తృణకంకణము (శ్రీ రాయప్రోలు సుబ్బారావు.)
తృణకంకణము రాయప్రోలు సుబ్బారావు రచించిన సుప్రసిద్ధమైన ఖండకావ్యం. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంపై గొప్ప ప్రభావాన్ని ప్రసరించిన భావకవిత్వ యుగంలో మొదటి రచనగా చారిత్రిక ప్రాధాన్యత కలిగివుంది. 1913లో విడుదలైన ఈ రచన ప్రబంధ బంధురమైన తెలుగు సాహిత్యాన్ని ఇతివృత్తం, శైలి, శిల్పం పరంగా గొప్ప మార్పు సూచిస్తూ నూతన యుగానికి నాంది పలికింది.
.
రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణము అనే ఖండకావ్యం 1913లో తొలిముద్రణ పొందింది.
ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో దీనిని రచించారు. ఇటువంటి కథాంశం, ఆ కథాంశం క్లుప్తత వంటివి ఒక వినూత్నమైన, ఆనాటి ప్రబంధ యుగంలో కొత్తది.
.
తృణకంకణము
(ఆంధ్ర భారతి నుండి)
.
అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చిన్కు చెమ్మటల్
మడుగులుగట్ట, మండు కనుమాలపుటెండ పడంతి యోర్తు జా
ఱెడు జిలుగుంబయంట సవరించుచు, చొక్కిన యింపుతోడ కా
ల్నడకన బోవుచుండె నెడలన్ కనుపించెడి పచ్చతోటకున్.
పసినిమ్మపండ్ల చాయలు
కొసరెడి యా కుసుమగంధి కోమలపు టొడల్,
కనుకందిన కవటా కన
వసివాడె నిదాఘతాప పరిపీడనలన్.
కన్నె గేదగి చెండునా కళుకు లొలయు
ఆ నెలంత యొడల్ నగ లేవి లేక,
జాఱు చెమ్మట ముత్యాలజంపు సరుల
సహజ సౌందర్యమును వెద జల్లుచుండె.
పదియు నారు వసంతముల్ వదలనట్టి
వయసు సొగసుందనం బామె మెయిని మెఱయ,
బాల్య మెడలిన మొలుచు జవ్వనపుమవ్వ
మొడలి యం దండముగ నుట్టిపడుచు నుండె.
నడచుదారి పురోపకంఠంబు నొఱసి
చనుచునుండె, ఆమెకు ముందువెనక నెవరు
వచ్చుచున్న జాడలును గన్పట్ట వయ్యె,
ఎచటి కేగునొ, కారణ మేమి యగునొ?
ఇసుక దిగబడు నడుగుల నీడ్చుకొనుచు,
ఉడుకు టెండకు మండునిట్టూర్పు లదర,
కాలిచల్లారు పెంపుడు కానబడిన
పడుచు జింకపడంతి నా నడుచు నామె.
ఎడ నెడ కుఱంగంటను మా
మిడి చెట్టులు కలవు, కాని మెలతుక తా నా
కడలను నిలువగ నేగదు,
నడచుచు తన నడక బడినె నలగి కలగియున్.
జిలుగుపూల కలంకారి చీర జాఱ
చిందు సందెడు కుచ్చెళ్ళు చెదరనీక,
మాటికిని కాలికడియాలు మలపుకొనుచు,
కూతవే టిటు చని చేరికొనియె వనము.
పడమట జాముప్రొద్దు కనుపట్టుచునుండె, నిదాఘశాంతి య
య్యెడు మలుసందెచిన్నెల నొకింత ప్రసన్నములయ్యె గాడుపుల్,
నడకల చొక్కిసోలిన నెలంతయలంతలు పంచుకో పఱుం
గిడె నన నామె డాయ జనియెన్ తన పెంచినలేడి యయ్యెడన్.
తన యందెల రవళిత గుఱు
తున డాసిన హరిణపుత్రి దోడ్తోగని, చ
ల్లని చెమట లూరు హస్తం
బున దువ్వుచు నిట్లు కొంత ముచ్చట నడిపెన్.
నయనమూలాంచలములు స్విన్నంబు లయిన
వేల? చెల్లెలా! యీ ప్రాలుమాలికలకు
కారణం బెయ్యది? కఠోరకంటకంపు
వనుల దిరుగవు గద చిన్నతనపుచేష్ట!
అని నగవుంబలుకుల కను
గొనలను వాత్సల్యరసము కురియగ, ఆ మో
హనహరిణంబును ముద్దిడు
కొనియెను తృణపరిమళము బుగుల్కొన మొగమున్.
నడచి బడలిన యాయాస మెడల లేదు,
చీరె చెఱగుల తడియైన నాఱ లేదు,
లేడి వరసినయపుడె ముద్దాడికొనియె,
అహహ! యెంతటిప్రేమార్ద్ర మామెమనసు!
వాలుంగన్నుల సొగసుల
లాలింపుచు తన్ను జూచు లలితకురంగిన్
కే లిచ్చి పిలిచికొను చా
నీలాలక యొక్క పోకనీడకు చనియెన్.
క్రిక్కిఱియు కొమ్మ లాశల నెక్కి చలువ
లుట్టిపడు నీడపందిళ్ళు కట్టుచుండ,
కలదు చేరువ వృద్ధవృక్షం బొకండు,
సొన యొకటి పాఱు మొద లానుకొని సతంబు
ఆ తరుచ్ఛాయ లొలసిన యంతవరకు
స్నిగ్ధసికతాతలమ్ముల చెమ్మ తేఱు,
ఎండ కన్నెఱుగక, వాననీడిగిలక
పెరిగిన కలకాపురముల బిడ్డలట్లు.
స్కంధకూలంకషమ్ముగా జాలువాఱు
పొడుపు సొనపయి ప్రాగభిముఖపు సరణి,
పూలరెమ్మల నింపు సొంపులు వహించు
శాఖ యొకటి వంతెనగాగ సాగిపోవు
గెలలు దిగిన మవ్వపు నారికేళతరులు,
పూలగుత్తులు వ్రేలాడు పొన్నచెట్లు,
మృదురవమ్ముల పిలిచెడి వెదురుపొదలు,
కన్నెగందపుమాకులున్ కలవు మఱియు.
సందె ముసలినకొలది ప్రశాంత మగుచు
చలువయును మాంద్యమును తన్ను నలమికొనగ,
త్రోవసోలింపు లెడల ప్రదోషపవన
మల్ల నల్లన వీచె నా యబలమీద.
ముగ్ధ మధురమ్మయిన లేడి ముద్దులాట,
లోల పవనాకుల లతావలోకనంబు,
పొడుపుటేటి మెలపు, జారు ప్రొద్దు వలపు,
ఆయమ నొకానొక వికార మందుత్రోసె.
చేలచెఱంగునన్ మొగముచెమ్మట లొత్తు, చెయిం బెనంచు, నీ
లాలకముల్ మొగమ్ము కవియన్ పయికడ్డము దిద్దు, మోవిపై
వ్రేలిడి యాలకించు, మురిపెంపు కనుంగవనిండ వాలికల్
తేలగ జూచు, నెద్దియు మదిం దలపోయు ననేకరీతులన్.
చిటికెనవ్రేల మేలిమి పసిండిపసల్ మిసలాడ చూడ ము
చ్చటయగు ముద్దుటుంగరము, చారుకుమారమృణాలకోమల
స్ఫుటమగు పాణిబంధమున పూన్చిన పచ్చనిపట్టుతోరము\న్,
కటకట వెట్టి యామె కడకంటి కొసల్ బలవంత మీడ్చెడిన్.
వెలది చిన్నె లనుక్షణ భిన్నభిన్న
మృదువు లయి తోపగా సాగె, నింతలోన
సొమ్మిసిల్లిన శిశువట్లు సొగసి యామె
అడుగు లొరయుచు పవళించె హరిణపుత్రి.
తెలియరాని వికారమ్ము కలతబెట్ట,
ఊర్పు విడుచుచు తాలిమి నోప లేక,
బెళుకు కాటుకకంటి చూపులు నిగిడ్చి
ఎదియొ వినబడ్డయటు లైన నెద భ్రమించి.
చెంపకు చేరెడుకన్నులు
సొంపుల సుడియంగ నా కుసుమకోమలి కే
లింపుగ చెవిచెంగట నిడి
కంపితగతి వినియె నొక్కకంఠస్వరమున్.
రుచిర వేణునాళోదయ శ్రుతుల గలసి,
పాఱు చిఱుసొన బిలబిల ధ్వనుల నణగి
కడల విననయ్యె నపుడొక క్లాంతకంఠ
గద్గదస్వర మనుతాపకలన నిట్లు:
"కాలమా! ఆస నడియాస గాగ జేసి
వేసటల ద్రోసి యాయాసపెట్ట దలతె!
వృంత మెడ సేసి, తింక లతాంత మెంత
తడవు కృశియించి సొబగులు చెడకయుండు?
నా ప్రియసఖి! అనురూప గు
ణప్రతిమ! ప్రసన్నశీల! నవనీత శిరీ
ష ప్రణయ మృదులహృదయ! క
టా! ప్రాణము లుండ యెటు విడంబడి సయితున్?
హృదయమా! ఆసయే లేదు మొదల పూల
మీద, నభిలషించితి వొక్క మృదు సుమంబు
చిరతరోత్కంఠ నెటులో సైచితివి; కాని
కాలము నిరాశ తార్చెనే గతి భరింతు!
భావభాసురమగు హృదంబరమునందు
రక్తి లిఖియించుకొంటి వే రమణి రూపు,
అదియె ముద మీక యలత కాస్పదమ యయ్యె
గ్రహణగత మైన చంద్రుని కల విధాన.
క్రమ మని అక్రమం బని పరస్పరభిన్న మదోవికార సం
భ్రమముల కొన్నినాళ్ళు వలవంతల స్రుక్కుచు తాళుకొంటి, వా
కమలదళాక్షిపై మమత; కాలమె యాసల త్రుంచివైచె, ప్రా
యమునుగ్రసించు తాపవిషమక్కట! యెక్కడిచెల్మితీయముల్!
తేటవలపులు మొలక లెత్తినది మొదలు
నిలిపితి పవిత్రరాగ మా నెలత యెడల,
తుదకు భగ్నమనోరథ దోషి వగుచు
ఏటి కారాటపడ మరులెత్తి మనస!
వలపునిండిన యకలుషభావముందు
ఎద్ది కాంక్షించి తది లభియింప దయ్యె!
కడకు ననుతాప మొకడె నీయెడల నిలిచె,
ఆమె ప్రణయ స్మరణచిహ్న మగుచు నకట!
లలిత లావణ్య పుర్ణమౌ లలన చెలువ
మొదట కన్పట్టుచుండు నెల్లెడల నాకు,
కనులు మూసినన్ విప్పినన్ కలలె వచ్చు;
పగలు రే లను భేద మేర్పడక యుండ.
నిదుర లేనట్టి రేలను నెలత! నీదు
ప్రణయ జాగరరక్తి నేత్రముల గాంతు,
నిదురపట్టిన రేల గాంచుదు సుఖంబు
స్వప్నపు టవస్థలను నీదుపజ్జ నబల!
హృదయ మోహన మయి, ప్రేమమృదుల మైన
తావకీన రీలాదాన దళపుటంబు,
మామకీన ప్రణయభంగి మధుకణములు
విడిచెడు విరక్తి బాష్పముల్ విడుచుపోల్కి.
చెలియా! యెన్నడో చేరదీసి మనలం చిన్నారినేస్తంబు, ము
గ్ధులమై యుంట నెఱుంగమైతి మపు డేఘోషన్ రవంతైన, కం
దళితస్నిగ్ధరసోదయంబగుట చేతం బిప్పు డల్లాడి యా
కులుమేయున్, బలవద్వియోగము లనుంగుంబ్రేమలన్ త్రెంపగ\న్.
ఆశాభంగ కఠోరశస్త్రికలు కోయన్ గాయముల్ గాక బా
ధాశోకంబున నేటికో కటకటల్ తాళంగ, ప్రేమ భి
క్షా శూన్యంబయి గొడ్డువాఱిన జుగుప్సాలోకమం, దేమృషా
పాశంబుల్ బిగియించె నిన్ను త్యజియింపన్ లేవు నాప్రాణమా?
తొలకరి వానచిన్కులకు దూరపుటాసల వేచు చాతకం
బులు దగతీరకార్తి తలపోతలలో తెగ, పాలురాని ఆ
వుల పొదుగుల్ వలెన్ మొగులు పూసికొనెన్ దివి, స్నేహధారవ
ర్తిలకహసింప దింపయిన దీపిక, యేమిటి కంగలార్చగన్.
అకట! వంచించె విధి మోహమా! విఫల మ
నోరథుడు వీడు నీ వింక చేర నేల?
భావమా! వేపె దేల యీ ప్రణయ కృపణు?
శూన్యమగుచు నెందేని గాంచుము ప్రశాంతి.
ఎద కృశించెడి నీ యరుంతుదవియోగ
దహన దందహ్యమానమై దైవమా! వి
కాసపతన మగు ప్రపంచకమ్మునందు
హేయ మగు కాయ మేల మోయించె దింక?
తన గుణలతలు పూచిన శోభలో యన-చిఱునవ్వు వెన్నెల చెండ్లు విసర,
తన మనోలీల కాంచిన రాగ మధు వన-పలుకు కొమ్మలు పూలపాలు పిదుక,
తన భావబంధ మందిన విభ్రమం బస-చూపులు వలపుటుచ్చులను పన్న,
తన ప్రేమభావముల్ గను నూత్న కళలన-నడలు ప్రాయంపు సన్నలను సూప
కనుల నఱవాల్చి పాతితాక్షముల తోడ-కాంచియును కాంచలేని క్రీగంటికొసలు
పెడల వాలికల్ రాల నిల్చెడు త్వదీయ-మౌగ్ధ్య మెడబాయలేదు నా మది లతాంగి!"
అని స్వగత విలాపములన్
తనికెడి హృదయంబుతోడ తరుణతనూ మో
హను డొక్క యౌవనుడు కం
చెను దాటుట చూడనయ్యె సీమంతికిన్.
మిసమిసలాడు జవ్వనపు మేలిమి మేన మునుంగు వాఱు గా
ని సొగసు సళ్ళినట్టి నలినిం దలపించెడు; ఎద్దియో రహో
స్యసన నిపీడ కానబడు నాతని చూపులయందు, ఆర్తిలా
లసహృదయంబుమాత్ర మకలంకముగా కనుపట్టు మోమునన్.
అంత నా యిరువురును అన్యోన్యముఖ వి
లోకనంబులు నెయ్యముల్ కొసరికొనగ,
పదియడుగు లీవ లావలన్ కదియ నడచి,
చిటికలోపల కలసింరుత్కటభరాప్తి.
కయికయి జేర్చి యొండొరు లొకానొకరీతిని మోదఖేద సం
శయముల నోలలాడుచు; ప్రసన్నము లయ్యు నిమీలితమ్ములౌ
నయనము లెత్తలేక, వదనమ్ముల నేనియు చూచికోక, సై
చియు సయిపంగజాలని స్పృశింపులు తోపగనుండిరయ్యెడన్.
ఆజనన బద్ధబాంధన మయిన చనువు,
చిరసమేళన కాంక్షావిశేష రక్తి,
బలవ దాశావిభంగ తాపంబు; ఆ ప
డుచుజతను నేమి సేయు నట్టుల నొనర్చె.
ఆ పగిది పెదవి కదపక,
చూపులు తమకంపు శోష సుడిపడ, నిశ్చే
ష్టాపరవశులై కొండొక
సే పచ్చట నిలువంబడిరి చిత్తరువు లనన్.
తుద కా తరుణుడు హస్తము
వదలుచు, నా పుణ్యవతి సొబంగుల మొగము\న్
మృదులేక్షణముల విలసన
మొదవింపుచు నెట్టకేని నుదిత మధూక్తి\న్.
"కుశలమే నెచ్చెలీ! అనుకూలపవన
మోహనమ్ములే యీ దినమ్ములు? మనఃప్రి
యమె సమస్తం?" బటంచు నెయ్యదియొ పలికె
నంత కంతకు గద్గద మయిన రుతిని.
అశ్రుకణీకామలీమస మయిన యతని
కౌతుకాభోగ నేత్రయుగ్మమ్ము, నపుడు
తెఱచి యుండియు కనలేని తివుట లొదవె
కలికి నవఘర్మకలుషితగండములను.
గళితవిలసన మగు మోము, ఎలుగు రాలు
పడిన కంఠము, నిర్వేదభరముదోప,
కట్టెదుట నున్న మిత్రు నుత్కంఠ నరసి
తహతహంపడు చబల నేత్రముల నెత్తి.
తమి విదారించు నవచంద్ర ధవళరోచి
రుదయములు బోని చూపులు, మృదువు లయిన
ఱెప్ప జవనిక లొత్తికొం చప్పుడపుడు
ప్రియునిపై వెల్లివిరియ త్రిప్పెను మొగంబు.
చిదికి చిదుకని వలపులన్ చెనకువగలు,
విడిచి విడువని మౌగ్ధ్యంబు వడయు లజ్జ,
సమయభరమును, వినయ ప్రసన్న బుద్ధి,
ఒకటి నొకటి మచ్చరికించు చుండ నామె
సోగకన్నులు విప్పారజూచి ప్రియును
పలుకుల హృదంతరార్థ మేర్పడగ ననియె;
అస్ఖలిత మగు ప్రేమరహస్య సూత్ర
విశద బుద్ధిన్ హృదయవాద కుశల యగుచు.
"సఖుల మనః ప్రియబంధము
లఖండము లటంచు విందు మకటా! యెటులన్
లిఖియింపక తాళితివి, న
ను ఖిన్న పడజేయుట తగునో నీకు సఖా!
పాలును మీగడల్ మెదిపి వండినయన్నము లాఱనీక యే
వేళయు తప్పకుండి తినిపించిన మోహపు తల్లి కామితం
బేల నిరాకరించితివి; ఈ సఖి, నాజననానురక్త, నే
లీల కృశింప జేసితి, చెలీ! యిట్లు లౌనె ప్రియానువర్తనల్!
శైశవంబాది నిష్కలుషముగ పెరిగి
నా మనోలీన మైన ప్రాణంపు ప్రనయ
మింత తలపోయనైతి వాద్యంతములును,
ప్రేమతత్వము వెఱిగిన వృత్త మిదియె?
విడుపు లెఱుగని కోర్కులన్, ఎడలు గనని
భావపరిచయముల, నింతవరకు తనిసి
తనయని అభేదరాగబంధములు పెనచి,
ఏల త్రెంపగ నిపుడు సుహృద్వతంస!"
అని యిటు లనుగుంగతి పై
కొన వగపులు పలికె గువ్వకుత్తుకతో నా
గుణవతి ఆకర్ణవిలో
చనముల విశ్వాసబాష్పసలిలము నిండన్.
కలిపిన గాటపుంజెలిమి కాంక్షలు పెంచగ, రేల్పవల్ తలం
పులను 'మమేకమైన' వలపుల్ కడకు\న్ కడగండ్ల పాలుగా
కలసిన జంటయందు, సఖికంఠ మటుల్ పెకలె\న్; ప్రదోషదో
హల మయి తోడనే యార్తవచోగతితోచె నిట్టుల\న్.
"నాయనుంగుజెలీ! చెలిమినానిన చిత్తమె మెత్తగిల్లు, నా
శాయతరంజనం బయి ప్రియంబు లిగిర్చిన యా దశల్ కడుం
దీయము లేమి చెప్ప! విడదీసిన రేకులపూవు చంద మై
పోయిన మైత్రి కే గతులు పో వలవంతలుదక్క నీ భువిన్.
బాలా! యేటికి మాటలెత్తి నను నొవ్వంజేసె దింకన్, వృథా
లీలాభ్రాంతి యటం చెఱుంగక వ్యధాలీనుండ నైతిన్ తుదిన్,
చాలున్ నెయ్యపుతీరుతియ్యములు, బాష్ప జ్ఞానవిద్యార్థినై
కాలంబు న్వయసున్ వ్యయించెదను సౌఖ్యంబౌను నిశ్శాంతిమై.
సరసము లైన వావివరుసల్ కలుపంగ, అభేదరాగముల్
తిరముగ పాదుకో ప్రణయలీనులమై, తుద కిట్లు దైవపుం
బరుసముచే నెడాట లలమన్, తెగత్రెంపులకస్తి కోర్చి యే
కఱకు టెడందతో గడపగాగల మి విషకాలమున్ చెలీ!
వదలని కాంక్షమై మొలకనాఱిన నెయ్యము బెంచికొన్న, నీ
హృదయము కక్కసించునలయింపులు ప్రాప్తములయ్యె; ప్రేమముల్
చెదరిన శూన్యభావము లిసీ! రుచియింపవు రక్తిలేమి, నో
ముదిద! వియోగమం దమృతమున్ విషమున్ సమవృత్తులే సుమీ.
పొరు పెఱుంగక ఒక కంచమున భుజించి,
మనసు నాటిన మమతల ననగి పెనగి,
వలచుజతలను విడదీయ తలచు నేని
ప్రేమ నలయించు సృష్టి దైవికము కాదు!
ప్రియతమం బగు వస్తుసంప్రీణనమున
ప్రాణికిని హాయి కుదురు, నాపయి ప్రశాంతి
యొదవు, నుజ్జీవ శూన్యమౌ బ్రదుకునకును
లేదు తన్మయో న్మీలనామోదసుఖము.
మృదువు లైన యస్మదునార హృదయముల ప్ర
ణయ రసోదయ మనుచిత మయిన నగును!
శుక్తి ముత్యాలు పుట్టుట చోద్యమేని,
పద్మమున తేనె యూరుట పాపమేని!
కాయ మీడ్చెడునందాక, కాల మిచ్చు
భాగధేయము లనుభవింపకయ తీర
దబల! పంచుకొన్న విధినియామములను
ఖేదమో మోదమో యగు, లేదు వేఱు.
ఉదయలక్ష్మికి నఱుత నొప్పిదము నెఱపు
మంచి ముత్యాలదండ లౌ మంచుబొట్లు
సాంధ్య కాంతా వియోగ బాష్పములు గాగ
మాఱు టెఱుగవొ సృష్టిమర్మముల సరణి!
విగతకాలుష్య ముదిత మౌ జగతి విడిచి,
కాలగతి తమ శోభ లెక్కడనొ దాచి,
శారదశశాంకవిశదనిశాంతములను
మంచు కన్నీళ్ళు గార్చవే మబ్బు లబల!
మోహనవసంతునకు మోదమును ఘటించు
మసృణ ముగ్ధం బయిన మావి పసుపుటాకు,
హిమకుమారుడు రక్తి మాయింపజేయ
డే సఖీ! కాలచపలున కేది నియతి!
సరస సాంగత్య సుఖ వికాసములకన్న
దుస్సహ నియోగ భరమె మధురము సకియ!
బాధ లేక వ్యసనరుచి బోధపడదు
చీకటులు లేక దీపిక చెలగ నట్లు.
ననుపు జాఱ జతీభావమున మునింగి,
పూలతోటలలో నున్న, పూర్ణ చంద్ర
చంద్రికలు కాయుచున్న, కాంక్షావిముక్త
హృదయము ప్రసన్న లలిత మై ముదము గనదు.
కాంక్ష నశియింపని వియోగకాలమందు
సర్పమును గాంచి భ్రమియించు సఖుల పాలి
పూలదండ యటంచును; పూలదండ
గాంచి కాలపాశం బనున్ కాంక్ష తెగిన.
విశ్వంబం దుదయించు ప్రాణి యొకటం బ్రేమించి లీలావిలా
సైశ్వరంబుల నందు, అందక కటా! అర్థించు ప్రాణప్రబం
ధాశ్వాసాంతమునన్ తదశ్రుజలదేయాప్యాయమున్, జీవిక
ష్టైశ్వర్య స్థితినిచ్చు మైత్రియె సుమీ, ఆషాఢకా దంబినీ!
నష్టమైనట్టి ప్రేమఖండముల కొక్క
సుకవి యక్షరజీవగీతికయ చాలు
సకియ! విశ్వాస బాష్పముల్ చాలు నాకు,
లేదు వేఱాస ప్రణయ వల్లీమతల్లి!
మఱువంబోకుము నెచ్చెలీ! ప్రణయరమ్యం బైన యానాళ్ల, నే
మఱుబోకించుక జీవితాంతమున ప్రేమన్ ప్రేమబాష్పాంజలిన్
మఱువంబోకుము ముగ్ధరాగపరిణామప్రాప్యవిన్యాసము ల్
మఱువంబోకుమి యీ కథన్ మఱచిపొమ్మాసర్వమున్ శాంతికై!
అని సాశ్రూక్తుల నిర్గత ప్రణయవిన్యాసంబు దోపంగ ప
ల్కినయానేస్తపుకానియాననమువాల్ క్రీగన్నులన్ చూచిచూ
డని చందంబున జూచి యిట్లనియె, గూఢప్రేమలీలావినూ
తన భంగీపరిపాటి తేటపడ, నా తన్వంగి శాంతశ్రుతిన్.
తగు నోయీ మిత్రుడ! నె
వ్వగలన్ దురసిల్ల, ప్రేమబంధము లకటా!
తెగ వోయీ తెగ ద్రెంపిన;
మిగులగ నిత్తురె మనంబు మిథ్యాభ్రమలన్!
దైవికం బగు సుకృతిని దక్క నవని
జతల ప్రేమోదయంబు సంగతము కాదు,
అందు నస్ఖలిత ప్రణయానురక్తి
చిరతపశ్శుద్ధిచే గాని దొరకబోదు.
బొంది నటించుప్రాణి వలపుల్ సుడియించినవేళ, ఇంద్రియా
ళిం దనియంప కౌతుకమలీముస మౌ, నట బడ్డ ధర్మపుం
బందము లీడ్చి యీడ్చి అనపత్యముఖాదికమైన భూతర
క్తిం దగు లూని ప్రేమరుచికిన్ వెలియౌట లెఱుంగవో చెలీ!
విషయసుఖేచ్ఛలన్ దనియ విహ్వల మైన హృదంతరమ్ము క
ల్మష మయిపోవనీక అకలంక మృదూకృతసాధనన్ మనో
విషమగతిన్ మరల్చుటె వివేకము, తన్మయమైన యార్ద్రమా
నుషదశలే కృతార్థము లనున్ కవివాణి యనంగు నెచ్చెలీ!
చైత్రుతో వచ్చు పల్లవసముదయంబు
హిమవదాగమమున నశియించునట్లె,
పడుచుదనముతో చిగురించు వలపు లెల్ల
కళు కెడలి కృశించును జరాక్రాంతదశల.
కడలితరగల నిలకడల్ గలవటోయి?
సంజకెంజాయపూతలు శాశ్వతములె?
భంగపరిణతియొకట, దుర్భరతమో వి
కారము మఱొకటను, తప్పగలదె సఖుడ!
వలపు మొగ్గలు దొడిగిన వయసుటనటి
అధిక మోహన మగుట సత్యంబె కాని;
అచిరశిథిలం బగుట విధాయకము; సుమ్మి
కలదె నైమిత్తికముల కస్థలనవృత్తి?
కలిసినయంతమాత్రమున కాదుసుమీ చెలికార! మంతరం
బుల నతుకంగ జాలిన అపూర్వపులంకెయె స్నేహమౌ, తద
స్ఖలిత సమస్తసాధనము జ్ఞానవిదగ్ధుల మార్గసూత్ర, మే
వలతినినైన ప్రేమపరిపాకము లిట్టులె యన్వయించెడిన్.
పరమ ధర్మార్థ మయిన దాంపత్యభక్తి,
స్తన్యమోహన మయిన వాత్సల్యరక్తి,
సాక్షి మాత్రసుందర మైన సఖ్యసక్తి,
పొందు నాదిమ మగు ప్రేమయందె ముక్తి,
వలపుల పూలసంకెలలు బందము లేయగ గువ్వజంట, ని
ర్మల మగు వత్సలత్వ మెద రాగిల నావుల తల్లిబిడ్డ, లే
కలుషము లేని సత్ప్రణయకాంక్షలు మేళన జేయ మిత్రముల్,
మెలగుదు రీ రహస్యమె సుమీ! కనిపించెడు సృష్టియందునన్.
మనసుచే, వాక్కుచేత, కర్మంబుచేత
కలుషితములు కాదగిన వీ వలపు లవని,
తపసుచే, తాల్మిచే, ధ్యానధారచేత
లీనమై యైక్య మీయ జాలినది ప్రేమ.
శాంతియు ప్రేమయున్ మధురరసంబులు పేశల రాగలాలిత
స్వాంతదళీపుటంబులను అయ్యవి యస్ఖలితంబు లై మనున్
అంతరముల్ పెనంచిన ప్రియప్రణయంబులు మాయబోవు, వి
భ్రాంతియె గాక ప్రేమ గలుపన్ విడదీయ నిమిత్తసాధ్యమే.
కామము లేని మేళన సుఖంబుగగ్రాలు లతానుమంబు లా
రామములందు నుండియు పరస్పరమున్ విడనాడ, వెట్టులీ
ప్రేమతపఃఫలంబును లవింప తెగించితి విప్పుడే చెలీ!
ఏమిటికీ చిరప్రణయవృంత నికృంతన పాపకర్మముల్!
నిమ్మచెట్టు లేగొమ్ము పందిళ్ళక్రింద,
పుస్తకపు పేటికలను, నా హస్తముదిత
చిత్రసూత్రమునందు వసించియున్న
దోయి! యిందాక మనప్రేమయును సఖుండ!
విసఱవోని కాంక్ష వలపించి మది\న్ మది జేర్చినట్టి సా
వాసపుపున్నెముల్ పడయవచ్చునె స్వప్నములందునేని? లీ
లాసదృశంబులైన భ్రమ లారట బెట్టనిటుల్ కుమారులే
కోసిన ప్రేమగర్భమునకు\న్ గతులెయ్యవిపో సుహృన్మణీ!
వలపులె రహస్యములు, తద్విఫలదశలు ని
గూఢములు, తదర్థములును గోప్యములు, వి
దగ్ధుల కనుభవైక వేద్యంబు లివియె;
ఏల ప్రేమ గర్భవిమర్శయిపుడు సఖుడ!
కనుల నొండొరులను చూచుకొనుటకన్న,
మనసు లవికారధారణన్ మనుటకన్న,
కొసరి 'యేమోయి' యని పిల్చుకొనుట కన్న,
చెలుల కిలమీద నేమి కావలయు సఖుడ!
భావబంధంబుగా మణిబంధమందు
తొలుత గట్టితి నీ పట్టుతోర మీవు,
విప్పెదవె యిప్పు డనుచు చూపించి, కనుల
నశ్రువులు నిండ పలుకలే దయ్యె నామె!
కనులు వాలిచి, తేటమొగమును వంచి,
సమయ నిస్పృహయై యున్న సాధ్వి నతడు,
నెమ్మిగదుర స్పృశించి, పాణిం దెమల్చి
పలుక నుంకించె నెద్దియో పలుకలేక.
అంసముల జాఱు నుత్తరీయంబు నప్పు
డవల నొత్తి, గుత్తపు కడియాల కరము
సొగసు కన్నుంగవకు నడ్డముగ పెనంచి
కొమ్మ వెన్నూత గాగ ఆ కొమ్మ లినిచె.
హృదయము లగోచరములు తన్మృదుల కఠిన
భిన్న భిన్న సంచారముల్ విశదపడని,
వేమి చెప్పంగగలమొ వాచామగోచ
రం బయిన ప్రేమ బహిరంతర వ్యవస్థ.
నిలిచిరి కొండొకవడి ని
ట్టుల నా యిరువురును సుడివడుందమి, పిదపన్
చెలియ కరంబున తోరము
వెలివఱిచె నతండు మనము వెడలింప వెతన్.
చెంత లవంగవల్లికలచే కడ లల్లి, కిశోర శాద్వలా
క్రాంతములైన పాదులకు కట్టెడు చల్లని నీరు వాఱు కు
ల్యాంతములన్ పెరుంగు తరుణార్ద్ర తృణాంకురపాళి గిల్లి ఆ
కాంతుడు వింతయైన యొక కంకణమున్ రచియించె నింపుగన్.
నవక మెడవోని తృణకంకణమును కేల
నందుకొని యామెపయి నయనాంచలములు
మరలిచి, సకియ! మన ప్రేమ మధురలాంఛ
నం బిదియె సుమ్మి! యనుచు హస్తంబు దొడిగి
ఈ తృణకంకణంబు భరియింపుము నీ మణిబంధమందు, సం
ప్రీతిని అప్పుడప్డు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న ప్రా
భాతికవేళ నీ ప్రణయ బాష్ప జలాంజలి నింత చల్లి, యే
రీతిని వాడకుండ నలరింపు, మిదే తుదివాంఛ సోదరీ!
అనుచు మొగ మావలకు ద్రిప్పె, నరుణకిరణు
డాశ మార్చినయట్టు, లా యమృత మతియు
వ్రేలి వలపుటుంగరమును వెడల దీసి
ప్రియసఖుని హస్తము నలంకరించు చనియె
వలపు నశియించియును ప్రేమ నిలువగలద
యేని, కలనైన కలుషము గాని స్నేహ
మృదు మధు రసానుభూతిని పొదలి, మనము
నీడ లట్టుల నైక్య మందెదముగాత!
అపు డదృష్ట దేవత కరమెల్ల సాచి
లలితముగ జల్లు నమృతాక్షతల విధాన
వకుళ సుకుమార తరుమతల్లికలనుండి
జలజలం బూలు రాలె నా జంటమీద.
ఆ మృదుశీలపాణి నకటా! విధిమై విడనోచి నట్టి యా
కోమలరాగసూత్రమునకున్ పరమావధి గానరామి, వీ
చీమయ మైన కాల్వ వయిచెన్ సఖుడా యమ సూచుచుండ, నే
మేమియొ పోకడల్ గనుచు నేగె న దెచ్చటికో యదృష్టమై.
పట్టుతోరంబుపై నిల్చి కట్టువడిన
చూపు లంతంతకును సాంధ్యశోభ లట్లు
వెనుదిరుగ, నొండొరుల జూచుకొనుచు వారు
నేగి రల్ల నల్లన దమ యిండ్లు సేర.
కడిగిన మృగమదపాత్రిక
విడవని పరిమళముపగిది, విధినియములన్
విడిబడియును వారల పెం
పుడు మైత్రీ సూత్ర బంధములు తెగ వవురా!

మఱువంబోకుము ముగ్ధరాగపరిణామప్రాప్యవిన్యాసము

అల్లరి ఓం శ్రీ రామ్ శ్రీ మాత్రే నమ:
సర్వేజనాసుఖినోభవంతు
హైదరాబాద్ నుండి భద్రాచలం దాకా అక్కడ నుండి పాపి కొండల ప్రాంతమున చూసిన నా అనుభవము.
నేను నాశ్రీమతి కలసి ఏవైనా పుణ్యక్షేత్రాలు చూచూద్దామని సంకల్పించాము, కానీ తెలిసినవారు, బంధువులను అడిగినా ఫలితము లేక మేమే కాళేశ్వరం కానీ భద్రాచలం కానీ పోదామని అనుకున్నాము. చివరకి భద్రాచలం పోదామనుకొని ఏ.పి. ఆన్ లైన్ లో అప్పువర్డ మరియు డౌన్ వర్డ్ ముందే బుక్ చేసాము.
ఎల్.బి. నగర్ బస్ స్టాప్ అనుకున్న సమయము కన్నా ఒక ఘంట ఆలస్యముగా బయలుదేరాము, సూర్యాపేట దాక రోడ్ బాగున్నది అక్కడనుంచి బస్సు ప్రయాణము భద్రాచలం దాకా కుదుపులతో, సడన్ బ్రేకులతో, గుంటలలో పడటం వళ్ళ మాకు అశోకర్యమును భరించటం తప్ప ఏమి చేయ లేక పోయాం. గమ్యం మాత్రం అనుకున్న సమయానికి భద్రాచలం చేరాం. అక్కడ దేవాలయము యొక్క సత్రములో రూమ్ తీసుకొని 9-11-2016 నాడు అక్కడ ఉండి శ్రీ సీతారామని సన్నిధానము ఉండి దర్శనము చేసుకొని అక్కడ నుండి పాపికొండలు చూద్దామని టాటా వారి వ్యాన్లో బయలుదేరాము బోటు బయలుదేరే ప్రాంతము భద్రాచలం నుండి గోదావారి నది ఒడ్డు 73 కిలో మీటర్లు దూరము చేరుటకు మాకు 2 గంటలు పట్టింది.
అక్కడ గంగోత్రి అనే బోట్ లో పైభాగమున చక్కగా కుర్చీలు ఏర్పాటు చేసి ఉంచారు, బోటు బయలు దేరింది పాపి కొండలు దాకా ప్రయాణము 35 కిలోమీటర్లు కనీసము గంట పైన గోదావరి జలాలపై బోటు వారు ఏర్పాటు చేసిన హాస్యపు ముచ్చట్లతో మాకు సమయమే తెలియలేదు.
బోటును ఒక ప్రక్కన ఆపి అక్కడ ఉన్న శివాలయము చూడగలరు అని చెప్పగా మేము బయలై దేరాము, బోటువీరుకూడా ఈవిధముగా చెప్పారు, అక్కడ మీరు ఒక్కసారి గంట కొట్టాలి,సెల్ ఫోన్ తీయరాదు, క్రమశిక్షణ పాటించాలని అని మాకు తెలియపరిచారు. అక్కడ ఎక్కడి నుండో జలపాతము సన్నధారగా పడటం అక్కడ మేము కాళ్ళు మొఖం శుభ్రం చేసుకోవటం, బాటిల్సులో నీరు పట్టుకోవటం, గుడి బయట పర్వత ప్రాంతములో కొందరు వెదురుతో తయారు చేసిన బొమ్మలు చూసి మాతో వచ్చినవారు కొందరు కొనుక్కొని ఆ ప్రాంతములో సెల్ ద్వారా ఫోటోలు తీసుకున్నాము అక్కడ నుండి మా బోటు మరో పదినిముషాలు బోటు నడిపించి ప్రక్కనే ఉన్న ఇసుక ప్రాంతములో మాకు బఫ్వే ప్రకారము భోజనము ఏర్పాటు చేసినారు, ఏర్పాట్లుబాగున్నాయి కానీ ఇసుకలో ఎండలో చిన్న వెదురు పందిరి క్రింద భోజనము చేసాము అక్కడ నుండి బోటులో 10 నిముషముల తర్వాత పాపి కొండలు దాకా తీసుకువెళ్లి బోటు వెనుకకు తిప్పారు ఆప్రాంతము చుట్టూ 5,6 కొండలు ఉండటం మధ్య గోదావరి ఉండటం చల్లని గాలి మధ్యన మా తిరుగు ప్రయాణము సాగింది.
1. నది ఒడ్డు నుండి బోటు వరకు ఇసుకలో నడవాలి చూపులు లేకుండా కష్టము, చెప్పులున్న కష్టము.
2. పాపికొండల మధ్య శివాలయము చేరుటకు సరిఅయిన వసతులు లేవు జాగ్రత్తగా ఇసుక నేలలో కొంత దూరము, అస్తవ్యస్తముగా ఉన్న మెట్లద్వారా వెళ్ళాలి, వయసు ఎక్కువ ఉన్న వారికి కొంత కష్టం అవవచ్చు.
3. రోజు 150 కిలోమీటర్లు వ్యాన్ ప్రయాణము తరువాత 70 కిలోమీటర్లు బోటు ప్రయాణము ఓపికతో చేయాలి.
మొత్తం మీద ఇది చూడతగ్గప్రాంతము భద్రాచలం రాముని దేవాలయము, పాపికొండలు - మీరు చూసి ఆనందించ గలరు.
ఇది కేవలము నా అభిప్రాయము మాత్రమే - ఇక సంతోషము మీదే . అందరికి ధన్యవాదములు ఇందులో పెట్టిన చిన్న వీడియోల ఫొటోలు మేము సెల్ తో తీసిన వని గమనించగలరు.

*జవాబులు
బంధాలను దూరం చేస్తున్న అందాలు
అందాలను జీవం పోసిన కొన్ని బంధాలు
ఆశలను దూరంచేసు కుంటున్నా పాశాలు
పాశాలకు దగ్గరై వదులు కుంటున్న ఆశలు
పొరసత్వం కోసం నేర్చుకున్న పాఠాలు
వారసత్వం తో వచ్చిన కొన్ని గుణ గణాలు
మానవత్వం తో నేర్చుకున్న కొన్ని లక్షణాలు
పసుత్వంతో బయట పడుతున్న భేషజాలు
వికాసం కానరాని వినోద ప్రకటనలు
విరామం లేని ఎన్నో వినోద ప్రయాణాలు
వివరం లేకుండా ఉండే మాటాల తూటాలు
విపత్తును తప్పించుకొనే విజ్ఞత రాగాలు
వర్గాల రేండు అమ్మే వారి లాభాలు
కొనేవారి తీరని తెలియని కష్టాలు
నేల నుంచి నింగి ఎగబాకే వరాలు
నింగి నుండి భూమికి చేరి జవాబులు
--((*))--
షేర్ చెయ్యండి
అమాయక వ్యక్తి 1000 రూ ..నోటుతో
(ఛందస్సు )
మెల్లగా కొంగున కట్టిన నోటును
చల్లగా షాపునకు చేరి రూకలు
ఇవ్వటం చెల్లదు అనే బ బాబులు
బువ్వకు దాచినది తెచ్చె ఇవ్వరె
పోలిసోళ్ళు ఒపికతో సజావుగ
చెప్పేనూ చెల్లని నోటును తెచ్చెవు
ఏమీచే సేడిది డబ్బులు లేకయు
గూడెంకే రూకలు ఇచ్చేది లేదున
ఏమీచేసే కడు సంబర మేటుల
బ్యాంకూవారూ దయతో సెవ చేసెను
మోదీఅచ్చా ప్రకృతీ సరిగానులె
ధన్యావాదుల్ సబబే ఇక వెల్తురు
--((*))--
* జస్ట్ రిలాక్స్
సెల్ తో ఏది కొన్నా వేస్ట్ కాదు
మాల్ లో తీసుకున్నా లాస్ కాదు
ఫాల్ సేల్సును గమనించక తప్పదు
నిల్ బోర్డు తిప్పిన బీర్ దొరకక పోదు
బుక్స్ చదువుట వేష్టు ఎప్పటికీ కాదు
కేక్స్ ఫ్రిజ్ లో పెట్టితే లాస్ కాదు
స్టిక్స్ ఎప్పటికైనా ఉపయోగించక తప్పదు
బాక్సు లో ఫుడ్ తక్కువైనా ఆకలి తగ్గక పోదు
సన్ వచ్చాక టైం వేష్టు ఎప్పటికీ కాదు
పెన్ తో మంచి పాటలు వ్రాస్తే లాస్ కాదు
ఫన్ తో మాట్లాడితే అనుమానించక తప్పదు
వైన్ త్రాగుట ఆకలి పెరుగుటకు అసలు కాదు
ఫాష్టు పోస్టు చేసిన ఎప్పటికీ వేష్టు కాదు
టెష్టు చూడకుండా ఫుడ్ తిన్న లాస్ కాదు
బెస్ట్ అని పిల్లలని ప్రోత్సహించక తప్పదు
వేష్టుగా డ్రింక్స్ త్రాగితే అల్సర్ రాక మానదు
30 .*గోవింద లీలలు
తెల్లవారాక మున్నె
నీ కొలువే కోరి
నీ సన్నిదికి చేరినాము దేవా
నీ పాదములను పూజించుటకు
సుమధుర పుష్పములను
మంగళవాద్యములతో తెచ్చినాము
ఒకటే కోరిక మాకిక
నీ బంధము మాకు శాశ్వితము చేయుము
మా మనస్సు ప్రశాంత పరుచుము
ఏ జన్మలోనూ నీ ఆరాధనను వదలము
మా మనసు నీకు తెలియక కాదు స్వామీ
నీ చరణములకు మంగళ శాసనమును
చేయుటకు నేనొక వాయిద్యము అగుదును స్వామీ
మా విన్నపాలు ఆలకించి
మా ప్రార్ధనలను స్వీకరించి
మేము పెట్టె పాయసము ఆరగించి
మా సేవలు అందుకోవా గోవిందా
--((*))--
31 * . శ్రీ కృష్ణుఁ ని లీలలు
మంగళ మని పాడ వస్తిమి
మగటిమిని చూసి మెచ్చ వస్తిమి
మంగళమని ముంగిట నిలబడితిమి
మంగళ వాద్యములతో మంగళమంటిమి
లోకములను ఆవరించిన
నీ పాద పద్మములకు మంగళం
ధనుర్భాణములతో రాక్షసులను
సంహరించిన కరములకు మంగళం
ఒక్క తృటిలో శకట దైత్యుని
నేలపై పడునట్లు చేసిన కీర్తికి మంగళం
ఇంద్రుని శక్తికి అడ్డుగా గొల్ల కొండని
ఎత్తి ప్రజలను రక్షించిన గుణమునకు మంగళం
మడుగులో ఉన్న సర్పమును
గర్వమడిచి, నాట్య మాడి సంహరించి
ప్రజలను రక్షించిన కృష్ణునికి మంగళం
--((*))--
షేర్ చేయండి -దేవుని స్మరించండి
గణములు -న,న,మ,న
యతి- 8
32. నవ వనితలు గోవిందా అనుచు
ఏడు శిఖరములుయ్యేక్కీ కొలిచె
ఒకరకముననె యుత్సాహమిడ
చక చక మనసున్ అర్పించెనుగ
సరిగమనుల కీర్తన్నే పలికె
నవతరముల మార్గాన్నే పిలిచె
వెలుగులునిడి యేప్రార్ధనలకు
హరిహరులయినన్ హర్షంబొదవఁ

నగవు తగువు తె చ్చే నే యువతి
మనసు మమత మధ్యే నే కలిమి
వయసు ఉడుకు తప్పేలే బలిమి
యువతి సొగసు వల్లా నే చెలిమి
కరములతొ నె దండంబే సబబు
కుసుమములతొ దండాలూ వెసితి
పలురకముల గా రాగం పలికి
నవవిధముల పూజా లే చెసితి