విభూతులుగా ఆవరించి ఉంటాయి అవి తేజస్సు, బలం, ఐశ్వర్యం, విద్య, శక్తి,  కాంతి.
కొన్ని సాత్వికమైనవి, కొన్ని రాజసికమైనవి, కొన్ని ఆమసికమైనవి. 

గంగ సాత్త్విక విభూతి, సింహం రాజసిక విభూతి, జూదం తామసిక విభూతి. 

ఆయితే భగవద్ స్వరూపాలు గల ఉప్పు నీరు త్రాగ గలమా, పాములను ప్రక్కలో ఉంచు కోగలమా

పరమాత్ముడు మనకు మంచి చెడు తెలుసుకొనే తెలివి ఇచ్చాడు దాని అనుకరించి పంచభూతా ల సహాయముతో జీవించాలి. 

కళ్ళుమూసుకొని ధ్యానం చేస్తే భగవంతునితో సంభంధం కళ్ళు తెరచి చూస్తే లౌకిక విషయాలే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాటి నుంచే మనం జీవిస్తూ  ఉండాలి. 

కొందరిలో కళ్లుమూస్తే రాముడు , కళ్ళు తెరిస్తే కాముడు కనిపిస్తాడు. మరి కొందరిలో తీర్ధానికి తీర్ధం తీసుకుంటారు ..   ప్రసాదానికి ప్రసాదం పొందుతారు. చెప్పుకోవటానికి వేదాంతం ... చెయ్యటానికి వ్యవహారం అని గమనించాలి అందరు. 

భగవంతుని స్మరించటం - పరమార్ధం, యోగం 
యద్ధం చేయటం - వ్యవహారం, విభూతి    
         .బుద్ధి

ఆత్మబుద్ధి సుఖాన్ని కోరు
గురుబుద్ధి  హితాన్ని కోరు 
సమబుద్ధి సత్యాన్ని కోరు 
నీచబుద్ధి ద్వేషాన్ని కోరు 

బంధ విముక్తియే హితం కోరు 
దు:ఖనివృత్తియే హితం కోరు
నిత్య  ప్రాప్తియే హితం కోరు 
జ్ఞాన ప్రాప్తయే  హితం కోరు 

శ్రేష్టమైన మాట మనసు చేరు 
మాతృ హృదయం బిడ్డ చేరు 
బుద్ధిహీనం చేత భయం చేరు 
తపస్సే మనస్సుకు శాంతి చేరు

రాగి తీగలో విద్యుత్  చేరు 
గాలివాటమున పడవ మారు
ఆశా మొహాలు మనిషని చేరు    
మనిషి ప్రతి క్షణం సుఖం కోరు
--((*))-- 

ప్రేమ రెంటిని ఒకటి చేస్తుంది - అహంకారం ఒకటి రెండు చేస్తుంది,  అంటూ ఉపన్యాసము చెపుతున్నారు. .                 ........ 4....       
     
                                                                                                          
    బాబు మనం ఇంటికి పోదాం, పదమ్మా అంటూ చేయి పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు అప్పుడే వేగంగా ఒక బైక్ మీద ముగ్గురు కుర్రవాళ్ళు పగలు త్రాగి నడుపు కుంటూ వచ్చి దభీ మని వెనుక వైపు పడ్డారు, బాబు ఎవరో స్కూటర్ మీద నుంచి పడ్డట్టున్నారు వెళ్లి స్కూటర్ లేపారా అట్లా చూస్తూ ఉన్నావేమి అన్నది తల్లి, లేదమ్మా వాళ్లకు ఇప్పుడే సహాయం చేస్తాను అంటూ స్కూటర్ పైకి తీసాడు, టాన్క్స్ అని చెప్పి మరీ బైక్ మీద వెళ్లి పోయారు.
వాళ్ళు ఎట్లా పడ్డారో నీకు తెలుసా, ఆ తెలుసమ్మా, వాళ్ళు మనకు ఇబ్బంబ్రతికించిందిది కలగకుండా షడన్ బ్రేక్ వేశారు పడ్డారు అని చెప్పాడు రామకృష్ణ.
అది నిజమేరా మనం చేసిన పుణ్యం మనల్ని  అది మాత్రం గమనించు అని పలికింది తల్లి. నెమ్మదియా ఇంటికి చేరారు ఇద్దరు.          

దర్శనం బాగా జరిగిందా అని ఎదురువచ్చి మరి అడిగాడు చక్రధర్, బాగా జరిగిదండి, మరి ఎందుకు అలస్యమైనది, అక్కడ ఉపన్యాసం చెపుతుంటే కాసేపు కూర్చొని వచ్చాము. మన పుత్ర రత్నం ఎం నిర్ణమయము తీసుకున్నాడు, కనీసాము నీకైనా చెప్పాడా, ఏమిటండి ఆ మాలు ఏ విషయానికైనా పట్టు విడుపు ఉంటుంది, సూర్యడి కి గ్రహాణం  పట్టిందని కాసేపు భాద పడ్డాము తర్వాత గ్రహణం విడిన తర్వాత అంతాసుఖ మయం. ఎవరో చప్పారు కధ, ఒక ఇంటివారు కొన్ని జంతువులను పెంచారు పిళ్లిని పెంచారు, కుక్కను పెంచారు, కోళ్లను పెంచారు, మేకలను పెంచారు చివరికి నక్కలను పంచారు. కానీ నక్కకు ఆశ పుట్టింది ఎట్లైనా సరే జంతువులన్నీ తినాలని తన తెలివి అంతా ఉపయోగించి జంతువులన్నీ మూగ జీవులు వాటిని పెంచటం మహా పాపం వాటిని స్వేశ్చగా వదిలేయ్ అని చెప్పింది, పాపం పుణ్యం ఎరుగని అమాయకుడైన ఇంటి యజమాని జంతువులను వదిలేసాడు, అవి వెళ్లి పోయాక ఆకలికి కూడా అలమటించి పోయాడు. 

ఏమిటే అసలు నీ ఉద్దేశ్యం, కొడుకును వెనక వేసుకొస్తున్నావు పెద్దకొడుకులు ఇద్ద రూ ప్రయోజకులయ్యారు వీడు అప్రయోజకుడు, నా దృష్టిలో వీడికి తిండి కూడా దండగ, నేను ఈ అమాయకుడిని కాదు, నా ఉద్దేశ్యం లోకంలో కి వెళితేనే బాగు పడతాడని మంచి చెడు తెలుసు కుంటాడని.


చాళ్లేండీ మీ మాటలు మన అబ్బాయి ఎక్కడికి పోడు ఇక్కడే ఉంటాడు అని గట్టిగా చెప్పింది శారద.
సరే ఈ రోజుకు నేను ఊరుకుంటున్నాను, మనవాడు ఒక చిన్న తప్పు చేసినా నేను అరచి బయటకు పంపిస్తా అప్పటికి అడ్డు పడితే మంచిది కాదు.
వేరేయ్ రామకృష్ణ సంచి తీసుకో కూరలు తీసుకు వద్దాము.

అట్టాగే నాన్న అంటూ వెనుక నడిచాడు                  

ఇద్దరూ నడచి వెళుతున్నారు అప్పుడే చక్రధర్ స్నేహితుడు శ్రీధర్ కలిసాడు, బాగున్నారండి అని అడిగాడు, వెంటనే బాగున్నాము కాబట్టే నిన్ను కలుసుకోగలిగాను, మీ అబ్బాయి ఏదన్నా ఉద్యోగము సంపాయించాడా, లేదు

నేను అన్నానని అనుకోవద్దు మీదగ్గర ఉంటే కనీసం ధైర్యంగా ఉండటం కూడా ఉండటం కూడా నేర్చుకోలేడు అన్నాడు................

ఏంచేద్దాం కాలమే నిర్ణయింస్తుంది, తండ్రిగా బాధ్యత వహించక అప్పుడు కదా, అది నిజమే అనుకో అయినా ఒక కధ చెపుతా విను        

"ఒక ధనవంతుడికి పెళ్ళికాని అందమైన కూతురుండేది. ఆయన తన బంగళా వెనుక ఒక కొలనులో భయంకరమైన మొసళ్ళను పెంచేవాడు. ఒక రోజు ఆయన పెద్ద పార్టీని ఏర్పాటు చేసి చాలా మందిని ఆహ్వానించాడు. అందులో ఇలా ప్రకటించాడు.... “ఇక్కడున్న యువకులందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరైతే ఈ సరస్సులో దూకి మొసళ్ళ నుండి తప్పించుకుని బయటకు ఈదుకుని వస్తారో వారికి నా కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను లేదా ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను”. ఆయన మాటలు పూర్తి కాక ముందే ఎవరో నీళ్ళలో దూకిన చప్పుడైంది. నీళ్ళలో ఒక యువకుడు తన శాయశక్తులా ఈదుతూ వస్తున్నాడు. పార్టీకి విచ్చేసిన అతిథులంతా అరుస్తూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. చివరికి చిన్న చిన్న దెబ్బలతో, చిరిగిపోయిన చొక్కాతో అవతలి ఒడ్డుకి చేరుకున్నాడా యువకుడు.... ఆ ధనవంతుడు ఆశ్చర్యంతో దగ్గరికి వచ్చి ” నాకు నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. పరమాద్భుతం.... ఇది ఎవరూ పూర్తి చేస్తారని అనుకోలేదు. కానీ నేను మాట తప్పను.
చెప్పు. నీకు మా అమ్మాయి కావాలా? ఒక మిలియన్ డాలర్లు కావాలా?”
“నాకు నీ కూతురూ వద్దూ, ఆ మిలియన్ డాలర్లూ వద్దు....
ముందు నన్ను నీళ్లలో తోసిన వాణ్ణి చూపించండి... ..."

కధ బాగుంది అరదః మైందా, ఎందుకు అర్ధం కాలేదు, ఆ నీళ్లల్లో తోసింది కన్న తండ్రే అని తెలుస్తున్నది.
నేను చేయమని చెప్పను కొడుకుకి ధైర్యం వస్తే ఏదైనా సాధిస్తాడు అని తెలుస్తున్నది.
నాకొడుకుకు ఎందుకు ధైర్యము లేదు ఇటు రా చూపిస్తా అంటూ మార్కెట్ లోకి వెళ్ళాడు. అందరూ ఎటు పడితే  అటు పరిగెడుతున్నారు అక్కడ ఎం జరుగుతున్నదో ఇద్దరూ దూరంగా నుంచొని చూస్తున్నారు.   
     

ఆ  మార్కెట్లో అనేక షాపులు ఉన్నాయి, ఒక వైపు కూరకాయల షాపులు, ఆకు కూర షాపులు, మరో వైపు పండ్ల షాపులు ఉన్నాయి అక్కడ ఒక మూల ఒక మందుల షాపు ఉన్నది,  అక్కడే గొడవ మొదలైనది. ఒక 16 ఏళ్ళ పడుచుపిల్ల ఒక చీటీ మందులు కొన్నది, తన దగ్గర ఉన్న 2000 రూపాయల నోటు ఇచ్చింది, చిల్లర లేదు మందుల అక్కడ  పెట్టి పోమ్మా పొద్దున్నే బారం అని  గోనుకుంటున్నాడు,  ఆమె అతన్ని బ్రతిమాలాడు తున్నది,   ఎంత బతిమ లాడినా వప్పు కోవటం లేదు అప్పుడే రామకృష్ణ అక్కడకు చేరి చిల్లర ఇమ్మన్నాడు, ఇవ్వము నీ వెవరవయ్యా నన్ను  అడగ టానికి నీ దారి నీవు చూసుకో అని అరిచాడు, అప్పుడే సరిగా మాట్లాడం నేర్చుకో, నేనొక భారతీయ పౌరుడుగా అడిగే హక్కు ఉన్నది , ముందు చిల్లర తీసి ఆమెకు ఇవ్వు , ఏమిటి బాబు నీకు ఆ అమ్మాయికి ఏమిటి సంభంధం నీ దారి నీవు పోక. ఏమిటి మాటా మారుస్తున్నావు, పేలుతున్నావు అని గట్టిగా అడిగాడు అప్పుడే  పది మంది చుట్టూ మూగారు. 

Tuesday, 15 November 2016

*ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు(serial)

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనా సుఖినోభవంతు

*ఓ మనిషీ - బ్రతికి - బ్రతికించు(serial) పార్ట్ - .                 ........       
                                                                                                      

దేవి శంఖ దండకము 

సిరివలెఁ గనుముందు
రారమ్ము నీపాల - రత్నాల దీపాల
నీరేయి నీకోస - మీమేడ నేనుంచి
నీరాకకై యుంటి - నీవెప్పు డేతెంతు
వోరంగఁ వనితా

అరుణుఁడు సనె సందె
వేళయ్యె దీపమ్ము - వెల్గించి శంఖమ్ము
మేలై ధ్వనించంగ - మేఘారవమ్ముగా
రాగ కేళీవినోదుండు - కృష్ణుండు రంజిల్లఁ
బూరించుమా

లలితము హరిమోము
లాసమ్ము లందమ్ము - రాసమ్ము లందమ్ము
వేసమ్ము లందమ్ము - బృందమ్ము లందమ్ము
హాసమ్ము లందమ్ము - హారమ్ము లందమ్ము
నాశౌరికిన్ 


ఇంకా ఇలా చెప్పుకు పొట్టు ఉంటె మగవాళ్ల బుద్దులు చాలా ఉన్నాయి అన్నది,       అవునా  అమ్మా అన్న పిలుపు వైపు తిరిగి,  నీవెప్పు డొచ్చావురా కృష్ణ, మీరిద్దరూ మాట్లాడు కొనేటప్పుడే వచ్చాను. అంతా మగవాళ్ల గురించి చెప్పావు మరి ఆడవాళ్ళ గురించి చెప్పవా అమ్మా, నే నెందు కురా చెప్పేది, నీకు పెళ్ళిచేస్తే తెలుస్తుంది అన్నది.

అంత పని చేయకమ్మ నాదారి నన్ను ఇలా బతకని అని, అమ్మ మనం పంచుకుంటూబ్రతకాలమ్మ, తిట్టు కుంటూ కొట్టు కుంటూ బ్రతుకు బ్రతుకే కాదు కదమ్మా, అందుకే నేను నవ్వుకుంటూ బ్రతికి బ్రతుకులో సంతోషము బలము ఉంటాయి కాదమ్మా  బాబు. ఇంకా చెప్పు  అన్నది తల్లి.

మనం నేర్చుకున్న విద్యను  నలుగురికి పంచాలి, అవును కదా
అసలు నీవు ఎం నేర్చుకున్నావో నాకు చెప్పు పంచె విషయము తరువాత చూద్దాం.
అదికాదమ్మా మంచి తలపుతూ మనం ఉంటే అంటా మంచి జరుగుతుంది కాదామ్మా అవును రా నాకు ఒక కదా గుర్తుకు వస్తున్నది చెప్పా మానవమ్మా చెప్పు .

ఒక గురువుగారు ధర్మ బోధ చేద్దామని దేశ దేశాలు తిరుగు తున్నారు, ఒక గ్రామా చేరారు అక్కడ ఉన్న వారందరు నోరు తెరిస్తే చెడు  మాటలు, తేడా వస్తే కత్తులు దూసుకుంటారు వారికి భయమనేది  లేదు.  వాళ్లతో గురువుగారు ఈవిధముగా చెప్పారు మీరు  " ఈ పల్లె తల్లి లాంటిది ఊరు విడిచి ఎక్కడకు వెళ్లకండి " అని చెప్పి వేరో గ్రామానికి బయలు దేరారు ఆగ్రామంలో దయ   సంస్కారం ఉట్టి పడుతున్నది ఒకరి కొకరు కలసి మెలసి పిడికెడు గింజలనే పంచు కొని తింటున్నారు, తగువులు  లేవు అక్కడ గురువుగారు అక్కడ ప్రజలతో ఈ విధముగా పలికారు  " ఎంతకాలం ఈ ఊరు ల్లోనే ఉంటారు దేశమంతా విస్తరించండి అని భోదించారు. ఇదమ్మా కధ

ఒక చోటా ఒక విధముగా మరోచోట మరోవిధముగా చెప్పేవారు గురువెట్లా అవుతాడు అన్నది తల్లి.
చూడమ్మా మొదటి గ్రామం వారు అశాంతి అహంకారాన్ని పంచుకుంటుంన్నారు వారు ఆగ్రా మంలో ఉంటేనే మంచిది, వారు వేరేచోట వచ్చారనుకో అందరిని చెడ గొడతారు.  రెండవగ్రామ వారు దయార్ద్ర హృదయులు  వీరు మంచిని మానవత్వాన్ని పంచుతారు  ఒకే చోట ఉండేకన్నా దేశం మొత్తం ఉండుట మంచిది అని ఆవిధముగా చెప్పారు పంచుకోవటమంటే ఇదేనమ్మా.  

అప్పుడే వంట గదిలోకి వస్తు చక్రధర్ ఏమిటి వీడు కధలు చెపుతున్నాడా, అవి మీరు వింటున్నారా ఎందుకు మీకే మంన పనికొస్తాయి మీ పనికి కూడా అడ్డం వస్తున్నాడు ఇలాంటి వా డు ఇంట్లో ఉండటమే దండగా, ఎన చెప్పినా,   వీడు మారడు వీడేదో గొప్పవాడను కుంటున్నాడు, దేశాన్ని ఉద్దరించాలను కుంటున్నాడు, కలలు కంటున్నాడు ఈ ఒకరోజు ఒక్క మూడువందల రూపాయలు సంపాయించి తెమ్మని చూస్తాను అని గట్టిగా కొడుకుతో అన్నాడు, అదేమాటమీయుడ ఉండు నాన్న నేను ఇప్పుడే ఇంటి నుడి బయటకు వెళ్లుతున్న రేపు యిదే టైం కు నేను సంపాయించి తీసుకోని వస్తా అని కోపంతో నడిచాడు బయటకు రామకృష్ణ.

ఏమిటండి మీ పంతము మీరు అట్లా రెచ్చగొడతారు వాడు ఎలా బ్రతుకు తాడండీ అని కన్నీరు పెట్టు కున్నది శారదా.
అవునే వాడికి చదువు లేదుకాని మంచి తెలివి ఇచ్చాడు ఆ దేవుడు,   మనమధ్య ఉంటె వాడు చెడి పోతాడు, వాడు దేశానికి ఉపయోగపడాలి అదే నా ఆశా అన్నాడు.
మరీ అణా కఠినంగా ఉండాలా
అవునే బంగారము ఆభరణాలుగా మారాలంటే సమ్మెట పోటు అప్పడు కదా, బట్టలు తెల్లగా రావాలంటే బండకేసి బాదాక తప్పదు కదా
అనారోగ్యులకు ఉత్త్సాహతో కధలు చెప్పి ఆరోగ్య వంతులుగా మార్చాలి, బద్దకస్తులకు బలమైన కారణం చూపి బలోపేతం చేయాలి. కార్య సాధకుడిగా మార్చాలి అని అన్నాడు.

ఇదిగోనండీ కాస్త కాఫీ త్రాగండి
అమ్మ నాన్న నన్ను ఆశీర్వదించండి నేను ఈరోజు బయటకు పోయి రేపు కనిపిస్తా అని చెప్పాడు . ఇదిగో బాబు నీవుకూడా కాఫీ త్రాగి సత్యమార్గము ఎప్పటికి మరువకు అదే నీకు తల్లి అదే నీకు తండ్రి అదే నీదేశం అని మరువకు.                                                                                    
  
ఓ మనిషి సాగిపో
ఓ మనిషి స్వేశ్చ, ధైర్యముతో సాగిపో
చీకటిని తరిమే వెలుగుతో సాగిపో
స్వార్ధాన్ని జయించి,.కోరికలకు చిక్కక సాగిపో  

బంధాల నుండి,  పంజరం నుండి విముక్తి చెందావు
స్వేశ్చగా విహరించే శక్తి నీకు ఉన్నది
నీలో ఉన్న చీకటిని తరిమై, వెలుగును నింపుకొని సాగిపో

స్వార్ధాన్ని జయించి, సృష్టిలో ఉన్న ప్రతివస్తువు
ఉపయోగాన్ని తెలుపుతూ సాగిపో
అందరిలో వెలుగు నింపి తూ సాగిపో  

ఓ మనిషి స్వేశ్చ, ధైర్యముతో సాగిపో
చీకటిని తరిమే వెలుగుతో సాగిపో
స్వార్ధాన్ని జయించి,.కోరికలకు చిక్కక సాగిపో  

అలా సాగిపోతున్నాడు తను ఉన్న ప్రాంతము నుండి మరో ప్రాంతానికి, బ్రతుకు తెరువు కోసం, బతికి బతికించటం కోసం కదులు తున్నాడు రామకృష్ణ .

ఒక వీధిలో జనం పరిగెడుతున్నారు,  ఏమి అర్ధం కాలేదు, ఒకతన్ని ఆపి అడిగాడు అక్కడ ఏమిజరిగిందని.

అక్కడ ఇప్పుడే ఒక పెద్దకొట్లాట జరిగింది, ఒక కారులో పోతున్న వ్యక్తిని ఆపి మరి దించి, కర్రలతో ఇష్టం వచ్చినట్లు బాది, వెళ్లి పోయారు, అతడు బతికి ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఎవరు ముందుకు వచ్చినా ఇదే గతి అని హెచ్చరించారు వారు, ఎవరికివారు పరుగెత్తారు అన్న విషయం చెప్పాడు. అప్పుడే కొందరు వ్యాన్ లో వెళ్లి పోయారు.

నడి రోడ్డులో పడి ఉన్న అతన్ని చూసాడు రామకృష్ణ, వెంటనే అక్కడ ఉన్న కారులో ఎక్కించుకొని ప్రక్కనే ఉన్న హాస్పటల్ చేర్చాడు. జేబులో ఉన్న లైసన్సు కార్డును బట్టి, సెల్లుబట్టి  ఇంటి అడ్రస్సుకు ఫోన్ చేసాడు, వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉండాలని నిర్ణయించాడు, అతని జేబులో ఉన్న పైకాన్ని హాస్పటల్లో కట్టాడు.

బ్లడ్ తక్కువ ఉంటె తన బ్లడ్ గ్రూప్ కలిస్తే బ్లడ్ ఇవ్వటానికి ముందుకు వచ్చాడు, తనాపేరు రామకృష్ణ అని చెప్పాడు. హాస్పటల్ ల్లో చేర్చిన వ్యక్తి తరుఫున వారు వచ్చినట్లు గమనించాడు.

అప్పటికే చీకటి పడింది, ఇక అక్కడ ఉండుట అవసరము లేదనిపించి ఇంటిముఖం పట్టాడు, అప్పటికే అర్ధరాత్రి దాటింది, తలుపుకొట్టగా తల్లి వచ్చి తీసింది, ఏమీ మాట్లాడకుండా తనగదిలోకివెళ్ళి నిద్రపోయాడు రామకృష్ణ.

మరునాడు పొద్దున్న టివి. వార్తలు వస్తున్నాయి, అజ్ఞాత వ్యక్తిని నడి బజారులో కొట్టినట్లు మరో అజ్ఞాత వ్యక్తి  హాస్పటల్ ల్లో చేర్చి రక్తము లేకపొతే   రక్తమును ఎక్కించి  సహాయము చేసినట్లు హాస్పటల్ వారు చెప్పారు, ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని దుండగులు కొట్టినట్లు, ఈ వ్యక్తి రక్షించినట్లు తెలిసింది, పూర్తి వివరాలు త్వరలో తెలుసుకోగలరు అని ముగించారు.   

ఏమండి మీ స్నేహితుడు శ్రీధర్ ఫోన్ చేస్తున్నాడు, తీయండి, ఏమిటే పొద్దున్నే ఈ ఫోన్ ఏమిటో విశేషము అవునూ మనఅబ్బాయి వచ్చాడా అని అడిగాడు.
ముందు ఫోన్ తీయండి దేనికోసమో ఏవిషయము చెప్పాలనుకున్నాడో తెలుసుకోండి అన్నది భార్య శారదా .

సరే ఫోన్ ఇవ్వు అన్నాడు హలొ హలో అన్నాడు
చక్రధర్ యేన మాట్లాడేది అని అడిగాడు, అవును నేను మాట్లాడేది సరే చెప్పు శ్రీధర్ ఏమిటి విశేషము, ముందు టి.వి చూడు మీ అబ్బాయి ఫోటో చూపిస్తున్నారు అన్నాడు
అవునా అవునా
అవును
చూడు
శారదా టివి ఆన్ చేయ్  మన పుత్రుడు ఎదో ఘనకార్యము చేసాడట చూద్దాం అన్నాడు చక్రధర్. అప్పుడే టివి లో చూపిస్తున్నారు రామకృష్ణ అనే ఈ వ్యక్తి దుండగులనుండి రక్షించి, తనరక్తం దానం చేసి మరీ వెళ్లినట్లు హాస్పటల్ వారు తెలిపారు, రక్షక భటులు దుండగులను పట్టుకున్నట్లు తెలిపారు. అజ్ఞాత వ్యక్తి ఎవరోకాదు పేరున్న వ్యక్తి అగు రామారావు గారి కొడుకు, ఆయన హాస్పటల్ ల్లో చేర్చి న వ్యక్తికీ బహుమతి ప్రకటించారు. మాకు సహకరించిన అజ్ఞాత వ్యక్తి రామకృష్ణ కు  బహుమతి ఇస్తున్నారు, ఎక్కడవున్నాతీసుకోగలరని కోరుతున్నాం అని టివిలో చుపుతున్నారు.

ఆప్రకటన చూడగా ఒకవైపు భయము, మరోవైపు సంతోషము వచ్చిన ఎటువంటి హావభావాలు ప్రకటించకుండా చక్రధర్ ఇట్లా చెప్పాడు, ఇప్పుడు మీకు చూసినది మరచిపోండి, అదేదో దుండగుల గొడవలాగా ఉన్నది, ఈరోజు రామకృష్ణ కు తెలపకండి, మనకు ఇప్పుడు బహుమతి అవసరంలేదు,  వాడు ఎటు వెళ్లిన ప్రశ్నించకండి.

మీరందరు ఒకరోజులో ఎంత సంపాదించావు అని మాత్రం అడగండి, నేను కూడా ఇదే అడిగి ఒక వారం రోజులు సమయము ఇస్తాను అప్పటిలోపు ఏదోవిధముగా డబ్బు సంపాదించ మందాం, రెచ్చగొట్టే మాటలతో వేదించకండి, నేను కూడా ఏమీ మాట్లాడను, వాడు లేవగానే ఆందరం కలసి భద్రాచలం పాపికొండలు చూసి వద్దాము అన్నాడు చక్రధర్ .

కుటుంబము అందరూ కలసి భద్రాచలం, పాపికొండలు చూడటానికి బయలు దేరారు వారు.                     
          
సప్తాంగములతో కూడిన రాజతంత్రమందు మిత్రునకు స్థానమున్నది. అట్లే రాజునకున్న బలములలో మిత్రబలమొకటి. ఒక మహారాజ్యాధిపతితో యుద్ధము చేయవలసిన రామునకు మిత్రబలము అవసరమై ఉన్నది. రాముడు రావణునిపై దండెత్తనున్నాడని తెలిసిన సీత “రాముడు మిత్రులను సంపాదించెనా?” అని హనుమంతుని ప్రశ్నించినది. శాపవిముక్తిని పొంది, దివ్యుడైన కబంధుని ద్వారా రాముడు సీతావృత్తాంతము నెఱుగదలచినను, కబంధుడు – సీత ఉన్న స్థానము తనకు తెలియునో, తెలియదో కాని ఆ విషయమును స్పృశింపక, రాముడున్న స్థితిలో ఆయనకవశ్యకమైన దానిని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు-“రామా! నీవు భార్యను పోగొట్టుకొని దుర్దశలో నున్నావు. ఇట్టి స్థితిలో యున్న నీకు మంచి స్నేహితుడు కావలసి ఉన్నది. అట్టి మిత్రుని సంపాదింపక నీ కార్యము సిద్ధిపొందునని నేను తలంచను” (అర.౭౨-౯,౧౦) అని సుగ్రీవుని రామునకు మిత్రునిగా నిర్దేశించినాడు. కబంధుడు దివ్యుడగుటవలన ఒకవేళ సీత ఉన్న స్థానమును తెలిసి రామునికెఱింగించినను, దానివలన ఆయనకంత ఉపయోగముండదు. సీతను సాధించుకొనుటకు ఆయన వేఱు ప్రయత్నము చేయవలసియుండును. అందుకే మహాఫలరూపమగు మిత్ర సంపాదనమునకై రామునిని ప్రేరణ చేసినాడు కబంధుడు.
అయితే రాముని కార్యము నెఱవేరుటకు- రాజు, సైన్యవంతుడు, బలవంతుడు అయిన వాలిని చూపక – దుర్దశలో ఉన్న సుగ్రీవుని ఏల చూపినాడు? తనకు సూచించినవాడు తనవలె దుర్దశా పీడితుడని ఎఱిగి రాముడు దానికెట్లు సమ్మతించినాడు? దుర్దశలో ఉన్నను స్థిరచిత్తుడు మైత్రికి అర్హుడని ధర్మశాస్త్రమిట్లు చెప్పుచున్నది -” అప్పుడు బలహీనుడై ఉన్నను, మీదటికి వృద్ధినందునట్టి స్థిరచిత్తుడగు శాశ్వతమిత్రుని పొంది వృద్ధినొందినంతగా రాజు, సువర్ణ భూమ్యాది లాభములవలన వృద్ధినందడు”(అధ్యా.౭- ౨౦౯, మనుస్మృతి). తుల్యావస్థలోనుండి పరస్పరసాయమపేక్షించు వారి స్నేహము దృఢతరముగా నుండును. అట్టి స్థితిలో ఉన్నను వారిలో ఒకరుగాని, ఇరువురుగాని దుర్జనులైనచో అక్కడగూడ స్నేహముండదు. అందుకే “ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు,తృప్తిపడువాడు, ప్రేమశీలి, నిలకడగలవాడు అయిన మిత్రుడు శ్రేష్ఠుడు. అట్టివానిని సంపాదింపవలయును”( అధ్యా.౭ – ౨౦౯, మనుస్మృతి) అని శాస్త్రము నిర్దేశించుచున్నది. కావుననే “సత్యసంధుడు, వినయశీలి, ధైర్యశాలి, మతిమంతుడు, సమర్థుడు, ప్రగల్భుడు, కాంతిమంతుడు, బలపరాక్రమవంతుడు”(అర.౭౨-౧౩,౧౪) అయిన సుగ్రీవుని మిత్రునిగా కబంధుడు సూచించినాడు.

చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు రామకృష్ణ ఇంట్లో వారి అందరిని పిలిచి ఈవిధముగా చెప్పటం మెడలు పెట్టాడు రామకృష్ణ .

నామకరణం చేసేటప్పుడు ఎలా......
నామకరణం పేర్లు.. పెట్టాల్సినవి..పెట్టకూడనివి..
మీకు అమ్మాయా..అబ్బాయా? ఏం పేరు పెట్టారు? ఏదో ఒక పేరు.. పేరులో ఏముంది..! అంటారా? గులాబీని మరోలా పిలిస్తే మాత్రం దాని గుబాళింపు తగ్గుతుందా? - అంటారు షేక్ స్పియర్. కరెక్టే. కానీ ఇది చేతన్ భగత్ కాలం. మోడ్రన్‌గా ఉండాలి. పేరులో ఏముంది అంటే.. కుదరదు. నేమ్‌లోనే ఫేమ్ ఉంది. పిల్లలు పుట్టకముందే స్కూల్లో సీటు రిజర్వ్ చేసుకునే జమానా ఇది. అలాంటిది పిల్లల నామకరణం విషయం అంత లైట్ తీసుకుంటుందా ఈ జనరేషన్? కదా. మరి పెట్టాల్సిన పేర్లు.. పెట్టకూడని వాటి గురించి మీకు తెలుసా? sontoshamatha
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అన్నారు. కానీ పేరు మంచిదయితే మనిషి మంచోడవుతాడు అని ఎవరైనా అన్నారా?- ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే మీరింకా 1947 మోడల్ బ్రెయిన్‌నే వాడుతున్నారన్నమాట. అందుకే ప్రపంచం ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్)లో ఉంటే మనం ఇంకా మూడో తరం(3జీ)లోనే ఉన్నాం. ఈజిప్టులో ఒక పాప పేరు.. ఫేస్‌బుక్. ఈజిప్టులో ఉద్యమానికి ఫేస్‌బుక్ ఎంతటి మౌస్ అందించిందో తెలుసా? అందుకే.. ఆ స్ఫూర్తితో పాపకు పేరు పెట్టుకున్నారు. చూశారా.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ వెలిగినట్లు.. అక్కడ పాపకు పేరు పెడితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. అదే మరి పేరుకున్న గొప్పదనం. అందుకే పిల్లల నామకరణం విషయంలో ఇవి తెలుసుకోవాలి.
ధర్మ శాస్త్రం ప్రకారం..
హిందూధర్మంలో నామకరణ మహోత్సవం అనేది పుట్టిన ప్రతివ్యక్తికీ చేయాల్సిన ఒక సంబరం. ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా షోడశ సంస్కారాలలో పుంసావన కర్మలు ముఖ్యమైనవి. ఇందులో బారసాల ఇంకా ముఖ్యం. బారసాల నాడు పెట్టిన పేరు అన్ని విధాలా మంచిది. కొంతమంది శిశువు పుట్టినప్పుడు ఉన్న నక్షత్రం ప్రకారం ఆ నక్షత్రానికి కలిసే అక్షరంతో పేరు పెడతారు. కానీ అలా పెట్టాల్సిన అవసరం లేదు. బిడ్డపుట్టిన తర్వాత బారసాల నాడు బియ్యంలో నక్షత్ర నామం, సంవత్సర నామం, వ్యావహారిక నామం అని మూడు పేర్లను రాస్తారు. అందులో మిగిలిన రెండింటికీ అంత ప్రాధాన్యత లేకపోయినా వ్యావహారిక నామానికే ప్రాధాన్యత. అందుకని ఏదైనా అవసరం ఉండి పేరు మార్చుకున్నా, అది నామమాత్రానికే కాని ఆ పేరుతో చేసే ఏ పూజలు, పనులు ఫలించవు. నిత్యనైమిత్త కర్మలన్నింటికీ ఆ పేరే వాడాలి. పేరు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. నామకరణ మహోత్సవంలో మంచి తిథిని, అనుకూల సమయాన్ని చూసి పేరు పెడతారు. అందుకని ఆ పేరుతో పిలిస్తే ఆపేరు వల్ల కలిగే లాభనష్టాలు, పాపపుణ్యాలు అతనికి ప్రాప్తిస్తాయి అని చెప్పారు ప్రఖ్యాత జ్యోతిష్య పండితులు, వేద పండితులు ఒజ్జల విఠల శాస్త్రి.
పెట్టాల్సినవి..
అమ్మాయి పుడితే బేసి సంఖ్య అక్షరాలు వచ్చేలాగా, అబ్బాయి పుడితే సరిసంఖ్య అక్షరాలు వచ్చేలా పేరు పెట్టాలి. దీని వల్ల వారికి స్మృతి, స్తుతి, సదాచార సంపన్నత అలవడతాయి. అలాగే పెట్టే పేరులో సున్నా ఉండవద్దు అనే నియమం కూడా ధర్మశాస్త్రం, శాంతుల కమలాకరం అనే గ్రంథాలలో ఉంది. ఇది అభివృద్ధి నిరోధకం. ఇప్పటికాలంలో చాలామంది పేరు ట్రెండీగా ఉండాలని, కొత్తగా ఉండాలని ఎలాంటిది పడితే అలాంటి పేరు పెడుతున్నారు. భగవంతుని పేర్లు, పెద్దల పేర్లు కలిసేలా పేరు ఉండాలి. పేరు పెట్డడం వల్ల అందరూ పదేపదే ఆ పేరుతో పిలుస్తారు. దాని వల్ల భగవన్నామ స్మరణ జరిగి పుణ్యం వస్తుంది. కానీ ఇప్పుడు అలాంటి పేర్లు పెట్టుకోవడానికి చాలామంది నామోషీ పడుతున్నారు. దేశాల ఆచారాల ప్రకారం పెద్దల పేర్లను పెట్టే సాంప్రదాయం కూడా ఉంది. ఆంధ్రప్రాంతంలో తాత సరే వారిపేరు పెడితే తెలంగాణ ప్రాతంలో చనిపోయిన పెద్దల పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు. పేరుపెట్టడంలో కూడా ఆంధ్ర ప్రాంత వాసులు పదకొండవ రోజు తొట్టెలలో తెలంగాణలో 21వ రోజున వేస్తారు. ఇలా సంప్రదాయలలో తేడాలు ఉన్నా ఈ వేడుకను వైభవంగా చేస్తారని దత్తోపాసకులు మాల్లాది చన్ద్రశేఖర సిద్ధాంతి.
పెట్ట కూడనివి..
పేర్లు మార్చుకుంటే కలిసొస్తుందనేది నేను సమర్థించనంటారు మైలవరపు శ్రీనివాసరావు. అది కేవలం మూఢనమ్మకం మాత్రమే. ఒకసారి పెట్టిన పేరును మార్చడానికి వీలు లేదని శాస్త్రంలో గట్టిగా చెప్పబడింది. కానీ ఈవిషయం తెలియక చాలా మంది పేరు మారిస్తే కలిసొస్తుందని అనుకుంటున్నారు. మన మనసు దేనిపట్ల అయితే పాజిటివ్‌గా ఆలోచిస్తుందో దాని పరంగానే జీవితం నడుస్తుంది తప్ప పేరును మార్చేసుకున్నంత మాత్రాన జీవితం మారిపోదు. ఇంకా కొంతమందైతే సీత, రాముడు, హరిశ్చంద్రుడు ఇలాంటి వారిపేర్లను పెట్టుకుంటే జీవితాంతం కష్టాలొస్తాయి అనే అపోహలో ఉండిపోతున్నారు. కానీ వారందరూ తమ తమ కార్యాలతో విజయాన్ని సాధించిన వారే. వారిపేరును పెట్టుకొని స్మరిస్తే మనకూ పుణ్యం. నక్షత్రాల పేర్లు, చెట్టుపేర్లు, నదుల పేర్లు పెట్టకూడదని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఏ పేరుతో పిలిచినా సరే, మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేలా కృషి చేయాలి. నలుగురిలో ఒకడిగా కాకుండా అందరికోసం ఒకడిగా ఉండాలి. మంచిపేరును ఎంచుకోవడం మంచి పేరు తెచ్చుకోవడమే ముఖ్యం అని చెప్పారాయన.
నామ ధ్యేయం
ఏ : ఏ అక్షరంతో పేరు ఉన్నట్లయితే మీరు నమ్మదగిన వ్యక్తులు. అందం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. స్వతంత్ర భావాలు కూడా మీ సొంతం. మీకు సాహసాలు చేయడం అంటే ఇష్టం.
బీ : మీకు భావోద్వేగాలు ఎక్కువ. మీకు ధైర్యం కూడా ఎక్కువే. విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు.
సీ : పోటీతత్వం, నైపుణ్యం మీ సొంతం. స్వతత్ర భావాలుంటాయి. మంచి మాటకారులు. చెప్పదలుచుకున్న విషయాన్ని సాగదీయకుండా స్పష్టంగా చెప్పగలరు.
ఈ: కలుపుగోలుగా మాట్లాడతారు. స్నేహితుల సంఖ్య ఎక్కువే. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు.
ఎఫ్ : మీరు మంచి ప్లానర్ అని చెప్పవచ్చు. ప్రతి పనిని పక్కాగా ప్లాన్ చేసుకుని ముందడుగు వేస్తారు.
జీ : ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానికోసమే ప్రయత్నిస్తుంటారు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు.
హెచ్ : సృజనాత్మకత మీ సొంతం. తమను తాము నియంత్రించుకోగలరు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే.
ఐ : మీరు సాహసవంతులు. ైస్టెలిష్‌గా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. సృజనాత్మక పట్ల మీకు ఆసక్తి.
జే : లక్ష్య సాధన కోసం చాలా పోరాడతారు. మేథస్సు కలిగి ఉంటారు.
కే : కాస్త ఎక్కువగా సిగ్గుపడే వ్యక్తులు మీరు. అందరితో కలిసి ఉండాలని అనుకుంటారు.
ఎల్ : వీరు ఆకర్షణీయంగా ఉంటారు. డబ్బు, హోదా కలిగిన కెరీర్‌ను ఎంచుకుంటారు. కష్టపడే తత్వం మీది.
ఎమ్ : ధైర్యం, తెలివి, హార్డ్‌వర్క్ మీ సొంతం. మంచి నమ్మకస్తులు. సున్నితమైన మనస్కులు కూడా. మీ మనసు ఎవరైనా గాయపెడితే ఇక తిరిగి వారిని పట్టించుకోరు.
ఓ : ఓ అక్షరంతో పేరు మొదలయ్యే వారు వివేకవంతులని చెప్పొచ్చు. నీతి నిజాయితీ వీరికి ఉండే అదనపు లక్షణాలు.
పీ : మీరు చురుకుగా, జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. సృజనాత్మకత కలిగి ఉంటారు.
క్యూ : మీరు రచయితలుగా లేదా వక్తలుగా రాణించగలరు. ట్రెండ్‌ను ఫాలో అవ్వాలని అనుకోరు.
ఆర్ : నమ్మకం, జాలి, దయ వీరి సొంతం. ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. ఉల్లాసంగా ఉండడానికి ఇష్టపడతారు.
టీ : టీ తో పేరు స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎప్పుడూ బిజీగా ఉండడానికే ఇష్టపడతారు.
యూ : మీరు ప్రతిభావంతులుగా రాణిస్తారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు.
వీ : మీరు విశ్వాసపాత్రులు. డైనమిక్ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనినీ పక్కాప్రణాళికతో అమలు చేస్తుంటారు.
డబ్ల్యూ : మీరు గ్రేట్ లవర్స్‌గా ఉంటారు. మీ మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం.
ఎక్స్ : ఎక్స్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. శాంత స్వభావులు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే తత్వాన్ని కలిగి ఉంటారు.
వై : మీ పేరు వై అక్షరంతో ప్రారంభమైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సాహసకృత్యాలు కూడా వీరికి ఇష్టమే.
మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆంగ్లంలో మీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో దాన్ని బట్టి తెలుసుకోవచ్చు.
డీ అక్షరంతో పేరు ప్రారంభం అయ్యేవాళ్లకి ఆత్మైస్థెర్యం ఎక్కువ. వ్యాపారం చేయాలని అనుకుంటారు. శుభ్రత విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఎవరికైనా చేతనైనంత సహాయం చేయాలనే స్వభావం కలిగి ఉంటారు.
ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభం అయిన వారు సృజనాత్మకత కలిగి ఉంటారు. కళాత్మక ప్రతిభ కూడా మీ సొంతం. విరామం తీసుకోవడానికి ఇష్టపడరు. ప్రతీ పనిలోనూ పర్‌ఫెక్షన్ కోరుకుంటారు.
మీ గ్లామర్‌తో అందరినీ ఆకర్షిస్తారు. ఏదైనా పని ప్రారంభించాలంటే దానికి ముందు చాలా అలోచిస్తారు. టైమ్‌సెన్స్, పక్కాప్రణాళికను కలిగి ఉంటారు. నిజాయితీ, ఆగ్రహం కూడా ఎక్కువే. రాజకీయవేత్తగా లేక ఏదైనా ప్రత్యేక రంగంలో మీదైన ముద్రవేస్తారు.
వీరు మంచి మాటకారులుగా ఉండి ఎదుటి వారికి ఎప్పుడూ సలహాలు ఇస్తుంటారు. కొన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. సలహాదారులుగా ఉండడం వీరికి ఇష్టం.
ఇవి నిషేధం
-నక్షత్రాల పేర్లని శిశువులకు పెట్టకూడదనేది మొదటి నిషేధం. నక్షత్రాలు 27 ఉంటే ఆ అన్నిటికీ చంద్రుడొక్కడే భర్త అయిన కారణంగానూ, నక్షత్రనామాన్ని శిశువుకి పెడితే ఆ స్త్రీ శిశువుకి సవతి దోషం పట్టవచ్చుననే భయంతో నక్షత్రనామాన్ని పెద్దలు
-నదుల పేర్లు పెట్టకూడదనేది రెండో నిషేధం. నదులెన్ని ఉన్నా వాటన్నింటికీ సముద్రుడే భర్త. అందుకే నదుల పేరు అమ్మాయిలకు పెడితే సవతి దోషం ఉండొచ్చని నిషేధించారు.
-తీగల పేర్లు, చెట్ల పేర్లు కూడా పెట్టకూడదనేది మూడో నిషేధం. చెట్లు చెట్లు రాసుకుని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి, చెట్లను నరుకుతారు, గాలికి పడిపోతాయి, చీడ పడుతుంది, ఎండకీ వానకీ దిక్కూమొక్కూ లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు చందన, కేతకి, మల్లిక, మాలతి లాంటి పేర్లను పెట్టొదంటారు.
-లకారం ఓ అక్షరంతో కలిసిన అక్షరాలున్న (క్ర-క్ల..) పేరుని కూడా పెట్టరాదన్నారు పెద్దలు. ర బదులు ల పలకితే అర్థంలో భేదం రావడమే కాక, ఒక్కో సందర్భంలో అపార్థం కూడా కలగొచ్చు. ఆమ్రమనే పదానికి మామిడి పండు అనే అర్థం. దాన్ని ఆమ్ల అని పలికితే ఉసిరి అనే అర్థాన్నిస్తుంది.
-పేర్లని బట్టి కష్టాలు రావు : సీత, దమయంతి, సావిత్రి, శకుంతల.. ఇలాంటి పేర్లు పెట్టుకున్నవారికి కష్టాలు వస్తాయనే అపోహ ఉన్నది. నిజాన్ని నిజంగా ఆలోచిస్తే సీతమ్మ రామచంద్రునికి మార్గదర్శకురాలు. అందుకే పేరుని బట్టి కష్టాలు రావు.
-పేరు మార్చొకోకూడదు : పెట్టుకున్న పేరు మార్చుకోవడం, అక్షరాలని వంకరటింకరగా చేసుకుని పలికించుకోవడం.. ఇలాంటి వాటి ద్వారా జీవితగతి మారుతుందనుకోవడం భ్రమ మాత్రమే